“కేసీఆర్ కు అహంకారం తలకెక్కింది”

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?

ఫీల్డ్ కు వెళ్లని సీఎంను ఏం చేయాలి?

కేసీఆర్ కు అహంకారం తలకెక్కింది

రైతులు అల్లాడుతుంటే కేసీఆర్ ఢిల్లీ పోవడమేంది?

ఎకరాకు రూ.30 వేల పరిహారం యుద్దప్రాతిపదికన అందించాలి

నిర్ణీత వ్యవధిలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే 30 శాతం రైతులు నష్టపోయేవాళ్లు కాదు

చేతికొచ్చిన పంట నీళ్లపాలై రైతులు అల్లాడుతున్నరు

కౌలు రైతుల దుస్థితి వర్ణణాతీతం

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్ : ‘‘ఇది ఎన్నికల ఏడాది. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు కదా… నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలో రూ.40 వేల సాయం చేసే ఫైలుపై సంతకం చేస్తాడేమో అనుకున్నా… కానీ అవేవీ చేయకుండా రైతులను మోసం చేసిండు. పైగా ప్రశ్నించే వాళ్లను వాడు, వీడు అని సంబోధిస్తున్నడు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కింది. కేసీఆర్… అసలు నీ బతుకేంది? తెలంగాణ ఉద్యమానికంటే ముందు నీ బతుకేందో మాకు తెల్వదా? అధికారం ఉందనే అహంకారం, వేల కోట్ల అక్రమ సంపాదించారనే మదంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నడు… పోయే కాలం దాపురించింది.’’

అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన మంత్రులు ఇతరులపైకి నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

• ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో తడిసిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి బాధలు తెలుసుకున్నారు. గంభీరావుపేట సమీపంలోని ఐకేపీ కేంద్రంలో బతుకమ్మ చీరలతో తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకుంటున్న రైతులను కలిశారు. అనంతరం నాగంపేట గ్రామంలో వడగంల వానలతో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. రైతులు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• ఈరోజు సిరిసిల్ల జిల్లాలో 1.7 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తే రైతులు సగానికిపైగా నష్టపోయారు. అధికారులు మాత్రం 17 వేల ఎకరాల్లోనే పంట నష్టమైందని ఫీల్డ్ మీదకు పోకుండా లెక్కలు రాస్తున్నరు. ఫీల్డ్ కు వెళితే ఒక లెక్క… వెళ్లకపోతే వాళ్లకు ఒక బాధ. నిన్న ఒక ఆఫీసర్ ను సస్పెండ్ చేశారట. మరి ఫీల్డ్ కు వెళ్లని సీఎంను ఏం చేయాలి?

• రైతులు అల్లాడుతుంటే కేసీఆర్ ఢిల్లీ ఏం చేయడానికి పోయిండు? రైతులంటే లెక్కలేదా? మార్చిలో అకాల వానలతో 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటే… కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటించి 2.8 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని చెప్పి ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున 288 కోట్లు విడుదల చేస్తున్నానన్నడు. వారం రోజుల్లో పరిహారం ఇస్తానన్నడు. ఇంతవరకు పైసా ఇయ్యలే.

• రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్. వాళ్ల లెక్కల ప్రకారమే 70 వేల మంది రైతులు చనిపోయారు. ఈసారి పంట పూర్తిగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా… వడ్ల కొనుగోళ్లు మాత్రం ఇంతవరకు ప్రారంభించలే. ఐకేపీ కేంద్రాల్ల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయినయ్. కొనుగోళ్లు ప్రారంభించి ఉంటే 30 శాతం రైతులకు నష్టపోయేవాళ్లు కాదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు.

• గతంతో పోలిస్తే ఈసారి ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి అదనంగా ఖర్చుపెట్టారు పురుగు నివారణ కోసం… ఇగ కౌలు రైతుల బాధలు వర్ణణాతీతం. అప్పు తెచ్చి కౌలు చేశారు. అప్పు తీర్చలేరు.. కౌలు ఇయ్యలేడు… తిండికి వెళ్లని పరిస్థితి.

• ప్రభుత్వం పంపే నివేదికలు మూడు రకాలుగా ఉంటది. పంట నష్టం అంచనా నుండి తుది నివేదిక వరకు తేడాలే. చివరకు రైతులకు 8 ఏళ్లుగా నయాపైసా సాయం చేయలే. ప్రజలను దారి మళ్లించేందుకు సచివాలయం ప్రారంభం పేరుతో డ్రామాలు… తీరా చూస్తే సచివాలయం కూడా లీకులే. ఇది లీకుల ప్రభుత్వం. పేపర్ లీకేజీ, ప్రభుత్వ లీకేజీలతోనే కాలయాపన చేస్తున్నరు.

• ముఖ్యమంత్రి జిమ్మిక్కులు చేయడంలో నేర్పరి. ఆయన ఫెయిల్యూర్ పెద్ద నిదర్శనం సచివాలయానికి ఎదురుగానే ఉన్న హుస్సేన్ సాగర్. ఆ నీళ్లను శుద్ధి చేసి కొబ్బరినీళ్లలా మారుస్తానని ఇఛ్చిన హామీనే అమలు చేయని మూర్ఖుడు కేసీఆర్.

• ఇఛ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని సీఎం కేసీఆర్. రుణమాఫీ, సబ్సిడీ యూరియా, విత్తనాలు, నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఏ హామీలను అమలు చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ఎకరాకు ఎరువులు, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రూ.30 వేల సబ్సిడీ ఇస్తున్నడు.

• రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు అప్పులియ్యడం లేదు. చివరకు బ్యాంకు మెట్లు కూడా ఎక్కనీయడం లేదు. రైతులకు ఏనాడూ ఒక్కసారి కూడా బోనస్ ఇయ్యని దుర్మార్గుడు. కేసీఆర్ పాలనలో ఏ రైతు కూడా లక్షాధికారి కావాలని కోరుకోవడం లేదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికే వ్యవసాయం చేస్తున్నరు. పీజీలు చేసిన నిరుద్యోగులు ఉద్యోగాలియ్యకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నరు. తీరాచూస్తే పంట నష్టపోయి బాధపడుతున్నరు.

• చేతికొచ్చిన బిడ్డ పోతే తండ్రి ఎంత బాధపడుతారో…. చేతికొచ్చిన పంట పోయి రైతులు అట్లా బాధపడుతున్నరు. నిన్న ట్విట్టర్ టిల్లు వచ్చి మళ్లీ రైతులను ఆదుకుంటున్నట్లు కోతలు కోసిండు.. ఏం సాయం చేసిండో చెప్పాలి.

• కేంద్రం జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్రానికి రూ. 3వేల కోట్లు మంజూరు చేస్తే … అందులో రైతులకు ఎంత ఇచ్చావో చెప్పాలి. అసలు ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశావో సమాధానం చెప్పాలి. నిత్యం కేంద్రంపై పడి ఏడవడం సిగ్గుచేటు… కర్నాటకలో ఎన్నికలు జరిగితే మహారాష్ట్రకు పోయి ప్రచారం చేస్తున్న బాపతు కేసీఆర్. చివరకు మహారాష్ట్రలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికలు జరిగితే ఒక్క స్థానం కూడా గెలవకుండా చిత్తుగా ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ కు బీజేపీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.

• ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం మేల్కొని నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.30 వేల సాయం అందించాలి. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది. వాడు, వీడు అని మాట్లాడుతున్నడు. అసలు నీ బతుకేంది? తెలంగాణ ఉద్యమానికంటే ముందు నీ బతుకేందో మాకు తెల్వదా? అధికారం ఉందనే అహంకారం, వేల కోట్ల అక్రమ సంపాదించారనే మదంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నడు… పోయే కాలం దాపురించింది.

• ఇది ఎన్నికల ఏడాది. రైతులకు ఎకరాకు రూ.10వేల సాయం చేస్తానని హామీ ఇస్తూ జిమ్మిక్కు చేస్తున్నడు. ఇగనైనా నష్టపోయిన రైతులందరికీ సాయం చేయ్. నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలో రూ.40 వేల సాయం చేసే ఫైలుపై సంతకం చేస్తాడేమో అనుకున్నా… కానీ అవేవీ చేయకుండా రైతులను మోసం చేసిండు.

• ఇకనైనా పంట నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం పర్యటించాలి. క్షేత్రస్థాయి నుండి వాస్తవిక నివేదికలు తెప్పించుకోవాలి. రైతులను ఆదుకోవాలి. కేంద్రంతో కూడా అవసరమైతే మాట్లాడి సాయంపై చర్చిస్తాం. రైతులను ఎట్లా ఆదుకోవాలో ఆలోచించాల్సిన మంత్రులు తప్పించుకునేందుకు ఇతరులపై నెట్టివేయడం సిగ్గు చేటు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా.? అనే అనుమానం కలుగుతోంది. నిజంగా ప్రభుత్వం ఉందని భావిస్తే… ఇప్పటికైనా రైతుల శ్రేయస్సును ద్రుష్టిలో యుద్ద ప్రాతిపదికన సాయం అందించాలి.

• తడిసిన ధాన్యాన్ని కొనే విషయంలోనూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. తేమ పేరుతు, తాళు పేరుతో అడుగడుగునా మోసం చేస్తున్నారు. వాస్తవానికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోంది. అట్లాంటప్పుడు రైతుల నుండి వడ్లు కూడా సేకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదెందుకు?

• కేసీఆర్ కుటుంబాన్ని భరించి భరించి రైతులు విలవిల్లాడుతున్నరు. దయచేసి కేసీఆర్ పాలన ఎట్లుందో ఒక్కసారి కదిలించి చూడండి. వాళ్ల బాధేందో తెలుస్తది. రైతులంటే కేసీఆర్ కు చులకన. అడుగడుగునా అవమానించిడు. సన్న వడ్లు, దొడ్డు వడ్లు వేయాలని ఇబ్బండి పెట్టిండు. కేసీఆర్ కుటుంబం కోటీశ్వరులవుతున్నారే తప్ప రైతులను మాత్రం బికారీలుగా మార్చారు. ఇకనైనా కేసీఆర్ రైతులను ఆదుకోవాలి. యుద్దప్రాతిపదికన సాయం అందించాలి.

G-20 లోగో

చేనేత వస్త్రంపై G-20 లోగోను రూపొందించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన వెల్ది హరిప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయనను సత్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

ఉద్యోగుస్తులారా….. మీ కోసం మేం జైలుకెళ్లేందుకు సిద్ధం

-మీరంతా బీజేపీతో కలిసి పోరాడేందుకు రోడ్డెక్కండి

-జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ న్యాయబద్దమే

-తక్షణమే వారిని రెగ్యులరైజ్ చేయాల్సిందే

-లంచాలివ్వనిదే కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పని కావడం లేదు

-సీఎం కుటుంబానికి లంచమిస్తే కార్యదర్శులను కూడా రెగ్యులరైజ్ చేస్తారేమో

-బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటన జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేస్తాం

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

-పంచాయతీ కార్యదర్శుల సమక్షంలోనే సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ విడుదల చేసిన బండి సంజయ్

‘‘ఉద్యోగులారా… భయపడి ఇంట్లో కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం కావు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నారో అది నెరవేరాలంటే రోడ్లెక్కాల్సిందే. తెలంగాణ కోసం మీరు చేసిన పోరాటాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ పోరాట పటిమను మళ్లీ చూపండి. మీకు అండగా మేమున్నాం.

బీజేపీ చేస్తున్న తెలంగాణ మలిదశ పోరాటంలో భాగస్వాములు కండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలోని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైనదేనని, వారికి బీజేపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు. తక్షణమే వారిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖను జూనియర్ కార్యదర్శుల సమక్షంలోనే మీడియాకు విడుదల చేశారు.

అనంతరం వారిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులు డిమాండ్ సమంజసమైనదే. పోటీ పరీక్షలు పాసై అన్ని అర్హతలు సాధించిన జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయి నాలుగేళ్లయినా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం.

• కేసీఆర్ సీఎం అయ్యాక ఓట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరని, అందరినీ పర్మినెంట్ చేస్తామని నిండు అసెంబ్లీలో చెప్పారు. మాట తప్పారు.

• గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ది పనుల్లో మీ పాత్ర కీలకం. కేంద్రం పంచాయతీలకు అవార్డులిస్తోందంటే కారణం మీరే తప్ప సీఎం తట్టమోయలేదు. మీరు తల్చుకుంటే ఏదైనా సాదించవచ్చు. ప్రభుత్వాన్ని కూల్చేవచ్చు. కానీ ప్రజాస్వామ్యబద్దంగా మీరు సమ్మె చేస్తున్నారు. అయినా మీకు, రెగ్యులర్ కార్యదర్శులకు మధ్య కొట్లాడ పెడుతున్నరు. ఇది దుర్మార్గం.

• జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న న్యాయబద్దమైనదే. ఎక్కడైనా ప్రొబేషనరీ పీరియడ్ రెండేళ్లే ఉంటది. నాలుగేళ్లు పూర్తయినా ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు?

• కేసీఆర్ పాలనలో సింగరేణి, విద్యుత్, ఆర్టీసీసహా అన్ని వర్గాల ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నరు. రొడ్డెక్కే పరిస్థితి వచ్చింది.

• ఉద్యోగులారా… భయపడి ఇంట్లో కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం కావు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నారో అది నెరవేరాలంటే రోడ్లెక్కాల్సిందే. తెలంగాణ కోసం మీరు చేసిన పోరాటాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ పోరాట పటిమను మళ్లీ చూపండి.

• సీఎం కుటుంబం వేల కోట్లు దోచుకుంటోంది. అందులో ఒక్క శాతం ఇస్తే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి. కేసీఆర్ పాలనలో లంచాలివ్వనిదే ఏ పని కావడం లేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా కలిసి కేసీఆర్ కుటుంబానికి ఒక నెల లంచమిస్తే పర్మినెంట్ చేస్తారేమో… బీఆర్ఎస్ లో దళారీలు ఉన్నారు. వాళ్లను పట్టుకుంటే పనవుతుందేమో..

• పంచాయతీ కార్యదర్శులతో గొడ్డు చాకిరీ చేయించుకుని రెగ్యులరైజ్ చేయకపోవడం దుర్మార్గం. పవిత్రమైన దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా రెగ్యులరైజ్ చేస్తానన్న హామీని అమలు చేయకుండా వాళ్లతో చాకిరి చేయించుకుని రాక్షసానందం పొందడం దుర్మార్గం.

• కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆయన సంగతి చూసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. కార్యదర్శులు చేసే ఉద్యమానికి బీజేపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోంది. మిమ్ముల్ని (కార్యదర్శులను ఉద్దేశించి) సస్పెండ్ చేస్తే… మీరేం భయపడకండి… మీ తరపున మేం ఉద్యమిస్తాం.. మేం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మిమ్ముల్ని బెదిరిస్తే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం.

• మాకు జైలు కొత్తకాదు. కేసులు కొత్తకాదు. 317 జీవో విషయంలో ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లినం. నిరుద్యోగుల కోసం జైలుకు పోయినం. రైతుల కోసం లాఠీదెబ్బలు తిన్నం. రౌడీషీట్లు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసినా వెనుకాడేది లేదు. ఈ ప్రభుత్వం ఉండేది 5 నెలలే. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసి తీరుతాం. వారి న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం.

• రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఒక్కటే చెబుతున్నా… సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ కార్మికులుసహా ఉద్యోగస్తులంతా తెలంగాణ కోసం చేసిన ఉద్యమాలను గుర్తుకు తెచ్చుకోండి. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మలిదశ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా.

• తెలంగాణలో ప్రజలకు, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను ఏం చేసినవో చెప్పకుండా కర్నాటక ఎన్నికల సంగతి, అక్కడ హామీల సంగతి నీకెందుకు? మీ అయ్య తాగుతున్న బాటిల్ సంగతి చెప్పు. ఇక్కడ సంపాదించిన సొమ్మునంతా మీ అయ్య కర్నాటకలో పంచుతున్న విషయం వాస్తవం కాదా? బీజేపీని ఓడించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ డబ్బులించేందుకు సిద్ధమని మీ అయ్య సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ తో చెప్పిన విషయం వాస్తవం కాదా?

మీ వెంట మేమున్నాం…. పోరాడండి

-కేసీఆర్ మిమ్ముల్ని మోసం చేసేందుకు మళ్లీ జిమ్మిక్కులు చేస్తాడు

-నమ్మి మోసపోకండి

-మిడ్ మానేరు ముంపు బాధితులకు సంఘీభావం తెలిపిన బండి సంజయ్ కుమార్

‘‘ఈ ప్రభుత్వం కొనసాగేది 5 నెలలే. మీరు గెలిపించిన ఎమ్మెల్యే జర్మనీకి వెళ్లిపాయే. కొదురుపాక కేసీఆర్ అత్తగారి ప్రాంతమని, మోసం చేయడని నమ్మి ఓట్లేసి సీఎంను చేస్తే మిమ్ముల్ని నిండా ముంచిండు..మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. మళ్లీ వచ్చి మిమ్ముల్ని మోసం చేసేందుకు జిమ్మిక్కులు చేసేందుకు సిద్ధమైతున్నరు. రడీగా ఉండండి. మీవన్నీ న్యాయబద్దమైన డిమాండ్లే. మీ పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నాం. మీ డిమాండ్లను పరిష్కరించే వరకు మీతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చీర్లవంచ గ్రామంలో పర్యటించి మిడ్ మానేరు బాధితులను కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• మిడ్ మానేరు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అయినా మీ సమస్యలు పరిష్కారం కాలేదు. కేసీఆర్ యాడికి పోయినా ఓట్టేసి పచ్చి అబద్దాలు చెబుతాడు. కొండగట్టు, ధర్మపుర, రాజన్న ఆలయం, యాదాద్రికి వచ్చి ఓట్టేసి హామీలిస్తడు.. ఏదీ అమలు చేయడు..

• మిడ్ మానేరు బాధితులకు సాయం చేస్తానని హామీ ఇచ్చి 8 ఏండ్లు అయ్యింది. బాధితులకు ఇంటికి రూ. 5లక్షలిస్తానని మాట ఇచ్చి తప్పిండు…

• గతంలో నేను ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్రూం రాని వాళ్ల లిస్ట్ పంపండి. కేంద్రంతో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానని చెప్పిన. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపితే కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయిస్తానని చెప్పిన. ఇంతవరకు ఆ ప్రతిపాదనలే ఇవ్వలేదు.

• ఈ ప్రభుత్వం కొనసాగేది 5 నెలలే. మీరు గెలిపించిన ఎమ్మెల్యే జర్మనీకి వెళ్లిపాయే. కొదురుపాక కేసీఆర్ అత్తగారి ప్రాంతమని, మోసం చేయడని నమ్మి ఓట్లేసి సీఎంను చేస్తే మిమ్ముల్ని నిండా ముంచిండు..మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. మళ్లీ వచ్చి మిమ్ముల్ని మోసం చేసేందుకు జిమ్మిక్కులు చేసేందుకు సిద్ధమైతున్నరు. రడీగా ఉండండి

• మీవన్నీ న్యాయబద్దమైన డిమాండ్లే. మీ పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నాం. మీ డిమాండ్లను పరిష్కరించే వరకు మీతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం.

• వేములవాడ నియోజకవర్గంలోని రుద్రవరంలో మిడ్ మానేరు బాధితులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X