Big Challange – CM KCR के खिलाफ चुनाव लड़ने को तैयार: पोंगुलेटी श्रीनिवास रेड्डी

हैदराबाद : पूर्व सांसद और खम्मम जिले के नेता पोंगुलेटी श्रीनिवास रेड्डी ने कहा है कि वह मुख्यमंत्री कल्वाकुंट्ला चंद्रशेखर राव के खिलाफ चुनाव लड़ने के लिए तैयार हैं। उन्होंने कहा कि यहां केसीआर से कोई नहीं डरता। मीडिया प्रतिनिधियों द्वारा पूछे गए एक सवाल का जवाब देते हुए पोंगुलेटी ने यह टिप्पणियां की।

गुरुवार की सुबह बीजेपी के विधायक ईटेला राजेंदर सहित भाजपा के शीर्ष नेताओं ने पोंगुलेटी श्रीनिवास रेड्डी से खम्मम में उनके आवास पर मुलाकात की। पोंगुलेटी के साथ, पूर्व मंत्री और संयुक्त महबूबनगर जिले के प्रमुख नेता जुपल्ली कृष्णराव उपस्थित थे। बीजेपी नेताओं ने पोंगुलेटी को बीजेपी में शामिल होने का आह्वान किया। लंबी चर्चा के बाद उन्होंने मीडिया से बात की।

इस अवसर पर बोलते हुए, पोंगुलेटी ने कहा कि केसीआर अपने निजी स्वार्थ के लिए प्रशासन चला रहे हैं। उन्होंने कहा कि केसीआर को बाहर करने के लिए सभी को एकजुट होना चाहिए क्योंकि उनका लक्ष्य एक है। पोंगुलेटी ने भाजपा में शामिल होने या नहीं होने के सवाल पर कोई स्पष्टीकरण नहीं दिया है।

भाजपा नेताओं से चर्चा का मुख्य विषय केवल एक ही था। पोंगुलेटी ने कहा कि हमारा मकसद केसीआर के भ्रष्ट शासन को खत्म करना है। उन्होंने कहा कि सीएम केसीआर ने तेलंगाना के युवकों और लोगों के सपनों और आकांक्षाओं को रौंद डाला है।

इस बैठक में भाजपा पार्टी की भर्ती समिति के अध्यक्ष और हुजुराबाद के विधायक ईटेला राजेंदर के साथ भर्ती समिति के सदस्य कोंडा विश्वेश्वर रेड्डी, दुब्बका विधायक रघुनंदन राव, एनुगु रविंदर रेड्डी और येन्नम श्रीनिवास रेड्डी ने भाग लिया।

ज्ञात हो कि बीआरएस पार्टी ने पार्टी विरोधी गतिविधियों के लिए पोंगुलेटी और जुपल्ली को निलंबित कर दिया है। उसके बाद अभी भी अनिश्चितता है कि वे किस पार्टी में शामिल होंगे। बीजेपी, कांग्रेस और वाईएसआरटीपी उन्हें अपनी पार्टी में शामिल करने की कोशिश कर रहे हैं।

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమని మాజీ ఎంపీ, ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను చూసి ఇక్కడ ఎవరూ భయపడటం లేదని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.

గురువారం (మే 4) ఉదయం ఈటల రాజేందర్ సహా బీజేపీ ముఖ్య నేతలు ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. పొంగులేటితో పాటు మాజీ మంత్రి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కీలక నేత జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. బీజేపీ నేతలు వీరిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. సుదీర్ఘ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కేసీఆర్ తన వ్యక్తిగత స్వార్థం కోసమే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. తమ అందరి లక్ష్యం ఒక్కటేనని కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ ఏకం కావాలని ఆయన అన్నారు. బీజేపీలో చేరుతున్నారా? లేదా అనే అంశంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

‘నేడు బీజేపీ నాయకులతో ప్రధానంగా చర్చించిన అంశం ఒక్కటే. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించడమే మా లక్ష్యం’ అని పొంగులేటి అన్నారు. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆలోచనల్ని, ఆశయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని ఆయన ధ్వజమెత్తారు.

ఈ సమావేశంలో బీజేపీ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ పొంగులేటిని, జూపల్లిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు ఏ పార్టీలో చేరతారనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. వారిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌టీపీ ప్రయత్నిస్తున్నాయి.

గత నెల పొంగులేటి టీమ్‌తో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయింది. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ టీమ్ ముందు పొంగులేటి డిమాండ్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

నేడు బీజేపీ నేతల ముందు కూడా పొంగులేటి ఇలాంటి డిమాండే పెట్టి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X