హైదరాబాద్: అమెరికా వర్జినియా లో ఘనంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదిన వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న దయన్న కుటుంబ సభ్యులు, సినీ నిర్మాత దిల్ రాజు, అభిమానులు, BRS NRI సెల్ శ్రేణులు, తానా ప్రతినిధులు, తదితరులు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:
ప్రతి సంవత్సరం నా జన్మదిన వేడుకలు చేస్తున్న NRI మిత్రులు, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు! తెలంగాణలో వున్న ప్రతి ఒక్క NRI కుటుంబాన్ని కాపాడుకుంటాను. ప్రభుత్వం తరుపున ఏ సహాయం కావాలన్న అందించే బాధ్యత నాది. నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు 7 సార్లు గెలిపించారు. నన్ను గెలిపించిన ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. సీఎం కెసిఆర్ గారి దయవల్ల మంత్రిని అయ్యాను. పంచాయితీరాజ్ లాంటి పెద్ద శాఖను ఇచ్చారు
పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ బాగా అభివృద్ది చెందాయి. తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో అత్యధిక అవార్డులు వచ్చాయి. సీఎం కెసిఆర్ గారు బంగారు తెలంగాణ ను చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలి. నా జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి పేరు పేరునా, కృతజ్ఞతలు!, ధన్యవాదాలు!!
తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలి
తొమ్మిదేళ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయింది
హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నది
ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులతో తెలంగాణకు వరస కడుతున్నాయి
24 గంటల కరంటు, సాగునీరు, తాగునీరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనతో ముందడుగు వేస్తున్నది
రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల కరంటు, అందుబాటులో విత్తనాలు, ఎరువులతో తెలంగాణ సాగు దశమారింది
విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాలలో తెలంగాణ వేగంగా విస్తరిస్తున్నది
కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ఇస్తున్న అవార్డులే దీనికి నిదర్శనం
ఎదుగుతున్న తెలంగాణకు మట్టిబిడ్డల సహకారం కావాలి
హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో ఆశీస్సులు అందించిన వేద పండితులు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఎ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్ష్యతన జరిగిన ప్రవాస తెలంగాణవాసుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కానుగంటి, టోని జాను, మోహిత్ కర్పూరం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు అనిల్ బందారం, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి కంచర్ల, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షురాలు మహాతి రెడ్డి, నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, భానుప్రసాద్ ధూళిపాల, శేఖరం కొత్త, హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు సాయి వర్మ, సీతారాం రెడ్డి భవనం, శ్రీకాంత్ జలగం, అశోక్ వర్దనం, నరేందర్ మెతుకు, సుధాకర్, సత్య, ఉదయ్, వెంకట్ ఎంకా, నాగరాజు రెడ్డి నల్లా, అరవింద్ తక్కళ్లపల్లి, రజనీకాంత్ కొసనం తదితరులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
పోడు భూముల్లో ఇక దర్జాగా సాగు
లబ్ధిదారులకు పట్టాల పంపిణీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తరతరాలకు జీవనోపాధి అందించే భూములను అమ్ముకోవద్దని హితవు
పట్టాల పంపిణీకి ముందే లబ్ధిదారుల అకౌంట్లలో రైతుబంధు జమ
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడి
నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్ బుక్కులు అందిస్తోందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం దొమ్మర్ చౌడ్ తండాలో (డీ.సీ తండా) లబ్ధిదారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పోడు భూముల పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అమీర్ నగర్ తండా, సర్పంచ్ తండా, డీ.సీ తండా, కోనాపూర్ కేసి తండా, ఊప్లనాయక్ తండా, సోమిడి తండా, బిల్యానాయక్ తండా, గుడిమల్కాపూర్ తండాలకు చెందిన 190 మంది లబ్ధిదారులకు 590 ఎకరాల పోడు భూమికి సంబంధించిన పట్టా బుక్కులు అందజేశారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోడు భూముల్లో పంట సాగు చేసుకునేందుకు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. వారి బాధలను దూరం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పట్టాలతో లక్షలాది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై యాజమాన్య హక్కులు ఏర్పడ్డాయని హర్షం వెలిబుచ్చారు. తరతరాలకు జీవనోపాధిని అందించే ఈ భూములను అమ్ముకోవద్దని మంత్రి హితవు పలికారు. పోడు భూముల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ సీజన్ నుండే రైతు బంధు, రైతు బీమా పథకాలను వర్తింపచేస్తుందన్నారు. ఇందులో భాగంగా పట్టాల పంపిణీ కంటే ముందే లబ్ధిదారుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ అవుతాయని, రైతు బీమా కూడా వర్తిస్తుందని వివరించారు.
దేశంలోనే మరెక్కడా లేనివిధంగా లక్షలాది ఎకరాల పోడు భూములకు హక్కులు పొందినందున ఇకపై అడవుల జోలికి వెళ్లకుండా వాటి సంరక్షణకు అడవి బిడ్డలుగా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్నప్పుడే వర్షాలు అనుకూలిస్తాయని, తద్వారా పంటలు సాగు చేసుకోగల్గుతామని అన్నారు. ఇంకను అర్హులు ఎవరికైనా పోడు పట్టాలు రానట్లయితే త్వరలోనే వారికి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి, తండాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా, సేద్యానికి 24 గంటల విద్యుత్ సరఫరా వంటి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు.
ప్రతి తండాకు సీసీ రోడ్లు, బిటి రోడ్లు నిర్మిస్తున్నామని, ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నామని, ఆసరా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావు, కమ్మర్పల్లి ఎంపీపీ గౌతమి, జెడ్పిటిసి రాధ, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుణవీర్ రెడ్డి, స్ధానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ లో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, జూలై 5: సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి బీఆర్‌ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మామడ మండలంలోని పరిమండల్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శాస్త్రినగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడు సీయం కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి, దేశానికి శరణ్యమన్నారు. బీఆర్‌ఎస్‌ది అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. సీయం కేసీఆర్ అద్భుతమైన పాలన, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు.
టి ఎస్ జెన్కో ఆడిటోరియంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనం, ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి విరివిగా తీసుకు పోవాలని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.అందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన తొలివిజయం ప్రస్తుతం దేశానికే రోల్ మోడల్ గా మారింది అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.తద్వారా ప్రభుత్వం నమోదు చేసుకున్న విజయాలలలో ఉద్యుగులుగా మీరు పడిన శ్రమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు వివరించిన వాల్లమౌతామని ఆయన చెప్పారు.
విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు సమిష్టి కృషితో నమోదు కాబడ్డవని ఆయన పేర్కొన్నారు.తెలంగాణా స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎర్రగడ్డలోని టి ఎస్ జెన్కో ఆడిటోరియంలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేలానానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విశిష్ట అతిధులుగా ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమా రెడ్డి,ఎన్ పి డి సి ఎల్ సి యం డి గోపాల్ రావులు పాల్గొన్న ఈ సమ్మేళనానికి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జె ఏ సి కన్వీనర్ రత్నాకర్ రావు, కో-చైర్మన్ శ్రీధర్, కో-కన్వీనర్ బి సి రెడ్డి,వైస్ చైర్మన్ వజీర్,, శ్యామ్ సుందర్, తులసీ నాగరాణి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి లతో పాటు ఆర్గనైజింగ్ రాంజీ, నెహ్రూ, కలువల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మాటల్లోనే జరిగిన అభివృద్ధిని వివరించడం ద్వారా అందులో భాగస్వామ్యం అయిన మీ శ్రమ వారికి బోధపడుతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విజయాలు నమోదు చేయడంతో నేటి తరానికి విద్యుత్ కోతలు అంటే ఏమిటో బిందెడు నీళ్ల కోసం కోసేడు దూరం పోయిన తంతు తెలియడం లేదన్నారు.అదే దశాబ్ది ఉత్సావాలలో ఈ విషయం తెలిపోయిందన్నారు.అన్నం విలువ అమ్మ విలువ లేనప్పుడే తెలుస్తోందన్నారు.రాష్ట్ర సాధన కోసం నిబద్దతో పోరాటం చేయడమే కాకుండా వచ్చిన తెలంగాణాలో విశ్వసనీయతతో అధికారం అప్పగించిన ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరుగులు పెట్టించారని ఆయన కొనియాడారు.
మంచినీళ్ల కోసం బారెడు దూరం పోకుండా ఉండేందుకు గాను ఇంటింటికి మంచినీరు,24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా,మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పూడిక తీసివేత లతో సస్యశ్యామలంగా మారిన పంట పొలాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నాయన్నారు.అన్నింటికీ మించి యావత్ భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినిమయంలో నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి విజయం విద్యుత్ రంగానిదే నన్నారు.అంతకు ముందు అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ రంగాన్ని గాడిలోకి తెచ్చి పారదర్శకత కు పెట్టింది పేరుగా విద్యుత్ సంస్థలను నిలిపిన ఘనత యాజమాన్యాలదన్నారు.ఒకరిద్దరు కోడి గుడ్డు మీద ఈకలు పీకే సబ్ స్టాండర్డ్ గాళ్ళు సి యం డి ప్రభాకర్ రావు వంటి వారి మీద అవాకులు చెవాకులు పేలినా సూర్యుడి మీద ఉమ్మేసిన చందంగా మారాయని ఆయన ఎద్దేవాచేశారు.
సరస్వతి నిలయం మహేశ్వరం లో మరో విద్యాలయం..మహేశ్వరం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ జీవో విడుదల
హరితహారం సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కోరిక మేరకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హామీ మేరకు 100 సీట్లతో మెడికల్ కళాశాల,జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ బుధవారం జీవో విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ.
మహేశ్వరం నియోజకవర్గ ప్రజల తరుపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరంకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ బుధవారం జీవో జారీ చేసింది.100 మెడికల్ సీట్లతో పాటు జనరల్ ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఇటీవలి మహేశ్వరం లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కోరిక మేరకు మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు.ఆ హామీ మేరకు బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీచేసింది.దాంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నియోజకవర్గ ప్రజల తరుపున మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.దినదినాభివృద్ది చెందుతున్న మహేశ్వరం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్న ఫ్యాక్టరీలు,అంతర్జాతీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండటంతో మెడికల్ కళాశాల,ఆస్పత్రి మంజూరు చేయటం పట్ల స్థానికులు హర్షం చేస్తున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పరంపర కొనసాగుతుంది
మంచి చేసేవారిని ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు
అసత్య ఆరోపణలతో నాపై విమర్శ చేసే వారు అభివృద్ధిలో నాతో పోటీపడాలి
కేసిఆర్ కుటుంబాన్ని తిట్టడానికి మోడీ తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండలం వేల్పూర్ – పచ్చల నడ్కూడా గ్రామాల మధ్య 5.88 కోట్లతో బిటి రోడ్ డబుల్ లైన్ గా పనుల శంకుస్థాపన,పచ్చల నడ్కుడా – కొత్తపల్లి గ్రామాల మధ్య (చింతలూరు వరకు) 9 కోట్లతో BT రోడ్ డబుల్ లైన్ పనుల శంకుస్థాపన,మోతె నుండి బడా భీంగల్ వయా అక్లూర్ 6.60 కోట్లతో బి.టి రోడ్ డబుల్ లైన్ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సీఎం కేసిఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి పక్షాలు ఎంత అసత్య ఆరోపణలు చేస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తా..విమర్శలకు వెన్నక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటే ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు నియోజక వర్గ అభివృద్ది కోసం ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధి లో తనతో పోటీ పడాలని,అభివృద్ది నిధుల మంజూరు చేయించి తనలాగా జి ఓ కాపీలు చూపెట్టాలని సవాల్ చేశారు. అభివృద్ది చేస్తున్న వారెవరో మాటలు చెప్తున్న వారెవరో ప్రజలకు తెలుసని తనను బాల్కొండ నియోజకవర్గ ప్రజలు గుండెలో పెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. మంచి పనులు చేస్తున్న వారిని ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడు కుంటారని ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన పై విలేకరులు అడిగిన ప్రశ్నపై మంత్రి మాట్లాడుతూ…
“మోదీ పర్యటన కు వచ్చే ముందు 1000 కోట్లు రెండు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చి తెలంగాణ కు రావాలి.గుజరాత్, యూపీ, కర్ణాటక కు ఎలాగైతే మెట్రో పనులకు డబ్బులు ఇచ్చావో అలాగే తెలంగాణ మెట్రో పనులకు డబ్బులు ఇవ్వాలి. కాళేశ్వరం ,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి.తెలంగాణ కు వచ్చి కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికి కవిత ను జెల్లో వేస్తాం అని అనడానికి తెలంగాణ కు రావద్దు. అన్ని రాష్ట్రాల ను సమానంగా చూసే బాధ్యత ప్రదాని పై ఉంటుంది ప్రధాని అన్ని రాష్టలకు తండ్రిలాటివాడు. యూపీ గుజరాత్ కి డబ్బులు ఎక్కువిచి తెలంగాణ మొండి చేయి చూపడానికి తెలంగాణ కు రావద్దు”అని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,బి ఆర్ ఎస్ నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.