हैदराबाद: 2023 विधानसभा चुनाव जीतकर सत्ता में आई कांग्रेस सरकार अहम फैसले ले रही है। ज्ञात हो कि विशेष रूप से लोगों के स्वास्थ्य पर ध्यान केंद्रित करते हुए आरोग्य श्री सेवाओं का मूल्य 10 लाख तक बढ़ा दिया गया है। साथ ही, सरकार पहले से ही ड्रग्स और मारिजुआना (गांजा) पर नकेल कस रही है, जो युवाओं को प्रभावित कर रहे हैं।
रेवंत रेड्डी सरकार ने ताजा तेलंगाना में गुटखा के निर्माण और बिक्री पर प्रतिबंध लगाने का निर्णय लिया है। इस संबंध में खाद्य सुरक्षा आयुक्त ने आदेश जारी किया है। आदेश में कहा गया है कि यह प्रतिबंध 24 मई 2024 से पूरे तेलंगाना राज्य में प्रभावी होगा।
इसी क्रम में खाद्य सुरक्षा एवं मानक अधिनियम 2006 की धारा 30 की उपधारा (2) के खंड (ए) के तहत प्रदत्त शक्तियों का प्रयोग करते हुए 2,3,4 खाद्य सुरक्षा एवं मानक (विक्रय पर प्रतिबंध एवं प्रतिबंध) सार्वजनिक स्वास्थ्य के हित में विनियमन 2011, तेलंगाना राज्य खाद्य सुरक्षा आयुक्त, तंबाकू/पाउच/पैकेज/कंटेनर आदि में पैक किए गए गुटका/पानमसाला के निर्माण, भंडारण, वितरण, परिवहन, बिक्री पर प्रतिबंध लगा है।
यह भी पढ़ें-
తెలంగాణలో గుట్కా తయారీ మరియు అమ్మకంపై నిషేధం
హైదరాబాద్ : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అదికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం దృష్టి పెట్టి వచ్చి రాగానే ఆరోగ్య శ్రీ సేవల విలువను 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అలాగే యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు. ఈ నిషేధం 24 మే 2024 నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆ ఉత్తర్వులో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30 లోని సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (a) కింద అందించబడిన అధికారాలను అమలు చేయడంలో 2,3,4 ఆహార భద్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, పరిమితి) రెగ్యులేషన్ 2011 ప్రజారోగ్య దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, పొగాకు,నికోటిన్‌లను పొగాకు/ పౌచ్‌లు/ ప్యాకేజీ/ కంటెయినర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా/పాన్‌మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించిబడింది. (ఏజెన్సీలు)