“ఎమ్మెల్సీ ‘ఛాంపియన్ ట్రోఫీ’ బీజేపీదే”

ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠమిది

హిందూ సమాజమంతా కాంగ్రెస్ కు ఇచ్చిన ‘‘రంజాన్’’ గిఫ్ట్ ఈ తీర్పు

బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్….

ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు

డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చెంప చెళ్లుమన్పించారు

నోట్లు పంచినోళ్ల గూగుల్ పే లెక్కలన్నీ తీస్తాం….ఎవరినీ వదిలిపెట్టబోం

కాంగ్రెస్ పై యుద్ద భేరీ మోగిస్తున్నాం

దమ్ముంటే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి

ఇకపై ఏ ఎన్నికలు జరిగినా గెలపు బీజేపీదే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్….

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలుపుతో అంబురాన్నింటిన సంబురాలు

కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్న సంజయ్

కరీంనగర్ : తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని బీజేపీ టీమ్ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమన్నారు. ముస్లింలంతా ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తే హిందూ సమాజమంతా కాంగ్రెస్ ను ఓడించి ఆ పార్టీకి ‘‘రంజాన్’’ గిఫ్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.

బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్ చెప్పిన బండి సంజయ్ బీజేపీకి అండగా నిలిచిన ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు తెలిపారు. డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ అభ్యర్ధి చెంప చెళ్లుమన్పించారని చెప్పారు. నోట్లు పంచిన వారిని వదిలిపెట్టబోమని, గూగుల్ పే వివరాల లెక్కలు తీస్తున్నామని తెలిపారు.

కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ ‘‘విక్టరీ’’ గుర్తును చూపిస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఏమన్నారంటే….

బీజేపీ విజయానికి అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలందరికీ హ్యట్సాఫ్. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు శిరస్సు వంచి వందనాలు చెబుతున్నా. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది నాలుగో విజయం. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతోపాటు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఇయాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు సాధించాం.

Also Read-

నరేంద్రమోదీ నీతి, నిజాయితీ పాలనను, తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులను గుర్తించడంతోపాటు కార్యకర్తలు చేసిన పోరాటాలును గుర్తు చేసుకుని అద్బుతమైన విజయాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది.

మా కార్యకర్తలు టీచర్లు, నిరుద్యోగులు, ప్రజల పక్షాన చేసిన పోరాటాలను గుర్తు చేశాం. లాఠీదెబ్బలను, జైలుకు వెళ్లిన సంఘటలను గుర్తు చేసినం. మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను రాయితీ ఇవ్వడంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. అవన్నీ గుర్తు చేసినం. మా పక్షాన నిలబడ్డందుకు అనందంగా ఉంది.

మొన్న ఛాంపియన్ ట్రోఫిలో ఇండియా గెలిచింది. ఆరోజు, ఈరోజు అదే చెప్పిన. మాది ఇండియా టీం. విజయం సాధించి తీరుతామని చెప్పినం. వాళ్లు డబ్బు సంచులు పంచారు. మేం ఓటర్లను నమ్ముకున్నాం. నోట్ల సంచులు ఓడిపోయాయి. ఓటర్లే గెలిచారు. ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలుస్తుందని పదేపదే దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీకి నేను సవాల్ విసురుతున్నా… ఈవీఎంల ద్వారా మాత్రమే కాదు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా బీజేపీయే గెలిచింది. దీనికేం సమాధానం చెబుతారు.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేసినా, డబ్బు సంచులను పంచినా ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినా వారి కుట్రలు ఫలించలేదు. మేం నయాపైసా ఖర్చు చేయలేదు. మా కార్యకర్తలే ఇంటింటికీ తిరిగారు. వారి కష్టం, మోదీ పాలన, అమ్మవారి దయవల్లే ఈరోజే మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెళ్లుమన్పించారు.

వాస్తవానికి బీఎస్పీ అభ్యర్ధి 2వ స్థానానికి వస్తారని భావించాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనకు మద్దతిచ్చి, పైసలిచ్చిందో… అవన్నీ గమనించిన ప్రజలు ఆ అభ్యర్ధిని 3వ స్థానానికి పరిమితం చేశారు.

మార్పు కోరుతున్న ప్రజలకు బీజేపీ దిక్సూచిలా కన్పించింది. ఇకపై ఏ ఎన్నికలు జరిగినా విజయపరంపర బీజేపీదే. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ గెలపు బీజేపీదే. ఎందుకంటే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివ్రుద్దికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. సొమ్ము కేంద్రానిదైతే.. సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటోంది.

ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమైనరు. మా పోరాటాలు, జైళ్లు, తిన్న లాఠీదెబ్బలను గుర్తు చేసుకున్నరు. మా కార్యకర్తల తలలు పగిలి రక్తం చిందించిన సంఘటనలను, త్యాగాలను గుర్తు చేసుకుని ఓటరు మహాశయలు ఓటేసి ఆశీర్వదించారు.

వారి నమ్మకాన్ని నిలబెడతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ యుద్దం చేసేందుకు సిద్ధమవుతున్నం. ఇకనైనా కాంగ్రెస్ దిగిరావాలి. రాష్ట్రంలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. వెంటనే 6 గ్యారంటీలను అమలు చేయాలి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తి చేయాలి. ఇచ్చిన మాట మేరకు రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలి. అట్లాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలు చేయాలి. 5 పెండింగ్ డీఏలు, రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్, జీపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. వీరితోపాటు రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి.

బీజేపీ ఎక్కడైనా పైసలు పంచిందా.. మీరే చెప్పండి. కొందరు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విచ్చలవిడిగా డబ్బులు పంచారు. ఓటుకు రూ.5 వేల దాకా యూపీఐ ద్వారా పంపిణీ చేశారు. అవన్నీ బయటకు తీస్తాం. అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును పంచి ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలుద్దామనుకున్నరు. ఎవరినీ వదిలిపెట్టబోం. రాజకీయాలను కలుషితం చేసే వాళ్లను వదిలిపెట్టబోం. నిజాయితీగా కష్టపడే కార్యకర్తల పోరాటాలను, త్యాగాలకు విలువ లేకుండా చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.

తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ వాటా అధికం. కానీ వెనుకబడ్డ ఆదిలాబాద్ లో నిధులు ఎక్కువ ఖర్చు చేస్తోంది. దీనినేమంటారు? అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీ సమాజం, హిందూ సమాజం ఓట్లేసి గెలిపించింది. ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ పార్టీ యావత్ హిందూ సమాజం ఈ తీర్పు ద్వారా ‘‘రంజాన్’’ గిఫ్ట్ ఇచ్చింది. పండుగ చేసుకోమని చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని, బండి సంజయ్ ను ఓడించేందుకు ముస్లిం సంఘాలన్నీ ఏకమై ‘బండి సంజయ్ కు గుణపాఠం చెబుదాం. అందరూ ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపినిచ్చింది. చివరకు ఏమైంది? వాళ్లంతా ఒకటైతే… హిందూ సమాజం కూడా ఏకమై బీజేపీ పక్షాన నిలిచింది.

ఇప్పుడు కాంగ్రెస్ కు సవాల్ విసురుతున్నా… ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారని భావిస్తే… తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. దమ్ముంటే వెంటనే ఎన్నికలు జరపాలి. బీజేపీ దమ్మేందో చూపిస్తాం.

ఈ విజయం చిరస్మరణీయం

  • మా బాధ్యతను మరింత పెంచింది
  • రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగాం
  • కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటింది. ఈ విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరికీ, ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గారు విజయం సాధించడం, ఇదే నియోజకవర్గం నుంచి ఉాపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గారు గెలవడం గర్వకారణం. ఈ విజయాన్ని సాధించేందుకు పాటుపడిన మేధావులకు, పట్టభద్రులకు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. మేధావులు మొదలుకుని అన్ని వర్గాలు, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయం ఒక నిదర్శనం.

రాష్ట్రంలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే నిలబడ్డారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల బీజేపీ గెలవడం, మరోచోట ఉపాధ్యాయ సంఘం విజయం సాధించడం.. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసహనానికి, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఓ ఉదాహరణ.

ఉపాధ్యాయులు మల్క కొమురయ్య గారిని గెలిపిస్తే, పట్టభద్రులు చిన్నమైల్ అంజిరెడ్డి గారిని విజయతీరాలకు చేర్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో విజయం సాధించడం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు రాజీలేని పోరాటం చేస్తాం. ఈ విజయంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X