హైదరాబాద్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువతి (అసిస్టెంట్ కొరియోగరాఫర్)పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా (జానీ మాస్టర్) లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు, వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది లవ్ జిహాద్ కేసు. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి? ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గం.
ఈ ఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు, హిందూ మహిళలను మతం మార్చి లైంగికంగా వేధించే ఘటనలు తీవ్రమైనా.. రాష్ట్ర ప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా వ్యవహరించకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలి*. రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంశాఖపై ఒక్కసారి కూడా సమీక్షించలేకపోవడంతో శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై వేధింపులకు, లవ్ జిహాదీ చర్యలకు పాల్పడిన షేక్ జానీపై గతంలోనూ నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆరునెలల పాటు జైలుశిక్ష విధించినట్లు స్వయంగా పోలీసులే వెల్లడించారు. తాజాగా మరోసారి మహిళా డ్యాన్సర్ పై, మైనర్ గా ఉన్నప్పటి నుంచీ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ కేసును చులకనగా తీసుకోవడాన్ని బిజెపి మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది.
Also Read-
ఇటువంటి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాగం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ కేసును విచారణను జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా పారదర్శకంగా విచారణను జరిపించేలా చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పా రెడ్డి గారు హెచ్చరించారు .