चारमीनार की पपड़ी गिरी, डरकर भागे लोग, बड़ा हादसा टला, सीएम ने अधिकारियों को दिया यह आदेश

हैदराबाद: चारमीनार पर एक बड़ा हादसा टल गया। गुरुवार को शहर में भारी बारिश के कारण भाग्यलक्ष्मी मंदिर की मीनार से टाइलें (पपड़ी) गिर गये। इससे पर्यटक घबरा गए और भाग गए। यह निर्धारित किया गया कि पहले से मरम्मत की गई मीनार से टाइलें गिर गये।

सूचना मिलने पर अधिकारी घटनास्थल पर पहुंचे और स्थिति का आकलन किया। उन्होंने वहां गिरे हुए टाइलें को हटाया और उसे साफ किया। उन्होंने कहा कि दुर्घटना टल गई क्योंकि टाइलें गिरते समय वहां कोई मौजूद नहीं था। उन्होंने कहा कि मीनार की फिर से मरम्मत की जाएगी।

हैदराबाद में आज बेमौसम बारिश ने कहर बरपाया। दोपहर से ही गरज और बिजली के साथ भारी बारिश हुई। इससे सड़कों पर बारिश का पानी बह गया। हैदराबाद में भारी बारिश के कारण सड़कें जलमग्न हो गईं।

पंजागुट्टा-खैरताबाद मुख्य सड़क पर यातायात बुरी तरह बाधित हुआ। मर्करी होटल के पास एक पेड़ कार पर गिर गया। हालांकि, दो महिलाएं बाल-बाल बच गईं। मौसम विभाग ने कहा कि तीन-चार दिन तेलंगाना में बारिश गिरने की संभावना है। गरज और बिजली के साथ भारी बारिश होगी।

मुसी नदी में फंसे इन दो मजदूरों को अधिकारियों ने सुरक्षित निकाला

जीएचएमसी, डीआरएफ और अग्निशमन अधिकारी भी कठिन समय में लोगों के साथ खड़े रहने में सबसे आगे रहते हैं। आज हुई भारी बारिश के कारण मूसी नदी में बाढ़ का प्रवाह बढ़ गया है। परिणामस्वरूप, चैतन्यपुरी में शिव मंदिर के पास छोटा-मोटा काम कर रहे दो मजदूर बाढ़ के पानी में फंस गए।

सूचना मिलने पर बचाव दल ने रस्सियों की मदद से मूसी में फंसे लोगों को बचाया। स्थानीय लोगों ने बाढ़ में फंसे वीरैया और नरेंद्र को बचाने के लिए बचाव अधिकारियों को धन्यवाद दिया।

सीएम रेवंत रेड्डी का निर्देश

सीएम रेवंत रेड्डी ने बारिश के कहर के मद्देनजर सभी विभागों को स्थानीय अधिकारियों को सतर्क रहने का निर्देश दिया है। पुलिस अधिकारियों को निर्देश दिया गया कि वे सड़कों पर ट्रैफिक जाम को यथाशीघ्र खुलवाएं तथा यह सुनिश्चित करें कि वाहन चालक शीघ्र अपने घर पहुंच जाएं। लोगों को बिना किसी असुविधा के उचित कदम उठाने की सलाह दी गई। मुख्य सचिव को समय-समय पर स्थिति की समीक्षा करने का निर्देश दिया गया। मुख्यमंत्री ने सभी विभागों के अधिकारियों को सतर्क रहने का आदेश दिया है।

यह भी पढ़ें-

చార్మినార్ పెచ్చులు ఊడి పడ్డాయి, పెనుప్రమాదం తప్పింది, భయంతో పరుగులు జనం

హైదరాబాద్​ : చార్మినార్​ వద్ద పెనుప్రమాదం తప్పింది. గురువారం నగరంలో పడిన భారీ వర్షానికి భాగ్యలక్ష్మి ఆలయం వైపున మినార్​ నుంచి పెచ్చులూడి పడ్డాయి. దీంతో పర్యాటకులు భ‌యాందోళ‌న‌కు గురై పరుగులు తీశారు. గతంలో రిపేర్​ చేసిన మినార్​ నుంచి పెచ్చులూడిపడినట్లు నిర్దారణ అయింది.

సమాచారం అందుకున్న అధికారులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసి వేసి అక్కడ క్లీన్ చేశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మినార్‌కు మరోమారు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో ఇవాళ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ రోజు మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి.

పంజాగుట్ట- ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ ముందున్నారు జీహెచ్​ఎంసీ.. డీఆర్​ఎఫ్​.. ఫైర్​ అధికారులు. హైదరాబాద్​ లో ఈ రోజు ( ఏప్రిల్​3) కురిసిన భారీ వర్షాలకు మూసీ నది వరద ప్రవాహం పెరిగింది. దీంతో చైతన్య పురి శివాలయం దగ్గర కూలి పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వరదలో చిక్కుకున్న వారిని రోప్​ సహాయంతో కాపాడారు. వరదలో చిక్కుకున్న వీరయ్య.. నరేంద్రలను కాపాడినందుకు స్థానికులు.. రెస్క్యూ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు.

సీఎం రేవంత్​ రెడ్డి

వర్షం బీభత్సం నేపథ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి అన్ని డిపార్ట్​మెంట్లను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడపడితే ట్రాఫిక్​ స్థంభించడంతో సాధ్యమైనంత త్వరగా క్లియ‌ర్ చేసి వాహ‌న‌దారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంత‌రాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.

తెలంగాణలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X