వినోద్ కుమార్ తో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సహా ప్రతినిధుల భేటీ

విశాఖ పర్యటనకు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు వినోద్ కుమార్ తో భేటీ అయిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు

హైదరాబాద్ : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ కో కన్వీనర్ నీరుకొండ రామచందర్రావు ప్రతినిధి మంత్రి మురళీకృష్ణ రావు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో భేటీ అయ్యారు.

శనివారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాట కమిటీ చైర్మన్, ప్రతినిధులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఆహ్వానించేందుకు ఆ ప్రతినిధులు వినోద్ కుమార్ ను కలిశారు.

తమ పోరాటానికి భారత రాష్ట్ర సమితి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించేలా చూడాలని ఆ ప్రతినిధులు వినోద్ కుమార్ ను కోరారు. సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తే చేసే ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి పదాన్ని సంస్థకు అప్పనంగా ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో కన్వీనర్ నీరుకొండ రాంచందర్ రావు, ప్రతినిధి మురళీ కృష్ణ రావు ఆరోపించారు.

ఇంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని జాతి సంపద అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటాం అని వారు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమానికి బి.ఆర్.ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ ఆహ్వానాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X