हैदराबाद : ऑपरेशन कगार के अंतर्गत माओवादी पार्टी को बड़ा झटका लगा है। पार्टी के बड़े नेता (सचिव) तिप्परी तिरुपति उर्फ देव जी, केंद्रीय समिति के सदस्य मल्ला राजिरेड्डी के साथ 16 अन्य ने तेलंगाना के एसआईबी (Telangana Special Intelligence Bureau) के सामने 22 फरवरी को आत्मसमर्पण किया है।
31 मार्च तक माओवादी को खत्म करने के लक्ष्य को लेकर जारी ऑपरेशन कगार को बड़ी सफलता मिली है। मीडिया में प्रकाशित और प्रसारित खबरों के अनुसार, आत्मसमर्पण कर चुके माओवादियों को दो दिन के भीतर मीडिया के सामने पेश किया जाएगा।
माना जा रहा है कि लगातार मुठभेड़ और मुख्य नेताओं का आत्मसमर्पण के चलते माओवादी आंदोलन अब अंतिम चरण में पहुंच गया है। साल 2021 में आरके (रामकृष्णा) के मुठभेड़ के बाद माओवादी आंदोलन में दरार सी आ गई। इसके बाद हिडमा और पार्टी के सचिव संबाला केशव राव जैसे मुख्य नेताओं की मुठभेड़ में मौत हो गई। इसके बाद आशन्ना, मल्लोजुला वेणुगोपाल और अन्य ने नेताओं ने आत्मसमर्पण किया। गणपति विदेश चला गया। अब बड़े चोक्काराव उर्फ दामोदर की तलाश जारी है। खबरें आ रही है कि जंगलों में नाम मात्र माओवादी बचे है।
మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్!
హైదరాబాద్ : ఆరు దశాబ్దాలకు పైగా దేశాన్ని ఉడికించిన మావోయిస్టు సాయుధ పోరాటం చరమాంకానికి చేరుకుంది. తెలంగాణ పోలీసుల సంచలన ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు పొలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవ్జీ, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటు మరో 16 మంది కీలక మావోయిస్టులు సరెండర్ అయినట్లుగా సమాచారం.
దీనిపై మరో రెండు రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయనే రచించేవారు. అటువంటి అగ్రనేత లొంగిపోవడం పార్టీ ఉనికిని దాదాపుగా తుడిచిపెట్టినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా వంటి భీకర నేతలు ఎన్కౌంటర్లలో మరణించగా.. మల్లోజు వేణుగోపాల్, ఆశన్న వంటి వారు ఇప్పటికే లొంగిపోయారు. ఇక మరో అగ్రనేత గణపతి అనారోగ్యంతో విదేశాల్లో తలదాచుకోగా, ప్రస్తుతం గ్రేహౌండ్స్ దళాలు కేవలం బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగిస్తున్నాయి.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగిన తుపాకీ పోరాటం, వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. తాజాగా దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి వారు జనజీవన స్రవంతిలోకి రావడంతో సుదీర్ఘ పోరాట చరిత్రకు ఎండ్ కార్డు పడినట్లైంది. (ఏజెన్సీలు)
