हैदराबाद: बॉलीवुड निर्देशक ओम राउत द्वारा निर्देशित ग्लोबल स्टार प्रभास, कृति सनोन और सैफ अली खान स्टारर ‘आदिपुरुष’ ने पहले दिन बॉक्स ऑफिस पर सुनामी ला दी है। फिल्म ने अग्रिम बुकिंग संग्रह के साथ बॉक्स ऑफिस पर एक बड़ा तूफान खड़ा कर दिया और वैश्विक बॉक्स ऑफिस पर 140 करोड़ रुपये की उत्कृष्ट शुरूआती प्रतिक्रिया प्राप्त की है।
बिजनेस के मामले में भी आदिपुरुष ने पहले दिन बॉक्स ऑफिस को हिला कर रख दिया। इस फिल्म ने शीर्ष 5 में आने वाली एकमात्र हिंदी फिल्म के रूप में रिकॉर्ड बनाया है। इसकी जानकारी देते हुए निर्माताओं ने आधिकारिक तौर पर ‘आदिपुरुष’ की आकृतियों वाला एक पोस्टर जारी किया है। यह घोषणा की गई कि फिल्म ने वैश्विक बॉक्स ऑफिस पर 140 करोड़ रुपये एकत्र किए हैं।
संबंधित खबर:
‘ఆదిపురుష్’ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
హైదరాబాద్: గ్లోబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన తారాగణంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు సునామీనే సృష్టించేసింది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లతోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫానుని క్రియేట్ చేసిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ₹140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్ని అందుకుంది.
బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాప్ 5లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించిందీ సినిమా. ఈ విషయం తెలియజేస్తూ మేకర్స్ అధికారికంగా ‘ఆదిపురుష్’ లెక్కలతో ఓ పోస్టర్ వదిలారు. అందులో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ 140 కోట్లు రాబట్టినట్లుగా ప్రకటించారు.
The triumph of #Adipurush at Global Box Office with a record-breaking opening of ₹ 140 CR.! This cinematic extravaganza shatters all the records and conquers the heart of audience across ages! The true-blue family blockbuster, this magnum opus has especially captivated the… pic.twitter.com/1xrI5lmiIx
— People Media Factory (@peoplemediafcy) June 17, 2023
డే2… చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డ్స్
డే2 విషయానికి వస్తే సినిమాకు వస్తున్న టాక్‌తో సంబంధం లేకుండా రెండో రోజు కూడా చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. డే1 పరంగా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఈ చిత్రం రూ. 51 కోట్లకు పైగా రాబట్టినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్లో ఇప్పటి వరకు డే 1 రికార్డ్ ‘పఠాన్’ పేరు మీద ఉండగా ఇప్పుడు ‘ఆదిపురుష్’.. ఆ సినిమాను బీట్ చేసి ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకుంది.
ప్రభాస్ ఫ్యాన్స్, మేకర్స్ ఈ రికార్డ్ కలెక్షన్లతో హ్యాపీగా ఉన్నారు. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధునీకరించిన ఈ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని T-సిరీస్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రో ఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్, UV క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. (ఏజెన్సీలు)
