అలిపిరి పాదాల మండ‌పం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌శ్వ‌మివారి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాల‌యం మరుయు ఈ వార్తలు, ఫోటోలు కూడ…

తిరుపతి: తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయం, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మ‌వారి ఆల‌యంలో అష్ట‌బంధ‌నం కార‌ణంగా శ‌నివారం ఉద‌యం బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. మార్చి 3వ తేదీన పూర్ణాహుతితో ఈ కార్య‌క్ర‌మాలు ముగియ‌నున్నాయి.

ఇందులో భాగంగా మార్చి 1న ఉద‌యం 8 గంట‌ల‌కు పుణ్యాహవచనం, వాస్తు హోమం, అక‌ల్మ‌ష హోమం, ర‌క్షాబంధ‌నం, ఇత‌ర వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంట‌ల‌కు కుంభ‌స్థాప‌న, క‌ళాక‌ర్ష‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, కుంభాల‌ను యాగశాల‌కు తీసుకొచ్చి వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. మార్చి 2వ తేదీ ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల‌లో పంచ గ‌వ్యాదివాసం, క్షేరాధివాసం, జలదివాసం నిర్వ‌హించారు. సాయంత్రం వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

మార్చి 3వ తేదీ ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, కుంభ ప్ర‌ద‌క్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఉద‌యం 9.20 నుండి 9.55 గంట‌ల మ‌ధ్య మేష‌ ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌డ‌తారు.

గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు వేణుగోపాల దీక్షితులు,వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు మోహ‌న రంగాచార్యులు, రుత్వికులు, ఇత‌ర అదికారులు పాల్గొన్నారు. ఆలయ ఏఈఓ ముని కృష్ణారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, సలహాదారులు సీతారామచార్యులు, కంకణబట్టర్ శ్మురళీకృష్ణ చార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్వభూపాల వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకరణలో శ్రీవారు

హైద‌రాబాద్ / తిరుపతి: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ‌నివారం రాత్రి సర్వభూపాల వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి కేంద్ర విమానయాన శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ లేఖ

తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబుధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు.

తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గంగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు.

తిరుమలలో గదుల కేటాయింపులో మార్పు

శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే వీఐపీ వసతి గదులు

తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమలు

తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తోంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తోంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్ కు, 400 గదులు దాతలకు కేటాయిస్తోంది. 450 గదులను అరైవల్ కింద.. మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీలకు జారీచేస్తోంది. వీటిని శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లల్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్కార్డుతోపాటు దర్శన టికెట్టును తప్పనిసరి చేసింది.

గతంలో వీఐపీ గదులను ఆధార్తో దళారులు పెద్దఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు, ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్నవారికే వసతి కల్పిస్తుండటంతో దర్శనానంతరం ఖాళీచేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది.

మోహినీ అలంకారంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

హైద‌రాబాద్ / తిరుపతి : జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉద‌యం 8 గంటలకు స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై, తిరుచ్చిపై చిన్న కృష్ణుడు భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచు కోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు.

ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

మోహినీ అలంకారంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

హైద‌రాబాద్ / తిరుపతి: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉద‌యం 8 గంటలకు స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై, తిరుచ్చిపై చిన్న కృష్ణుడు భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచు కోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

మార్చి 10 నుండి 14వ తేదీ వ‌ర‌కు పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 10 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 9న సాయంత్రం 6 గంట‌ల‌కు మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 10న ఉద‌యం 10.10 నుండి 10.30 గంట‌ల‌ వరకు ధ్వజారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. సాయంత్రం 6 గంట‌లకు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు. మార్చి 11న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది.

మార్చి 11, 12, 13వ తేదీల‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం వైభ‌వంగా జ‌రుగ‌నుంది. మార్చి 12, 13వ తేదీల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 14న ఉద‌యం 10.10 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 5 గంట‌లకు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వహించనున్నారు. మార్చి 15న సాయంత్రం 5.30 గంట‌లకు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X