हैदराबाद: तेलंगाना विधानसभा सत्र आज से चार दिनों तक चलेगी। इसी क्रम में एमआईएम विधायक अकबरुद्दीन ओवैसी ने विधानसभा के प्रोटेम स्पीकर पद की शपथ ली। शनिवार को राजभवन में राज्यपाल तमिलिसाई सौंदरराजन ने अकबरुद्दीन को प्रोटेम स्पीकर के रूप में शपथ दिलाई।
इस कार्यक्रम में सीएम रेवंत रेड्डी, डिप्टी सीएम भट्टी विक्रमार्क के साथ बीआरएस विधायक हरीश राव, पोचारम श्रीनिवास रेड्डी और अन्य शामिल हुए। वहां से वे सीधे विधानसभा पहुंचे। अकबरुद्दीन राज्य भर से निर्वाचित विधायकों को शपथ दिलाई। इस बीच विधायक टी य राजा सिंह ने पहले ही तय कर लिया है कि अगर प्रोटेम स्पीकर अकबरुद्दीन होंगे तो वे शपथ नहीं लेंगे।
ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై అక్బరుద్దీన్ చేత ప్రొటెమ్ స్పీకర్‌గా ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అతంతరం అటునుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత అక్బరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. కాగా, ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ అయితే తాము ప్రమాణం చేయబోమని ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు. (ఏజెన్సీలు)