Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మంగళ్‌హాట్ పోలీసులు ఆయనపై మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విరవణ ఇవ్వాల్సిందిగా ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై రాజాసింగ్ సింగ్ తరపు న్యాయవాదులు వివరణ ఇచ్చారు, పోలీసులు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
మరోవైపు ఈ కేసుపై రాజాసింగ్ స్పందించారు. గతంలో బాబ్రీ మసీదు ఘటన సమంయలో ఓవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తన పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకే తనపై వరుస కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులపై రాజాసింగ్ విమర్శలు గుప్పించారు.
ఈ నెల 6న సోషల్ మీడియాలో అయోధ్యపై రాజాసింగ్ ఓ పోస్టు పెట్టారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇటీవల మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందని పోలీసులు.. తాజాగా రాజాసింగ్‌పై మరో కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వీడియో పోస్ట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి ఆగస్టు 22న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పీడీ యాక్ట్ కేసులో చర్లపల్లి జైల్లో రాజాసింగ్ కొన్ని నెలల పాాటు ఉన్నారు. అయితే మూడు మాసాల పాటు మీడియాతో మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో కులమతాలకు సంబంధించిన పోస్టులు పెట్టవద్దనే షరతుతో రాజాసింగ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ నెల 6న అయోధ్య, అక్బర్పై రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని పరిశీలించిన మంగళహాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పీడీ యాక్ట్ కొట్టేసిన సందర్భంలో హైకోర్టు విధించిన షరతులు రాజా సింగ్ ఉల్లంఘించారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దానికి రాజాసింగ్ తన న్యాయవాది ద్వారా వివరణ ఇవ్వగా.. మంగళ్ హాట్ పోలీసులు దానిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వివరణతో సంతృప్తి చెందనందున ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
నవంబర్ 9న జైలు నుంచి రాజాసింగ్ విడుదల అయ్యారు. హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఇప్పుడు పోలీసులు మరో కేసు రాజాసింగ్‌పై నమోదు చేయడం ఆయన అభిమానులను ఆందోళన కల్గిస్తోంది. ఈ కేసులో పోలీసుల తరుపది కార్యాచరణ ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది. పోలీసులు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేస్తున్నారని రాజాసింగ్ అభిమానులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందో అని అంత టెన్షన్ నెలకొంది. (Agencies)