Hyderabad : Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, Dr. B. R. Ambedkar Open University released the University New Year Diary and Calendar-2026 on Tuesday at the campus.
On this occasion Prof. Chakrapani said that the university employees should work with more accountability will make efforts to provide the learners and adhere for quality education.

He also wish new year greetings to the employees. Dr. L. Vijaya Krishna Reddy, Registrar, Prof. G. Pushpa Chakrapani, Director Academic; Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of Service Associations were present on the occasion.
The representatives of various Associations, Kantham Prem Kumar, NC. Venugopal, Vishwanath, Bharat Reddy, Dr. Yakesh Daida, felicitated to Prof. Ghanta Chakrapani, and Dr. LVK Reddy for resolving the employees’ issues.
Also Read-
నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నూతన సంవత్సర -2026 డైరీ, క్యాలెండర్ లను ఉపకులపతి ఆచార్య. ఘంటా చక్రపాణి గురువారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. అనతరం ఆయన ఉద్యోగులకు, విద్యార్ధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆచార్య. చక్రపాణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు రానున్న రోజుల్లో మరింత చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.యల్.విజయా కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, పలు విభాగాల అధిపతులు, డీన్లు అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంతం ప్రేమ కుమార్, ఎన్సీ. వేణుగోపాల్, విశ్వనాథ్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా తదితరులు పాల్గొన్నారు.
