हैदराबाद: आंध्र प्रदेश के काकीनाडा जिले में एक भयानक हादसा हो गया। पेद्दापुरम मंडल के जी रागमपेट में अंबाटी सुब्बन्ना ऑयल फैक्ट्री में एक तेल टैंकर की सफाई करते समय श्रमिक फिसल गए और गिर गए।
इस घटना में सात मजदूरों की जान चली गयी और कुछ अन्य मजदूर घायल हो गये। घायलो को अस्पताल में भर्ती किया गया।कारखाना नए सिरे से बनाया जा रहा है। बताया जा रहा है कि मरने वालों की संख्या बढ़ सकती है। मृतकों में से दो की पहचान पेद्दापुरम मंडल के पुलीमेरू और पांच अन्य पाडेरू के रूप में हुई है।
मृतकों का विवरण इस प्रकार है। 1) मोच्चंगी कृष्णा का पुत्र जम्पन्ना, पाडेरू 2) मोच्चंगी नरसिंहा, पाडेरू 3) मोच्चंगी सागर, पाडेरू 4) कुरताडू बंजू बाबू, पाडेरू 5) कुर्रा रामाराव, पाडेरू 6) कट्टमुरी जगदीश, पुलिवेरु 7) प्रसाद सी/कापू, पुलिवेरु।
హైదరాబాద్ : కాకినాడ (ఆంధ్ర ప్రదేశ్) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దాపురం మండలం జీ రాగంపేటలో ఉన్న అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేస్తుండగా కార్మికులు జారి పడిపోయారు.
ఈ ఘటనలో ఏడుగురు కార్మికుల ప్రాణాలు కోల్పోగా మరికొందరు కార్మికులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీ కొత్తగా నిర్మిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు, మరో ఐదుగురిది పాడేరుకు చెందినవారిగా గుర్తించారు.
చనిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 1) మొచ్చంగి కృష్ణా S/o జంపన్న, పాడేరు 2)మొచ్చంగి నరసింగ, పాడేరు 3) మొచ్చంగి సాగర్, పాడేరు 4) కురతాడు బంజు బాబు, పాడేరు 5) కుర్ర రామారావు, పాడేరు 6) కట్టమురి జగదీష్, పులివేరు 7) ప్రసాద్ C/కాపు, పులివేరు.
ఈ ఫ్యాక్టరీని ఏడాది క్రితమే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కార్మికులు 10 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరగా తాజా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలంలో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇదిలా ఉంటే ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేయడానికి ముందు ఓ కార్మికుడు వెళ్లాడు. అతడు ప్రమాదవశాత్తూ పడిపోవడంతో మరికొందరు కార్మికులు అతడ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ పడిపోయినట్లు చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో లోపల ఆయిల్ ట్యాంకర్ పేలినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
పెద్దాపురం సమీపంలోని రాగంపేటలో జరిగిన దుర్ఘటనపై హోంమంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ లో ఊపిరాడక కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపారు.
కాకినాడ అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి బాధాకరం అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు రాష్ట్రమంతటా జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.
గతంలోనూ ఈ ఫ్యాక్టరీలలో పలు ప్రమాదాలు జరిగినా నిర్లక్ష్యం వీడకపోవడంతో అందుకు కార్మికులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అన్నారు తక్షణమే ప్రభుత్వం ఘటనపై స్పందించాలని ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. (ఏజెన్సీలు)