हैदराबाद: पुलिस पिछले चार-पांच दिनों से तेलंगाना-छत्तीसगढ़ राज्य की सीमाओं पर बड़े पैमाने पर कॉम्बिंग कर रही है। इस सिलसिले में सोशल मीडिया पर एनकाउंटर और कॉम्बिंग से जुड़ी कई खबरें वायरल हुई हैं। बस्तर आईजी सुंदर राज ने ताजा इस पर प्रतिक्रिया दी है। इस बारे में एक बयान जारी किया गया।
बयान के अनुसार, बस्तर इलाके में शांति और सुरक्षा बनाए रखने के मकसद से सुरक्षा बल केंद्र सरकार और छत्तीसगढ़ सरकार के आदेशों के अनुसार पूरी लगन से काम कर रहे हैं। नक्सलियों को खत्म करने के लिए इस इलाके में लगातार ऑपरेशन चल रहे हैं। एंटी-नक्सल ऑपरेशन में हिस्सा ले रहे सुरक्षा बलों की जान को कोई खतरा न हो, इसके लिए अब ऑपरेशन पूरा होने से पहले उनकी डिटेल्स बताना मुमकिन नहीं है।

ऑपरेशन को कॉन्फिडेंशियल रखने के साथ-साथ सुरक्षा बलों की सुरक्षा भी बहुत ज़रूरी है। अब से, अगर कोई खास डेवलपमेंट होगा, तो हम खुद मीडिया को बताएंगे। तब तक कोई भी अनऑफिशियल खबर न फैलाए। बस्तर आईजी सुंदर राज ने लोगों से अपील की है कि वे अफवाहों पर ध्यान न दें।
Also Read-
ఎన్కౌంటర్లు – కూంబింగ్, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పందన
హైదరాబాద్ : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లు, కూంబింగ్‌కు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తాజాగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం భద్రతా దళాలు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నక్సల్ నిర్మూలన కోసం నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న భద్రతా బలగాల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఆపరేషన్లు పూర్తికాకముందే వాటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం ఇకనుంచి కుదరదు.
ఆపరేషన్లను గోప్యంగా ఉంచడంతో పాటు, భద్రతా బలగాలను కాపాడుకోవడం కూడా చాలా అవసరం. ఇక నుంచి ఏదైనా కీలక పరిణామాలు ఉంటే తామే స్వయంగా ప్రకటనలు చేస్తాం అప్పటివరకు ఎవరూ అనధికారిక వార్తలను ప్రసారం చేయవద్దు. వదంతులను ప్రజలు నమ్మొద్దు’ అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ విజ్ఞప్తి చేశారు. (ఏజెన్సీలు)
