హైదరాబాద్ : అంతకుముందు టెన్త్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది. పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు
కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో ఇదంతా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి తెలంగాణపై కేంద్రం కక్ష్య గట్టింది
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తోంది. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టం. తెలంగాణ రాష్ట్రంపై కక్ష్య గట్టిన కేంద్రం ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వన్ని బదనాం చేయాలని చూస్తోంది.
గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేదు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తుంది బిజెపి చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ , నిన్న పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోంది. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. బీజేపీ నేతలు తీరును నిరసిస్తూ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాము.
అది ముమ్మాటికి బిజెపి కుట్రే
అడ్డంగా దొరికిపోయిన బండి సంజయ్
క్షుద్ర రాజకీయాలకు లీకేజీలు నిలువెత్తు సాక్ష్యం
లక్షలాది మంది జీవితాలతో బిజెపి చెలగాటం
విద్యార్థి,యువత అప్రమత్తంగా ఉండండి
దుర్మార్గుల దుర్నర్గాలను ఎండగట్టండి
బిజెపి నుండి బండి సంజయ్ ను సస్పెండ్ చెయ్యండి
-మంత్రి జగదీష్ రెడ్డి
గడిచిన రెండు నెలలుగా జరుగుతున్నలీకేజీల తంతు వెనక బిజెపి కుట్ర బట్టబయలు అయ్యిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.టి యస్ పి యస్ సి ప్రశ్నాపత్రం లీకేజీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి బిజెపి కి చెందిన వాడు అని గుర్తించినప్పటికి దానిని రాజకీయ కోణంలో చూడలేదు అన్నారు.లీకేజీ లు చెయ్యడం దానిని రాజకీయం చేయలనుకోవడం బిజెపి క్షుద్ర రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు.బిజెపి ఆడుతున్న రాజకీయ క్రీడలకు విద్యార్థి యువతను అడ్డుపెట్టుకోవడం దురదృష్టకరమన్నారు.
టి యస్ పి యస్ సి నుండి నిన్నటి పదో తరగతి పరీక్షా ప్రశ్నా వరకు లీకేజీల ప్రహసనాన్ని నెరిపిన బిజెపి నేత బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయిన దొంగ అని ఆయన విరుచుకుపడ్డారు. అటువంటి దొంగ ను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని లేకుంటే ఇది మొత్తం బిజెపి కి చుట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థి యువతతో చెలగాటం ఆడుతున్న బిజెపి డ్రామాల పట్ల విద్యార్థి యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అటువంటి దుర్మార్గుల దుర్మార్గాలకు చేరమాంకం పాడేందుకు తల్లి తండ్రులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి యువత మనసులను కలత పెట్టిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేస్తే బిజెపి నేతలు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పేపర్ లీకేజీ ముమ్మాటికీ బిజెపి పార్టీ కుట్ర – మంత్రి కొప్పుల
బండి సంజయ్ అరెస్ట్ తో బాగోతం బయట పడింది – మంత్రి కొప్పుల
విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు భయ బ్రాంతులకు లోను కావొద్దు – మంత్రి కొప్పుల
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బిజెపి అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీ ల వ్యవహారమే, పథకం ప్రకారమే పేపర్ బయటకు వచ్చింది, విద్యార్థుల జీవితాలతో బిజెపి పార్టీ నాయకులు చెలగాటం ఆడుతున్నారు మంత్రి అన్నారు
టిఎస్పిఎస్సీ పేపర్ లీకేజీ లో వున్న వ్యక్తి కి బిజెపి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గతంలో అనేక ఫోటోలు బయటకు వచ్చాయి, తాజాగా పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ ల వెనక బిజెపి నాయకుల హస్తం ఉందన్నారు
తాజాగా పదవ తరగతి పేపర్ లీక్ చేసిన వ్యక్తి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సాప్ లో చేసినట్టు ఆరోపణలు రావడం వాట్సాప్ లో చేసిన తర్వాత ఆ విషయాన్ని బండి సంజయ్ దాచడం ఇందుకు నిదర్శనం, ఈ సంఘటన విద్యా వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తీయటంలో భాగమే
పదవతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కుట్ర ప్రభుత్వాన్ని బధానం చేయాలనుకుంటే తగిన శాస్తి జరిగిందని, బీజేపీ తగిన మూల్యం చెల్లించు కోక తప్పదని మంత్రి హెచ్చరించారు. ఇంక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆటలు ఇక సాగవని, పరీక్షలు సక్రమంగా నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించక పోగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ లో నిరుద్యోగుల జీవితాలతో బండి సంజయ్ లాంటి బిజెపి నాయకులు ఆడుకుంటున్నారని, అధికార దాహంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆశతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్ నీ భవిష్యత్తుని ప్రజలే బుద్ధి చెబుతారని, మంత్రి అన్నారు. పదవ తరగతి పరీక్షా పత్రం లీకేజీ కేసుల వెనక ఉన్న ఎంత పెద్దవాళ్ళు ఉన్న అందరిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్నారు..