हैदराबाद : अडानी ग्रुप के चेयरमैन गौतम अडानी के बेटे जीत की शादी संपन्न हो गई है। अहमदाबाद में हुई इस शादी की जानकारी खुद गौतम अडानी ने दी है। जीत अडानी की शादी दीवा शाह से हुई है। जानकारी के मुताबिक यह शादी परिवार और करीबी दोस्तों के बीच पारंपरिक रीति-रिवाजों से हुई थी।
मीडिया में प्रसारित और प्रकाशित खबरों में बताया है कि गौतम अडानी ने अपने बेटे की शादी में दस हजार करोड़ रुपये दान करने का वादा किया। यह दान स्वास्थ्य, शिक्षा और कौशल विकास के क्षेत्र में होगा। गौतम अडानी ने अपने बेटे की शादी की जानकारी सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर दी है।
गौतम अडानी ने एक्स पर लिखा कि ईश्वर की कृपा से जीत और दीवा आज शादी के पवित्र बंधन में बंध गए हैं। शादी आज अहमदाबाद में पारंपरिक रीति-रिवाजों और शुभ मंगल भाव के साथ हुई। यह एक छोटा और बेहद निजी समारोह था। इसलिए हम सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके, जिसके लिए मैं क्षमा चाहता हूं। मैं अपनी बेटी दिवा और जीत के लिए आप सभी से आशीर्वाद और प्यार की कामना करता हूं।
आपको बता दें कि अपने बेटे की शादी में अडानी समूह के चेयरमैन गौतम अडानी ने सामाजिक कार्यों के लिए दस हजार करोड़ रुपये दान करके ‘सेवा’ करने का संकल्प लिया है। उनके दान का बड़ा हिस्सा स्वास्थ्य सेवा, शिक्षा और कौशल विकास में बड़े पैमाने पर बुनियादी ढाँचे की पहल को वित्तपोषित करने में जाने की उम्मीद है। (एजेंसियां)
यह भी पढ़ें-
నిరాడంబరంగా జీత్ అదానీ-దివా షా వివాహం, ‘క్షమించండి’ అంటూ అదానీ ట్వీట్!
హైదరాబాద్ : బిలియనీర్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ చిన్న కుమారుడి విహహం శుక్రవారం జరిగింది. డైమండ్ మర్చంట్ జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా మెడలో జీత్ తాళి కట్టారు. ఆత్మీయుల సమక్షంలో ఇరువురూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్‌గా పిలిచే అదానీ టౌన్‌షిప్‌లో వివాహ వేడుకలు నిర్వహించారు. పూర్తిగా జైన్, గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో వివాహ తంతు పూర్తిచేశారు. వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం వేళ దివా షా తో కలిసి. జీత్ అదానీ ఏడడుగులు వేశారు. జీవితాంతం కలిసుంటానని ప్రామిస్ చేశారు.
వివాహానికి సంబంధించి గౌతమ్ అదానీ స్వయంగా ట్వీట్ చేశారు. పెళ్లి చిత్రాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పారు అదానీ. తాము కోరుకున్నప్పటికీ.. సింపుల్‌గా జరిపిన ఈ వివాహ కార్యక్రమానికి ఆహ్వానించలేకపోయామని చెప్పారు.
‘సర్వశక్తిమంతుడైన భగవంతుడి ఆశీర్వాదంతో జీత్, దివా పవిత్రమైన వివాహబంధంలో అడుగుపెట్టారు. ఇవాళ అహ్మదాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో సంప్రదాయ ఆచార వ్యవహారాలు, శుభాకాంక్షలతో పెళ్లి జరిగింది. ఇది చాలా చిన్న, ప్రైవేట్ ఫంక్షన్. కాబట్టి మేము కోరుకున్నప్పటికీ శ్రేయోభిలాషులు అందరినీ ఆహ్వానించలేకపోయాం. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. జీత్, దివాలకు మీ అందరి నుంచి ప్రేమ, ఆశీర్వాదాల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.’ అని అదానీ ట్వీట్ చేశారు.
జీత్ అదానీ, దివా షాల నిశ్చితార్థం 2023, మార్చి 12న జరగ్గా దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ వివాహం జరిగింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫిబ్రవరి 6న భాంగ్రా నిర్వహించినట్లు తెలిసింది. దిగ్గజ సింగర్ డాలర్ మెహెందీ తనయుడు గురుదీప్ మెహెందీ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లు సమాచారం. జీత్ అదానీ విషయానికి వస్తే 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు.
ప్రస్తుతం ఆయన అదానీ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్, అదానీ డిజిటల్ ల్యాబ్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. గత నెలలో గౌతమ్ అదానీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లారు. ఆ సమయంలోనే ఫిబ్రవరి 7న తన కుమారుడి పెళ్లి అని వెల్లడించారు. సెలబ్రిటీలు ఎవరినీ ఆహ్వానించట్లేదని.. సాదాసీదాగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుక జరిపించనున్నట్లు తెలిపారు. (ఏజెన్సీలు)