లాల్ దర్వాజా శ్రీ శ్రీ శ్రీ సింహ వాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బండా ప్రకాష్ మరియు…

హైదరాబాద్ : లాల్ దర్వాజా శ్రీ శ్రీ శ్రీ సింహ వాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ & తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌ. శ్రీ. డా. బండా ప్రకాష్ ముదిరాజ్ గారు. ఘనంగా స్వాగతం పలికిన లాల్ దర్వాజా ముదిరాజ్ సంఘం ప్రతినిధులు.

ఈ సందర్భంగా బండ ప్రకాష్ గారు మాట్లాడుతూ...

ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సింహవాహని అమ్మవారి బోనాల జాతరకు చారిత్రాత్మక, విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది అని అన్నారు.1954 నుండి మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైందని చెప్పారు.

1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కోసం ఒక సంవత్సరం అమ్మవారి జాతర, బోనాలు నిర్వహించకుండా ఆపిన చరిత్ర కూడా ఉన్నది అని గుర్తు చేశారు.
ఈ దేవాలయ కమిటీని ఇక్కడి ప్రాంత ప్రజలే ఎన్నుకొని ఆ కమిటీ ద్వారా పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

ఇటీవలే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు ఈ దేవాలయ అభివృద్ధి కోసం కొంత స్థలం కేటాయించి, దేవాలయ అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేశారని చెప్పారు.

నగరానికి చెందిన మంత్రివర్యులు గౌ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు గౌ శ్రీ మహమ్మద్ అలీ గారు ఈ దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో చేసే ఊరేగింపు కార్యక్రమానికి జాతీయస్థాయి గుర్తింపు లభించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు. ఢిల్లీలో నిర్వహించే మహంకాళి అమ్మవారి బోనాల జాతరను విజయవంతం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. స్వాగతం పలికిన ముదిరాజ్ సంఘం నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సురేందర్ ముదిరాజ్, మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సదానందం, బద్రీనాథ్ గౌడ్ , తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనకయ్య ముదిరాజ్ ,కోశాధికారి బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు సతీష్ ముదిరాజ్, రమేష్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఆందోళ‌న చెందొద్దు

బాధిత రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంది

సీతారాంపురంలో త‌డిసిన ధాన్యాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

రైతుల‌కు భ‌రోసానిస్తూ ఓదార్చిన మంత్రి ద‌యాక‌ర్ రావు

సీతారాంపురం : ఆకాల వ‌ర్షాలు రైతుల‌ను ఆగం చేశాయ‌ని, అనేక మంది రైతులు పంట‌లు న‌ష్ట‌పోయార‌ని, వారిని ఆదుకోవ‌డానికే కేంద్రం కాద‌న్నా, వ‌ద్ద‌న్నా, సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నార‌ని, ఇప్పుడు ధాన్యం కూడా త‌డ‌వ‌డం రైతుల‌కు ఆశ‌నిపాతంగా మారింద‌ని, అయితే, న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని త‌డిసిన ధాన్యం రైతుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు భ‌రోసానిచ్చారు.

దేవ‌రుప్పుల మండ‌లం సీతారాంపురం గ్రామంలో ఆకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి మంగ‌ళ‌వారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ధైర్యం చెప్పారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లోత‌ట్టు ప్రాంతంలో పెట్ట‌డం ప‌ట్ల సంబంధిత అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, వ‌చ్చిన ధాన్యాన్ని వెంట వెంట కొనుగోలు చేసి, గోదాముల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితోపాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖల అధికారులు త‌దిత‌రులు ఉన్నారు.

2000 పడకల నిమ్స్ నూతన భవనానికి భూమిపూజ

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో శంఖుస్థాపన

అవసరమైన అన్ని ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలి

నెలాఖరులోగా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తి చేయాలి

వైద్య సిబ్బంది మంచి సేవలు అందించి, ప్రజల మన్ననలు పొందాలి

5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలి

ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశాలు

ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని, త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించే విధంగా ఉండే ఈ నూతన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేసుకొని, నిర్మాణం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో తొలి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించే నూతన నిమ్స్ నిర్మాణం అందుబాటులోకి వస్తే, 1500 గా ఉన్న పడకల సంఖ్య మొత్తం 3500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తయితే తద్వారా మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, ఒక్క నిమ్స్ లోనే మొత్తం 3700 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా నిమ్స్ సేవలు మరింత విస్తృతం అవుతాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ తెలంగాణలో నెలకొని ఉన్నట్లు అవుతుందన్నారు. ఫెర్టీలిటీ సేవలు ప్రజలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు.

రాష్ట్ర ప్రజల అవసరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్సీ, బస్తీ దవాఖాన, సీ హెచ్ సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ 1 ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు. నూతనంగా ప్రారంభించిన ఎం ఎన్ జే ఆసుపత్రి ఆంకాలజీ బ్లాక్ లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలన్నారు. కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నారు.

స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్లైన్ ద్వారా..

వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో భర్తీ చేసే 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్ లైన్ విధానం (CBT) లో నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి అదేశాలు జారీ చేశారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు 40,936 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్ష కోసం హైదరాబాద్ తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో సెంట్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల తుది ఫలితాలు విడుదల కంటే ముందే,అసిస్టెంట్ ప్రొఫెసర్ల ట్రాన్ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆదర్శప్రాయులుగా ఉండాలి…

అందరికంటే ముందు, అందరి కంటే తర్వాత ఆసుపత్రికి వచ్చి వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శ ప్రాయులని మంత్రి అన్నారు. ప్రతి రోజు రెండు గంటల పాటు ఆసుపత్రుల్లో రౌండ్స్ వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ దొరకదని, బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ గారు 12వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సహా అన్ని రకాల వైద్య సిబ్బంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కృషి చేయాలన్నారు.

సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇంచార్జీ డైరెక్టర్ బీరప్ప, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ జయలత, ఇత అధికారులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

నష్టపోయిన ప్రతీ పంటలకు పరిహారం చెల్లిస్తాం

అన్నదాతలు అధైర్యపడవద్దు..అండగా ఉంటాం

తేమశాతం 17 నుండి 20 వరకు సడలించాలని ఎఫ్ సి ఐ కి విజ్ఞప్తి చేశాం

20 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లతో మాట్లాడుతున్నాం

రాష్ట్రంలో దాదాపు 5వేల కోనుగోలు కేంద్రాల ద్వారా 1350 కోట్ల విలువగల 7.51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అకాల వర్షం కురిసిందని, పంట చేతికి అందే సమయంలో ఎప్పుడు అకాల వర్షాలు పడ్డా 10 నుండి 20 శాతం మాత్రమే పంట నష్ట పోయేదని కాని మొదటి సారి వందకు వందశాతం పూర్తిగా పెట్టిన ప్రతీ పంట నష్టపోయారని, అందుకే ప్రతీ ఎకరాన్ని పరిహారం నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోలు ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా వేగవంతంగా కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, దుర్షెడ్, గోపాల్ పూర్, గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మంత్రి గంగుల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు..చేతికి వచ్చిన పంట నెల పాలవడం బాధాకరం అని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని అన్నారు.

అకాల వర్షానికి ఇప్పటికే పంట నష్టపోయిన వారికి ఎకరానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిర్ణయించి ప్రకటించడం జరిగిందనీ అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెడితే తేమశాతం 20 వరకు వస్తె దానిని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. కొనుగోలు కేంద్రానికి రాకుండా పొలంలోనే పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకుంటుందని, అన్నదాతలు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు.

వరుసగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తొందరగా ఎండే పరిస్థితి లేకపోవడంతో తేమశాతం 17 నుండి 20 వరకు సడలించాలని ఎఫ్ సి ఐ వారిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు. కరీంనగర్ జిల్లాతో పాటు ఎక్కడ బాయిల్డ్ రైస్ మిల్లులకు అవసరం ఉంటాయో అక్కడికి తడిసిన ధాన్యాన్ని పంపించాలని ఆయ జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని అన్నారు. అన్నదాతలను ఆదుకోవడమే మా అంతిమ లక్ష్యం అని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, సుమారు 7 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందనీ అన్నారు. ఇప్పటికీ 1350 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందనీ, ఈ వారంలో కొనుగోలు వేగవంతం అవుతుందని అన్నారు. గతంలో ఏప్రిల్ నెలాఖరు వరకు 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం 7 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందనీ అన్నారు.

ఎఫ్ సి ఐ కొనుగోలు కేంద్రాలను 15వ తేది నుండి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయగా, ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దానికంటే ఐదు రోజుల ముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం వలన కొంత మంది రైతులను కాపాడగలిగామని అన్నారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి సమీక్ష

ఈ సమీక్షలో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ మరియు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీకేరిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ… చెంచు చిన్నారులు, కిశోర బాలికల సంక్షేమంతోపాటు వారికి పౌష్టికాహారం అందించే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ‘గిరి పోషణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. వారిలో ఎదుగుదల లోపాన్ని అధిగమించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ మరింత సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని మారు మూల ప్రాంతాల్లో అధికారులతో మరింత అవగాహన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలు జరగవని పేర్కొన్నారు. గౌర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్య వివాహాలు బ్రేక్ పడిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ గారు కల్యాణలక్ష్మి’తో పేద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అని స్పష్టం చేశారు.

అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సైతం అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తినివెళ్ళేవిధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వయసుకు తగ్గ ఎత్తు బరువు లేని పిల్లల విషయంలో బరువులు, ఎత్తులు సరిగ్గా ఉండేలా చూసి, బరువు తక్కువ ఉన్న పిల్లలకు మరింత పట్టిష్టమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X