पिता के साथ बाइक पर जा रही बच्ची का चाइनीज़ मांझे से कटा गला, मौके पर ही मौत చిన్నారి గొంతు కోసిన చైనా మాంజా

हैदराबाद : कुकटपल्ली पुलिस स्टेशन के अंदर विवेकानंद नगर के पास एक दर्दनाक हादसा हुआ। अपने पिता के साथ बाइक पर हंसी खुशी से जा रही निश्विका दरिया (5) नाम की बच्ची का चाइनीज़ मांझे से गला कट गया और मौके पर ही उसकी मौत हो गई। यह घटना तब हुई जब केपीएचबी गोकुल फ्लैट्स में रहने वाले रामसागर दंपत्ति पटानचेरु के पास खाजीपल्ली गांव में हाल ही में खरीदे घर में हो रहे इंटीरियर के काम को देखकर लौट रहे थे।

वे केबीएचबी कॉलोनी में एक ज्वेलरी शॉप जाने की बात कहकर घर जाने के बजाय मेन रोड की तरफ मूड़। उन्होंने यू-टर्न लिया और जाना चाहते थे, तभी बच्ची के गले में चाइनीज़ मांझा फंस गया। मांझा गले में फंसने से बच्ची अचानक जोर से चिल्लाई। जब उसके पिता ने यह देखा तो उसके गले से बहुत खून बहने लगा। जब बच्ची को पास के हॉस्पिटल ले जाया गया, तो डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। पुलिस ने केस दर्ज कर लिया है और घटना की जांच कर रही है। बॉडी को पोस्टमॉर्टम के लिए गांधी हॉस्पिटल भेज दिया गया है।

संक्रांति के दौरान कुछ युवा और बच्चे मज़े के लिए पतंग उड़ा रहे हैं। इससे लोगों की जान खतरे में पड़ रही है। कुछ लोग पतंग उड़ाने के लिए आम धागों की जगह मज़बूत मांझे का इस्तेमाल कर रहे हैं। इन मांझों की वजह से बाइक सवारों के एक्सीडेंट हो रहे हैं। उनमें से एक-दो लोग बाल-बाल बचे हैं।

नायलॉन और सिंथेटिक धागों पर कांच और प्लास्टिक पाउडर की कोटिंग करके मांझा बनाया जाता है। आम सूती धागों की तुलना में यह मांझा धागा मज़बूत होता है। इस वजह से पतंग उड़ाते समय दूसरी पतंगों के धागों को तोड़ना आसान हो जाता है। इस वजह से लोग पतंग उड़ाने के लिए मांझे का इस्तेमाल करने में दिलचस्पी ले रहे हैं। हालांकि, यह ध्यान देने वाली बात है कि पतंग टूटने के बाद उस पर लगा मांझा हवा में तैरता है और बाइक सवारों के गले में लिपट जाता है, जिससे उनकी मौत हो जाती है। हैदराबाद शहर में संक्रांति के दौरान मांझे में उलझने से गंभीर रूप से घायल होने और मौत होने की घटनाओं ने चिंता पैदा कर दी है।

Also Read-

తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుతున్న చిన్నారి గొంతు కోసిన చైనా మాంజా, అక్కడికక్కడే మృతి

హైదరాబాద్ : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి బైక్పై వెళుతున్న చిన్నారి నిష్విక దరియా (5) గొంతుకు చైనా మాంజా కోసుకొని అక్కడికక్కడే మృతి చెందింది. కెపిహెచ్‌బి గోకుల్ ఫ్లాట్స్లో నివాసముండే రామసాగర్ దంపతులు పఠాన్ చెరు సమీపంలోని ఖాజీపల్లి గ్రామంలో వారు ఇటీవల తీసుకున్న ఇంటి దగ్గర జరుగుతున్న ఇంటీరియర్ పనులు చూసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

కెపిహెచ్‌బి కాలనీలోని ఓ నగల దుకాణానికి వెళ్దామని అనుకొని ఇంటికి వెళ్లకుండా మెయిన్ రోడ్ వైపు వెళ్లారు. యూటర్న్ తీసుకొని వెళ్దామనుకొని వస్తుండగా పాప గొంతుకు చైనా మాంజా చిక్కుకుంది. గొంతుకు మాంజా చుట్టుకోవడంతో పాప ఒక్కసారిగా బిగ్గరగా అరవడంతో తండ్రి గమనించి చూసేసరికి తీవ్ర రక్తస్రావం అయింది. సమీప ఆసుపత్రికి తీసుకొని రాగానే పాపను చూసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంక్రాంతి టైంలో కొందరు యువకులు, పిల్లలు సరదాగా ఎగురవేసే పతంగులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పతంగులు ఎగురవేయడానికి కొందరు వ్యక్తులు సాధారణ దారాలు కాకుండా గట్టిగా ఉండే మాంజాలు వాడుతున్నారు. ఈ మాంజాల కారణంగా బైక్‌‌పై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందులో ఒకరిద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

నైలాన్‌‌, సింథటిక్‌‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌‌ పొడి పూసి మాంజాను తయారు చేస్తారు. మామూలు కాటన్‌‌ దారంతో పోలిస్తే ఈ మాంజా దారం గట్టిగా ఉంటుంది. దీని వల్ల పతంగులు ఎగురవేసే టైంలో ఇతరుల కైట్స్‌‌ దారాలను తెంపడం ఈజీ అవుతుంది. దీంతో పతంగులు ఎగురవేసేందుకు మాంజాను వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే పతంగి తెగిన తర్వాత దానికి ఉన్న మాంజా గాలిలో తేలుతూ బైక్‌‌పై వెళ్లే వారికి గొంతుకు చుట్టుకుని ప్రాణాలు తీస్తుండటం గమనార్హం. హైదరాబాద్ సిటీలో ఈ సంక్రాంతి సమయంలో మాంజా చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఘటనలు, చనిపోయిన ఘటనలు ఆందోళన కలిగించాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X