हैदराबाद: कामारेड्डी मास्टर प्लान विवाद गहराता जा रहा है। जमीन खो रहे किसान कामारेड्डी म्यूनिसिपल मास्टर प्लान को रद्द करने के लिए जिलाधीश कार्यालय के सामने आंदोलन पर उतर आये। किसान एकता एक्शन कमेटी के तत्वावधान में हजारों किसान रैली औंदोलन में भाग लिया। किसानों की रैली कामारेड्डी नये बस स्टैंड से जिलाधीश कार्यालय तक जारी है। इस दौरान पुलिस ने कड़ी सुरक्षा की है।
मास्टर प्लान के फैसले के विरोध करते हुए बुधवार को रामुलु नामक किसान ने आत्महत्या कर ली थी। रामुलु की आत्महत्या के बाद सरकार के फैसले के विरोध में एडलूर इल्लारेड्डी ग्राम पंचायत गवर्निंग काउंसिल के सदस्यों ने इस्तीफा दे दिया। उप सरपंच के साथ छह वार्ड सदस्य, बीएसीएस के निदेशक व छह ग्राम विकास समिति के सदस्यों ने इस्तीफा दे दिया है। वे किसानों की जमीन हड़पने के मास्टर प्लान को रद्द करने की मांग कर रहे हैं।
హైదరాబాద : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం తీవ్రరూపం దాల్చింది. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట్టడిచేసారు. రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ర్యాలీగా తరలివచ్చారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ చర్చి వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాస్టర్ ప్లాన్ నిర్ణయంతో నిన్న రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు ఆత్మహత్యతో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉపసర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పిఏసీఎస్ డైరెక్టర్, ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు రాజీనామా చేశారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విభిన్న రాజకీయ పార్టీ నాయకులు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. (Agencies)