Big News : BRS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, CM KCR ప్రసంగం, మంత్రి కేటిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాలు

హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది.

ముందుగా పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగం తో ప్రారంభమైన ప్రతినిధుల సభ. అనంతరం బి ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం గారి కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టారు. అనంతరం లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

టీఆర్ఎస్ పార్టీ గా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన పార్టీ నేడు దేశ ప్రజల ఆకాంక్ష లను సాకారం చేసే దిశగా బి ఆర్ ఎస్ జాతీయ పార్టీగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు:

• రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం
• పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగినం.
• అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. • అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి.
• మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తం.
• వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది.
• దేశ జీఎస్డీపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతం
• కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే నెంబర్లేసి నా ఆఫిసులో ఇవ్వండి. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దాం.
• మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలుగా ఉపయోగించుకోవాలి. ఈ 3,4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి.
• మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నయి.
• ఎపి తలసరి ఆదాయం రూ. 2,19,518. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయి.
• తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు.
• కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గం. 12.45 కల్లా అక్కడికి చేరుకొండి.
• గం. 1.58 నుంచి గం. 2.04 వరకు మంత్రులు వారి వారి చాంబర్స్ కు పోవాలి.
• సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్, లంచ్, తర్వాత డిస్పోస్.
• మెయిన్ గేట్ గుండా సీఎం, మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలకు ఉద్దేశించింది.
• 3 గేట్లు, నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించింది
• సౌత్ ఇస్ట్ జనరల్ విసిటర్స్ కు ఉద్దేశించింది
• మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ.
• కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పిచ్చి మనం ఎలా ముందుకుపోవాలని మేధోమదనం చేసాను.
• తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నాం. • తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.
• మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు.
• మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు ?
• 2021-2022 కు ముందు జీఎస్టీ ఆదాయం 34 వేల కోట్లు వుంటే, అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నం.
• మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం.
• నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి.
• పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి.
• కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసింద.
• తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారు.
• క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండి.
• ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి.
• మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం.
• ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్…
• దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు. • తప్పక విజయం సాధిస్తాం.
• బిఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు.
• అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్ ను కూడా నడపవచ్చు.

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అజయ్ కుమార్,ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,తన సహచర ఎంపీ బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.టీ.రామారావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ భవన్ లో పార్టీ ప్లీనరీ సందర్భంగా వారు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్,ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులకు శుభాకాంక్షలు చెప్పారు.అలాగే, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి,రాములు నాయక్, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి,అజయ్ కుమార్, రాజేశ్వర్ రెడ్డిలను కలిసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కె.కేశవరావు గారి ప్రసంగం – ముఖ్యాంశాలు

• బిఆర్ఎస్ కు బలం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కార్యకర్తలే
• గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయంలో కార్యకర్తలు గొప్ప పాత్ర పోషించారు.
• బిఆర్ఎస్ జెండా నాయకుల, కార్యకర్తలు కలిసి పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలి.
• ‘నేషనల్ మిషన్’ తో ముందుకు సాగాలి
• స్టేట్ లీడర్స్ పరస్పర సమన్వయంతో పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలి.
• నాయకులు తమ లోపాలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి.
• దేశానికి కేసీఆర్ విజనరీ లీడర్ షిప్ అవసరం
• నేను నెహ్రూ తో కూడా స్టూడెంట్ లీడర్ గా కలిసిన. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను చూసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్
• కేటిఆర్ హైదరాబాద్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారు.
• తెలంగాణ రాష్ట్రం దేశమే అబ్బురపడేలా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం, 125 అడుగుల అంబేద్కర్, కొత్త సెక్రటేరియట్ వంటి గొప్ప గొప్ప నిర్మాణాలను చేపట్టింది.
• నిన్నటి దాకా నదులు సముద్రంలో కలిసేవి. కానీ కేసీఆర్ పాలనలో నదులు పొలాలకు పారుతూ, ఇండ్లల్లకు మళ్ళుతూ సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.
• ఇతర ప్రభుత్వాలు 75 ఏండ్లలో చేయలేని పనులను 9 ఏండ్లలో చేసి చూపించగలిగాం.
• ప్రధాని మోడి దేశాన్ని అదానీకి దోచిపెడుతుంటే, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి నిధులను మళ్ళిస్తున్నారు.
• రాష్ట్రంలోని జల వనరులను లభ్యతను, నదీ ప్రవాహాలను స్క్రీన్ పై ఇంజనీర్ లా సోదాహరణంగా వివరించిన సీఎం కేసీఆర్ గారి వంటి వ్యక్తి మరొకరు లేరు.
• వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన ఘనత సీఎం కేసీర్ గారికే దక్కుతుంది. ప్రజారోగ్యం రంగంలో తెలంగాణ తెచ్చిన సంస్కరణలను పార్లమెంటు స్టాండింగ్ కమిటి గొప్పగా ప్రశంసించింది. • పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరిచేందుకు చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలతో సీఎం కేసీఆర్ కార్యకర్తల మనసు గెలుచుకున్నారు. వాళ్ళ కష్టాలు, అవసరాలు తెలుసుకుని ముందుకు సాగుతున్న తీరుతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది.
• ప్రైవేటైజేషన్ కాదు నేషనలైజేషన్ కావాలన్న ప్రోగ్రెసివ్ లీడర్ సీఎం కేసీఆర్
• బిఆర్ఎస్ పార్టీ దేశ వికాసమే లక్ష్యంగా నికార్సైన ఎజెండాతో ముందుకు సాగుతున్నది.

బి ఆర్ యస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టిస్ట్ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ అనుచరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమాని డానియల్ పెయింట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపఠాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసి తన అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలపాలని కోరుతూ గురువారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డికి అందజేస్తున్న సందర్భంగా…ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్,బొల్లం మల్లయ్య యాదవ్,రవీంద్ర నాయక్,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

బీఆర్ఎస్ ప్లీనరీకి హాజరైన ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందించిన ఎంపీ రవిచంద్ర. బీఆర్ఎస్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన ప్లీనరీకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.ఆయన బుధవారం తెల్లవారుజామున తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి తిరుపతిలో కలియుగ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.ఆ తర్వాత విమానంలో హైదరాబాద్ వచ్చీ రాగానే నేరుగా ప్లీనరీ జరిగే తెలంగాణ భవన్ చేరుకున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ను రవిచంద్ర కలిసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X