Hyderabad : A delegation of BRS MLAs, MLCs, and other leaders, led by BRS Working President K.T. Rama Rao (KTR), met with Governor Radhakrishnan to lodge a complaint regarding party defections and the unfulfilled promises made by the Congress to unemployed youth.
“We brought to the Governor’s attention the ongoing attacks on the Constitution in Telangana, along with other critical issues. Our party MLAs, MLCs, and available leaders met with the Governor to discuss how the Congress party has blatantly ignored its promises to the unemployed youth and students. We detailed their announcements and promises concerning 2 lakh jobs and the job calendar. We informed the Governor about their failure to increase the number of posts for Groups 1, 2, and 3, as promised. Additionally, we explained the repressive atmosphere created by the Congress through the coercion, suppression, arrests, and false cases against students who demand the implementation of these promises.” BRS Working President K.T. Rama Rao said.
“We also highlighted incidents like the lathi charge at City Central Library and attacks on OU students, which mirror the suppressive tactics used during the movement days, now being repeated by the Congress government. The Governor responded very seriously to these issues and assured us that he would call the Home Secretary to inquire further. The BRS party stands firmly with the unemployed youth of the state and will continue to fight until all promises made by the Congress are fulfilled.”
KTR also raised concerns about constitutional violations in the state, informing the Governor about how their party MLAs and MLCs were intimidated into joining the Congress. “We are pursuing legal action and have also complained to the Speaker,” he said. The delegation brought up the case of Danam Nagender, who, despite winning as a BRS MLA, contested as a Congress candidate for MP. “We appreciate the Governor’s serious response regarding the unemployed youth,” KTR added.
“We also informed the Governor about protocol violations and how the rights of MLAs are being infringed upon. He assured us that he would seek an explanation from the government and asked us to approach him with any future issues as an opposition party. The Governor promised to ensure justice within his jurisdiction.”
KTR criticized Rahul Gandhi for his contradictory stance on protecting the Constitution while simultaneously allowing detections. “We not only report the unconstitutional acts of the Congress to the Governor but also to the President,” he stated.
Addressing the Medigadda barrage incident, KTR said, “The Congress must now bow its head in shame after spreading false propaganda that Medigadda was washed away and Rs. 1 lakh crore was wasted in Kaleshwaram. They spread false information about a minor issue. Repairs were completed within a few days. Medigadda’s ability to withstand the current floodwaters demonstrates the greatness of the Kaleshwaram project. We will visit Medigadda soon and explain the facts to the public.”
ఇదీ కూడ చదవండి-
పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంలో గవర్నర్ రాధాకృష్ణన్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు.
ఆ తర్వాత మీడియాతో కేటీఆర్ మాట్లాడితూ… తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ గారి దృష్టికి తీసుకెళ్లాం. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నాయకులందరం గవర్నర్ గారిని కలవటం జరిగింది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నదో ఆయకు వివరించటం జరిగింది. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్ లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పాం.
సిటి సెంట్రల్ లైబ్రరీ లో లాఠీ ఛార్జ్, ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణిచి వేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుందని ఆయన దృష్టికి తెచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కు సంబంధించి వాళ్లిచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ గారి తెలిపాం.
గ్రూప్ 1, 2, 3 కి సంబంధించి పోస్టులు పెంచుతామని…ఆ హామీ పట్టించుకోవటం లేదన్నది వివరించాం. గవర్నర్ గారు చాలా సీరియస్ గా ఈ అంశాలపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారు. రెండో అంశం రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగ హననం జరుగుతుందో కూడా గవర్నర్ గారికి చెప్పాం. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్న సంగతి ఆయనకు తెలిపాం. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని… స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశామని ఆయనకు వివరించాం.
బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. నిరుద్యోగుల విషయంలో ఆయన చాలా సీరియస్ గా స్పందించిన తీరుకు అభినందనలు. ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్ గారికి వివరించాం. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లవద్దని ఆయన అన్నారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తా అని చెప్పారు.
భవిష్యత్ లో విపక్షాలుగా ఎలాంటి ఇబ్బంది వచ్చిన తనను కలవాలని ఆయన కోరారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఫోజులు కొడుతూ…మళ్లీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వ్యవహారాన్ని గవర్నర్ గారి దృష్టికి తెచ్చాం.
కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ విరుద్దమైన పనులకు సంబంధించిన గవర్నర్ గారికి మాత్రమే కాదు. రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కు బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటుంది. వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తుంది. ఇక మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గు తో తలదించుకోవాలి. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారు.
కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి అయ్యాయి. ఇప్పుడు వరదలాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనం. త్వరలోనే మేడిగడ్డ ను సందర్శిస్తాం. ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని సీఎం అన్నారు. ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు. 4 వందల కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత?