हैदराबाद: साइबर अपराधियों ने एक विधवा को अपूरणीय झटका दिया। पति को खोने का गम झेल रहा परिवार आर्थिक भंवर में फंस गया है। रचाकोंडा पुलिस कमिश्नरेट एलबी नगर क्षेत्र की एक महिला को साइबर जालसाजों ने धोखा दिया है। लालच में आकर उन्होंने विधवा से डेढ़ करोड़ रुपये ऐंठ लिए। अब महिला ने रचाकोंडा साइबर क्राइम पीएस में शिकायत दर्ज कराई है और पुलिस से उसके पैसे वापस दिलाने में मदद करने की अपील की है।
यह मामला हाल ही में सामने आया है। यह मामला इस बात की याद दिलाती है कि आशा की हानि कितनी गंभीर हो सकती है। एलबी नगर इलाके की एक महिला (48) के पति की कुछ दिन पहले मौत हो गई थी। पति से जुड़ी बीमा राशि डेढ़ करोड़ आये थे। यह बात साइबर अपराधियों को कैसे पता चला, यह पता नहीं। महिला के पास एक अनजान शख्स का फोन आया। उसने कहा कि अगर आप निवेश करेंगे तो दोगुना रकं मिलेगा। इस तरह के भेष में साइबर अपराधियों ने शुरुआत में महिला के खाते में 5 लाख रुपये तक का भुगतान किया। बाद में उसने कहा कि अगर आप 1.5 करोड़ रुपये निवेश करेंगे तो आपको 3 करोड़ रुपये मिलेंगे।
वह बिना किसी को बताए सीधे बैंक पहुंची और अज्ञात व्यक्ति के बताए खाते में डेढ़ करोड़ ट्रांसफर कर दिए। बैंक अधिकारियों ने महिला को सुझाव दिया कि एक खाते में 1.5 करोड़ रुपये ट्रांसफर करने में 100 बार सोचना चाहिए और संदेह करना चाहिए कि यह धोखाधड़ी है। उसने यह सोचकर डेढ़ करोड़ कैश ट्रांसफर कर दिया कि हर कोई तीन करोड़ रुपये के बारे में झूठ बोल रहा है।
डेढ़ करोड़ रुपये जमा करने के बाद उसे दो माह के लिए झांसे में लेने वाले साइबर अपराधियों ने उम्मीद जगा दी। इसके बाद और पैसों की मांग करने पर उसकी नींद खुली और उसने साइबर क्राइम पुलिस से संपर्क किया। शुरुआती जांच करने वाले पुलिस अधिकारियों का अनुमान है कि 1.50 करोड़ रुपये ट्रांसफर करने के बाद इसे पहले 150 खातों में ट्रांसफर किया गया और फिर अन्य 450 खातों में ट्रांसफर किया गया और कुल 1. 50 करोड़ रुपये की नकदी 600 बैंक खातों में चली गई। यह बैंक खाता एक कोलकाता में है, तो दूसरा उत्तर पूर्वी राज्यों में और कुछ अन्य उत्तरी राज्यों में पाया गया है।
अनुभवी अधिकारियों का मानना है कि इन खातों की पहचान करने, उनका मिलान करने और साइबर जालसाजों को पकड़ने में कम से कम 8 महीने लगेंगे। पिछले डेढ़ दशक से लगातार साइबर अपराधों के प्रति सचेत करने पर भी लोगों में बदलाव नहीं आना चौंकाने वाली है। किसी अनजान व्यक्ति की बातें में फंसकर सोशल मीडिया प्लेटफॉर्म पर ओटीपी और पासवर्ड जैसी छोटी-छोटी युक्तियां आपकी, आपके पैसे और आपकी प्रतिष्ठा की रक्षा करेंगी। साइबर क्राइम पुलिस ने चेतावनी दी है कि यदि आप इसकी उपेक्षा करते हैं, तो आप निश्चित रूप से सड़क पर आ जाएंगे। अधिकारी 24 घंटे के भीतर संदिग्ध लेनदेन की सूचना 1930 पर देने का सुझाव दिया है।
Crime: దుఖంలో దుఖం, ఓ వితంతువుకు కోలుకోలేని దెబ్బ కొట్టారు సైబర్ నేరగాళ్ళు
హైదరాబాద్ : ఓ వితంతువుకు సైబర్ నేరగాళ్ళు కోలుకోలేని దెబ్బ కొట్టారు. భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న ఆ కుటుంబం ఆర్ధిక సుడిగుండం లో చిక్కుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ ఎల్‌బీ నగర్ ప్రాంతానికి చెందిన మహిళను సైబర్ మోసగాళ్లు నిండా ముంచారు. ఆత్యాశకు గురి చేసి ఆ వితంతు మహిళ నుంచి కోటిన్నర కొట్టేశారు. ఇప్పుడు ఆ మహిళ తన డబ్బును తిరిగి ఇచ్చే విధంగా పోలీసులు సహాయం చేయాలని రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఆశకు పొతే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో హెచ్చరిస్తుంది. ఎల్‌బీ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (48) భర్త కొద్ది రోజుల కిందట మరణించాడు. భర్తకు సంబంధించిన ఇన్సూరెన్సు డబ్బులు కోటిన్నర వచ్చాయి. ఇది సైబర్ నేరాలకు ఎలా తెలిసిందో తెలియదు. ఆ మహిళకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీరు పెట్టుబడి పెడితే డబుల్ ఇస్తామని నమ్మించారు. అలా మభ్యపెట్టి సైబర్ నేరగాళ్ళు మొదట రూ.5 లక్షల వరకు చెల్లించారు. తర్వాత కోటిన్నర పెట్టుబడిపెడితే రూ.3 కోట్లు వస్తాయని మాయ చేశారు.
దీంతో ఎవరికీ చెప్పకుండా నేరుగా బ్యాంకుకు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఖాతాకు కోటిన్నర బదిలీ చేసింది. బ్యాంకు అధికారులు 100 సార్లు ఆలోచించుకోమని ఒకే సారి కోటిన్నర ఒకే ఖాతాకు బదిలీ చేయమనడం మోసంగా అనుమానించాలని సూచించిన ఆమె రూ.3 కోట్ల మాయలో అందరు అబద్ధం చెపుతున్నారని భావించి కోటిన్నర నగదును బదిలీ చేసింది.
కోటిన్నర వేసిన తర్వాత ఆమెను మభ్య పెట్టిన సైబర్ నేరగాళ్ళు అలా 2 నెలల పాటు ఆశ పుట్టించారు. ఆ తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అప్పుడు మేల్కొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు ఆ కోటిన్నర బదిలీ తర్వాత ముందుగా 150 ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ తర్వాత మరో 450 ఖాతాలకు బదిలీ అయ్యి మొత్తం రూ.కోటిన్నర నగదు 600 బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లినట్లు పోలీసు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఈ బ్యాంకు ఖాతా ఒక్కటి కోల్‌కతాలో ఉంటే మరొక్కటి ఈశాన్య రాష్ట్రాల్లో, ఇంకాకొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలుస్తున్నాయి.
ఈ ఖాతాలు గుర్తించి వాటిని క్రోడికరించి సైబర్ మోసగాళ్ళను పట్టుకోవాలంటే కనీసం 8 నెలలు పడుతుందని అనుభవం ఉన్న అధికారులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాలపై గత దశాబ్దన్నర కాలం నుంచి నిరంతరం అప్రమత్తం చేస్తున్న ప్రజల్లో మార్పు రాకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి మాటలకు, ఫోన్, వాట్సాప్ లో పలకరింపులకు, సోషల్ మీడియా వేదికల మీద పరిచయాలకు, ఓటీపీ, పాస్ వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దు వంటి చిన్న చిన్న చిట్కాలు మిమ్మల్ని, మీ డబ్బును, మీ పరువును కాపుడుతుంది. నిర్లక్ష్యం చేస్తే మీరు రోడ్డున పడడం ఖాయం అంటూ సైబర్ క్రైమ్ పోలీసు లు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై 24 గంటలలోపు 1930 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. (ఏజెన్సీలు)