రంగారెడ్డి: శంషాబాద్ మండలం నర్కుడలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాళీమందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత. ఆలయంలో కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన జరిగి నేటికీ మూడేళ్లు పూర్తి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత.
పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, బెంగాలీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దీపాంకర్ పాల్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మందిరాన్ నస్కర్, ఆలయ కమిటీ సభ్యులు హేమంత్ దాస్, వరుణ్ రాణా, శంభూ రాయ్, శరత్ రాయ్.
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్
“నర్కుడ గ్రామంలో కాళీమాత ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. 11-12 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఆలయాన్ని నిర్మించిన కమిటీకి అభినందనలు. కాళీమాతను కలకత్తా నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కాళీమాత ఆశీర్వదం హైదరాబాద్ పై ఉంది. బెంగాల్ సమాజం హైదరాబాద్ లోనూ ఉంది.. సీఎం కేసీఆర్ అందరినీ సొంతవారిలా చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ అందరినీ కలుపుకుని ముందుకెళ్తోంది. ఆలయం ముందు మంచి రోడ్డు వేయించేందుకు నా వంతు కృషి చేస్తా. 8 ఏళ్లలో అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది.. తెలంగాణ అభివృద్ధి చూశాం. భారతదేశ ముఖచిత్రం మార్చే దృక్పథంతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ కు మీ మద్దతు ఉండాలి.
రవీంద్రనాథ్ ఠాగూర్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు బెంగాల్ లో జన్మించారు. దేశ నిర్మాణంలో బెంగాలీ సమాజ్ పాత్ర కీలకం. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి ఎప్పటికీ గర్వకారణం, స్ఫూర్తిదాయకం. వివేకానందుడు అమెరికాలో ఇచ్చిన ప్రసంగం భారతీయుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. తెలంగాణ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది.”
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కామెంట్స్
“తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖను ఎంతగానో అభివృద్ధి చేసింది. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ఎలా అభివృద్ధి చేసారో కళ్ల ముందుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధిని మనమంతా గమనించాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ వన్ గా తీర్చిద్దారు.