రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం – మంత్రి కొప్పుల

Hyderabad: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల నంది మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన కెనాల్ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, సాగునీరు లేక, ఎడారిగా మారిందని, రాష్ట్ర అవతరణ తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆకుపచ్చ తెలంగాణగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతాంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చి, దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని తెలిపారు.

ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…

ఈ నూతన కెనాల్ 12.14 కోట్ల వ్యయంతో, నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు, ఈ కెనాల్ ద్వారా, సుమారు 20 గ్రామాల్లోని తొమ్మిది వేల ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానున్నదని మంత్రి అన్నారు, ఇప్పటికే కెనాల్ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి, భూమి కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించామని, సీఎం కేసీఆర్ దూర దృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నీటి కష్టాలను దూరం చేశారన్నారు, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి, సాగు నీరు అందని కరువు జిల్లాలకు సైతం నీరు అందిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

విద్యుత్ విషయంలో కూడా అద్భుతమైన ప్రగతిని, తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు, ఒకప్పుడు వ్యవసాయం లేని తెలంగాణలో, ప్రస్తుతం సాగు రంగంలో దేశంలోనే ఒక ప్రత్యేకత సాధించిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలోపు ఈ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి, రైతులకు సాగు నీరు అందించడం కోసం కృషి చేస్తామని ఇరిగేషన్ అధికారులు మంత్రి గారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సత్యా రాజ్ చంద్ర, ఈఈ ప్రసాద్, డీఈ కుమార్, సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, సర్పంచ్ సమంతుల జానకి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X