హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించ్చొద్దు అని అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు, అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్యోగులు అంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో జేఎసే ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; కన్వీనర్ ప్రొ వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ మహేష్ గౌడ్, డా. వై. వేంకటేశ్వర్లు, రుశేంద్ర మణి, అధ్యాపకేతర ఉద్యోగుల సంఘం నేతలు ఎండి హబీబుద్దిన్, షబ్బీర్, డా. యాకేష్ దైద, డా. అవినాష్, డా. రాఘవేందేర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read-
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ వర్షిటీ ఐక్య కార్యాచరణ సమితి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది.