Awareness Program: మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండాలి : డాక్టర్ నాగరాజ శెట్టి

హైదరాబాద్/కర్నూల్ : మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని క్లస్టర్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ నాగరాజ శెట్టి పేర్కొన్నారు. గురువారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి అనూష ఆధ్వర్యంలో దిన్నెదేవరపాడు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో యూనిట్-3 అవగహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డీన్ నాగరాజ శెట్టి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పరిసరాలు శుభ్రం చేయడం వల్ల చుట్టూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, అదేవిధంగా వాలంటీర్స్ మీ ఇంటి చుట్టూ కూడా గుంతల్లో నీరు ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి పరిరక్షించాలని తెలిపారు. ఆర్ కే ఎస్ కే డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ డాక్టర్ మల్లికార్జున్ రావు, చైల్డ్ సైకాలజిస్ట్ రాజశేఖర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కు పరిశుభ్రత పైన అవగాహన కల్పించారు. మధ్యాహ్నం డాక్టర్ విమలా రోధే, డాక్టర్ ఎల్లా కృష్ణ, ఓబులేసు హాజరై మాట్లాడారు.

కెవిఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్-1 డాక్టర్ బి నికిత ఆధ్వర్యంలో మామిడాలపాడు గ్రామంలో డాక్టర్ అరుణ్ ఉదయం మెడికల్ క్యాంపు నిర్వహించి సిపిఆర్ గురించి, మధ్యాహ్నం డాక్టర్ విష్ణు వందన డిజిటల్ లిటరసీ ప్రత్యేకతపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కల్పించారు.

కెవిఆర్ కళాశాల యూనిట్-2 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి హెలిన్ కుమారి ఆధ్వర్యంలో మాస మసీదు గ్రామంలో ఉదయం విశ్వ భారతి మెడికల్ కాలేజీ స్టూడెంట్ హౌస్ సర్జన్ డాక్టర్ డి సుష్మ షుగర్ టెస్ట్ పై అవగాహన కల్పించి మధ్యాహ్నం గ్రామ ప్రజలకు షుగర్ టెస్ట్ క్యాంపు నిర్వహించారు, డా చంద్ర రేఖ, రాధా రమణి, డాక్టర్ జయలక్ష్మి ర్యాలీ లో గ్రామంలో అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో, కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ వినోల్యా కుమారి పసుపుల గ్రామంలో ఉదయం ప్లాంటేషన్ ట్రైన్ నిర్వహించారు, డాక్టర్ విమలా రోధే న్యూట్రిషన్ పై అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్లా కృష్ణ, హెచ్ఎం విజయమ్మ పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ ఈ ఎం హరీష్ బాబు వెంకన్న బావి గ్రామంలో మౌనిక క్లినిక్ వారు ఫిజియోథెరపీ పై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం న్యూట్రిషన్ ఫుడ్ పై ఎడ్యుకేషనల్ డ్రైవ్ నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంచి పర్యావరణ పరిరక్షణపై ఎడ్యుకేషనల్ అవేర్నెస్ డ్రైవ్ నిర్వహించారు.

Also Read-

జి డి సి ఫర్ మెన్ యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ రోషన్న వెంకయ్య పల్లెలో ఉదయం మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డివికే బాబు ఇంద్రజాలికుడు మరియు మోటివేషనల్ స్పీకర్ హాజరై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను మోటివేట్ చేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవి, హెచ్ఎం రాజేశ్వరి పాల్గొన్నారు.

జి డి సి ఫర్ మెన్ యూనిట్ 2 సోమశేఖర్ ఆధ్వర్యంలో ముజఫర్ నగర్ లో మొక్కలు నాటి, అమర్నాథ్ రెడ్డి మోటివేషనల్ స్పీకర్ ఆధ్వర్యంలో యోగ పై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు, క్లస్టర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ జయలక్ష్మి, జన విజ్ఞాన వేదిక లక్ష్యసాధన గురించి డాక్టర్ మన్సూర్ భాష, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాపరెడ్డి లక్ష్యసాధనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన సుధ స్కూల్ కరస్పాండెంట్ గౌతమ్ కృష్ణ, హెచ్ఎం రాజేశ్వరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X