हैदराबाद : हां – नहीं के बीच अमेरिका के साथ अहम बातचीत में हिस्सा लेने के लिए ईरान का एक हाई-लेवल डेलीगेशन पाकिस्तान की राजधानी इस्लामाबाद पहुंच गया। इस ग्रुप को ईरानी पार्लियामेंट के स्पीकर मोहम्मद बाकर कलीबाफ लीड कर रहे हैं। प्रतिनिधि मंडल ने हाल ही में जंग में मारे गये मासूम बच्चों की तस्वीरें और अन्य सामग्री भी साथ में लेकर आये है। यह बातचीत वेस्ट एशिया में चल रहे तनाव को कम करने और शांति बनाने के मकसद से होने जा रही है।
डेलीगेशन में ईरान के विदेश मंत्री अब्बास अराघची, डिफेंस काउंसिल के सेक्रेटरी अली अकबर अहमदियन, सेंट्रल बैंक के गवर्नर अब्दोलनजार हेममती और कई मिलिट्री, इकोनॉमिक और लीगल एक्सपर्ट शामिल हैं। इस्लामाबाद एयरपोर्ट पर पाकिस्तान के डिप्टी प्राइम मिनिस्टर इसहाक डार और नेशनल असेंबली के स्पीकर अयाज सादिक ने उनका स्वागत किया।
बातचीत शुरू होने से पहले, ईरानी स्पीकर कलीबाफ ने सोशल मीडिया पर दो अहम शर्तों की घोषणा की। उन्होंने कहा कि इजरायल और हिजबुल्लाह के बीच जंग तुरंत रुक जानी चाहिए। उन्होंने अमेरिका द्वारा फ्रीज किए गए ईरानी फंड को तुरंत रिलीज करने की मांग की। ईरान ने साफ कर दिया है कि बातचीत तभी आसानी से आगे बढ़ेगी जब ये दो शर्तें मान ली जाएगी।
दूसरी ओर, अमेरिका की तरफ से वाइस प्रेसिडेंट जेडी वेंस की लीडरशिप में एक टीम इस्लामाबाद पहुंचेगी। टीम में ट्रंप के स्पेशल रिप्रेजेंटेटिव स्टीव व्हिटलॉक और सीनियर एडवाइजर जेरेड कुशनर भी शामिल हैं।
गौरतलब है कि 1979 की इस्लामिक क्रांति के बाद से यह अमेरिका और ईरान के बीच सबसे हाई-लेवल मीटिंग है। पाकिस्तान इन बातचीत को होस्ट कर रहा है, जो इस्लामाबाद टॉक्स के नाम से हो रही है। पिछले छह हफ्तों से वेस्ट एशिया में चल रही लड़ाई को रोकने के लिए दो हफ्ते के टेम्पररी सीजफायर एग्रीमेंट के बाद इन बातचीत को अहमियत मिली है।
यह भी पढ़ें-
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం
హైదరాబాద్ : పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, శాశ్వత శాంతిని నెలకొల్పే లక్ష్యంతో అమెరికాతో జరగనున్న కీలక చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇవాళ తెల్లవారుజామున పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ కలీబాఫ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఈ ప్రతినిధి బృందంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ అలీ అక్బర్ అహ్మదియాన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దోల్నాజర్ హెమ్మతీతో పాటు పలువురు సైనిక, ఆర్థిక మరియు న్యాయ నిపుణులు ఉన్నారు. వీరికి ఇస్లామాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ఘనస్వాగతం పలికారు.
చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ స్పీకర్ కలీబాఫ్ సోషల్ మీడియా వేదికగా రెండు కీలక షరతులను వెల్లడించారు. ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య యుద్ధం తక్షణమే ఆగాలని అన్నారు. అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ షరతులు నెరవేరితేనే చర్చలు సజావుగా సాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది.
మరోవైపు, అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఈ బృందంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా – ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో జరుగుతున్న ఈ చర్చలకు పాకిస్తాన్ వేదికగా నిలుస్తోంది. గత ఆరు వారాలుగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పోరాటాన్ని ఆపడానికి, రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. (ఏజెన్సీలు)
