శీతాకాల విడిది ముగించుకుని హైదరాబాద్ నుండి ఢిల్లీ బయల్ధేరిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో వీడ్కోలు పలికిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గార్లు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ విజయలక్ష్మీ, అధికారులు.తదితరులు కూడా పాల్గొన్నారు..
హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాలం విడిది ముగిసింది. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి హైదరాబాద్ హకీంపేటలోని విమానాశ్రయంలో రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఘనంగా వీడ్కోలు పలికారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి రాథోడ్ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం నూతన పట్టు వస్త్రాలను, జ్ఞాపికను, ఫలాలను అందజేశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్రపతికి వెండి వీణ జ్ఞాపికను బహుకరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నూతన పట్టు వస్త్రాలతో పాటు జ్ఞాపికను అందజేయాల్సిందిగా మంత్రి సత్యవతి రాథోడ్ గారికి అందించారు.
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనకు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమన్వయకర్తగా రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ గారు అప్పగించిన బాధ్యతల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తానై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటే ఉంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటనను విజయవంతంచేశారు.
హైదరాబాద్ శీతాకాల విడిది పూర్తి అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా గిరిజనుల పురోభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ట్రాలు అనుసరించాలని ఆకాంక్షించారు. శీతాల కాలం విడిది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు.