ఢిల్లీలో BRS పార్టీ నూతన కార్యాలయం, ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ ఈ రోజు హస్తినకు

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఢిల్లీలో ఏర్పాట్లు చురుగ్గ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మంగళవారం, బుధవారం రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులు, కొంతమంది మంత్రులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు బయులుదేరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ వరుస నోటీసులు జారీ చేస్తుండటం, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరోవైపు, రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆదివారం ప్రముఖ వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్‌ తేజతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుధాకర్‌ తేజ సూచనల ప్రకారం పార్టీ కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్, పలువురు రాజకీయ ప్రముఖులు, పలు రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ పర్యటనలో పలువురు రిటైర్డ్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు, రైతు, దళిత సంఘాల నేతలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారని సమాచారం.ఇప్పటికే వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు నేతలు ప్రారంభోత్సవానికి హాజరవుతామని పార్టీ కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు.

తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున చట్ట సభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం దేశంలోని పలు రాష్ర్టాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్‌ ఫర్‌ ఇండియా, దేశ్‌ క నేత.. కిసాన్‌ కీ భరోసా, అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X