हैदराबाद: शहर में बुधवार को भारी बारिश के कारण एक मगरमच्छ नहर में बहकर आ गया। खैरताबाद के चिंतलबस्ती और आनंद नगर के बीच नाले में स्थानीय लोगों को एक मगरमच्छ का बच्चा दिखाई दिया। पानी के बहाव में बहकर एक मगरमच्छ का बच्चा नाला स्थित नवनिर्मित पुल की बटेर दीवार तक पहुंच गया।
शहर के बीचोबीच एक मगरमच्छ को देखकर स्थानीय लोग घबरा गए। जीएचएमसी अधिकारियों और वन अधिकारियों को इसकी जानकारी दी गई। उन्होंने बताया कि यह मगरमच्छ का बच्चा बल्कापुर नाला में बहकर आया है। कहा जा रहा है कि यह नहर बंजारा हिल्स और अन्य जगहों से होकर बहता है। बताया गया कि यह मगरमच्छ का बच्चा 5 फीट तक लंबा है।
कुछ लोगों ने चिंता व्यक्त की कि धारा में एक मगरमच्छ की माँ भी हो सकती है। उन्होंने चिंता व्यक्त करते हुए कहा कि अगल-बगल में कई घर हैं। जहां वह आधी रात को आवासों में घुसने की संभावना हैं। बताया जाता है कि तीन माह बाद भी नाला निर्माण कार्य पूरा नहीं हुआ। उधर, मगरमच्छ को देखने के लिए आसपास की कॉलोनी के लोग बड़ी संख्या में आ गए।
पिछले दिनों ऐसी खबरें आई थीं कि हैदराबाद के बाहरी इलाके हिमायत सागर और उसके पास के नाले में मगरमच्छ देखे गए हैं। खैरताबाद के निवासी आशंका जता रहे हैं कि बुधवार को हुई भारी बारिश के बाद मगरमच्छ का बच्चा यहां के नाले से बहकर गया है।
ఖైరతాబాద్ నాలాలో కొట్టుకొచ్చిన మొసలి పిల్ల, తల్లి మొసలి ఉందేమోనని అనుమానం
హైదరాబాద్: నగరంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి నాలాలో ఓ మొసలి కొట్టుకొచ్చింది. ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీ, ఆనంద్ నగర్ మధ్య ఉన్న నాలాలో స్థానికులకు మొసలి పిల్ల కనిపించింది. ప్రవాహ ఉధృతికి కొట్టుకొచ్చిన మొసలి పిల్ల నాలా వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన పిట్ట గోడపైకి చేరింది.
నగరం నడిబొడ్డున మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసి, సమాచారం అందించారు. బల్కాపూర్ నాలాలో ఈ మొసలి పిల్ల కొట్టుకొచ్చిందని తెలిపారు. బంజారాహిల్స్ తదితర ప్రాంతాల మీదుగా ఈ నాలా వస్తుందని చెబుతున్నారు. ఈ మొసలి పిల్ల 5 అడుగుల పొడవు వరకు ఉండవచ్చని చెప్పారు.
ప్రవాహంలో తల్లి మొసలి కూడా ఉందేమోనని కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారు. నాలా పక్కనే ఇళ్లు ఉన్నాయని అర్ధరాత్రి ఎక్కడ నివాసాలలోకి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాపై నిర్మాణ పనులు 3 నెలలైనా పూర్తి కాలేదని చెబుతున్నారు. మరోవైపు.. మొసలిని చూసేందుకు సమీపంలోని కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్ శివార్లలోని హిమాయత్ సాగర్‌లో, దాని సమీపంలోని నాలాలో మొసళ్లు కనిపించాయని గతంలోనూ వార్తలు వచ్చాయి. బుధవారం కురిసిన భారీ వర్షం అనంతరం ఇక్కడి నాలా నుంచే మొసలి పిల్ల కొట్టుకొచ్చిందేమోనని ఖైరతాబాద్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)