‘అజీజ్ కథలు’ ఆవిష్కరణ సభ విజయవంతం, ఈ వక్తలు ఏమన్నరంటే…

కర్నూలు : సమాజ సమస్యలను సాహిత్యమనే అక్షరాలతో పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నానికి నాంది పలుకుతూ ప్రముఖ రచయిత యస్.డి.వి. అజీజ్ రచించిన కథల సంకలనము ‘అజీజ్ కథలు’క్లస్టర్ విశ్వవిద్యాలయం కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆవిష్కరించబడింది. కర్నూలులోని కె.వి.ఆర్. ప్రభుత్వ మహిళ కళాశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమం సాహిత్యప్రియులను ఆకట్టుకుంది.

కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి. దేవికా రాణి సభకు అధ్యక్షత వహిస్తూ, “ఇప్పటి యువత పుస్తకపఠనానికి మరింత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది. ‘అజీజ్ కథలు’ సమాజంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ నూతన మార్గదర్శనం ఇస్తాయి” అని అన్నారు. క్లస్టర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ ఈ కథల సంపుటిని ఆవిష్కరించి, “అజీజ్ గారి రచనలు సునిశితమైన పాత్రచిత్రణ, భావగాఢతతో పాఠకులను ఆకట్టుకుంటాయి. ఆయన రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి, ఇది గర్వకారణం” అని ప్రశంసించారు.

జి. పుల్లయ్య రవీంద్ర విద్యాసంస్థల అధినేత మాట్లాడుతూ, “ఈ కథలు మనిషిలో సాంఘిక స్పృహ పెంచి మంచి మార్పు తీసుకురావడానికి దోహదం చేస్తాయి” అని తెలిపారు. ఈ సభలో డాక్టర్ బి. ఆర్. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ దండ బోయిన పార్వతి దేవి, డాక్టర్ ఫమీదా బేగం, కళాశాల అధ్యాపకులు మరియు 300 మంది విద్యార్థులు ఈ పుస్తకావిష్కరణ సభలో సాహిత్య రసానుభూతిని ఆస్వాదించారు.

Also Read-

కార్యక్రమ నిర్వహకురాలు శ్రీమతి జయలక్ష్మి సభను విజయవంతంగా నిర్వహించారు. జాతీయ గీతాలాపనతో ముగిసిన ఈ సభ సాహిత్య ప్రేమికులందరికీ మరపురాని అనుభవాన్ని అందించింది. సమాజంలో మార్పుకు దారితీసే ప్రతి అక్షరం అజీజ్ కథలలో ప్రతిబింబిస్తోంది. ఈ కథలు చదువరుల హృదయాలను గెలుచుకోవడమే కాక, ఆలోచనలకు కొత్త దిక్సూచులు చూపించగలవని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X