भाई केटीआर को राखी नहीं बाँध पाईं कविता, राजनैतिक गलियारी में हैं यह चर्चा

हैदराबाद: तेलंगाना में राखी का जश्न धूमधाम से मनाया गया। हालाँकि, केसीआर परिवार में एक दिलचस्प वाकया हुआ है। पिछले कुछ समय से अटकलें लगाई जा रही थीं कि बीआरएस पार्टी में केटीआर और कविता के बीच राजनीतिक मतभेद हैं। ऐसे समय में सबकी नज़र इस बात पर है कि क्या राखी के दिन दोनों मिलेंगे या नहीं। हालाँकि, इन अटकलों को सच साबित करते हुए कविता अपने भाई केटीआर के कलाई पर राखी नहीं बाँध पाईं।

जब एमएलसी कविता ने राखी बाँधने आने की बात कही, तो उनके करीबियों ने बताया कि केटीआर ने संदेश भेजा है कि वह हैदराबाद में उपलब्ध नहीं हैं और बेंगलुरु में हैं। यह संदेश मिलने के बाद, कविता ने केटीआर से मिले बिना ही राखी मना ली। हालाँकि कहा जा रहा है कि दोनों के बीच कोई राजनीतिक मतभेद नहीं है, लेकिन राखी जैसे महत्वपूर्ण दिन पर भी अपने बड़े भाई की अनुपस्थिति पर कविता के समर्थक असंतोष व्यक्त कर रहे हैं।

पिछले दिनों, जब कविता जेल में थीं और राखी नहीं बाँध पाई थीं, तब केटीआर ने एक भावुक ट्वीट किया था। उन्होंने कहा, “जेल में होने के कारण राखी तो नहीं बाँध पाऊँगी, लेकिन मुश्किल और खुशी के समय में साथ रहेंगे।” हालाँकि, इस बार, हालाँकि वह हैदराबाद में थीं, लेकिन केटीआर के बेंगलुरु में होने के कारण दोनों की मुलाक़ात नहीं हो सकी। राजनीतिक विश्लेषकों का मानना है कि इस घटना के कारण उनके बीच दूरियाँ और बढ़ गई हैं।

इसका मुख्य कारण यह है कि पार्टी में चल रहा घटनाक्रम केसीआर के बाद पार्टी की बागडोर कौन संभालेगा, इस प्रतिस्पर्धा से जुड़ा हो सकता है। इससे पहले एक साक्षात्कार में जब कविता से पूछा गया था कि उन्हें राखी बाँधनी चाहिए या नहीं, तो उन्होंने कहा था, “राजनीति तो राजनीति है, राखी तो राखी है,” और इस बार उन्हें अपने भाई के न होने का दुख है। इस घटना ने एक बार फिर बीआरएस के अंदरूनी मतभेदों को उजागर कर दिया है।

राजनीति और व्यक्तिगत रिश्ते अलग-अलग होने चाहिए। लेकिन कुछ नेता दोनों को मिलाकर परेशानी हो रहे हैं। नंदमुरी बालकृष्ण और पुरंदेश्वरी जैसे लोग अलग-अलग पार्टियों में होने के बावजूद पारिवारिक रिश्ते बनाए हुए हैं। हालाँकि, राजनीतिक मतभेदों के कारण वाईएस जगन और शर्मिला के बीच दूरियाँ बढ़ गई हैं। संपत्ति विवाद और राजनीतिक फैसलों के चलते उनकी बातचीत बंद हो गई है।

कविता और केटीआर के मामले में भी कुछ ऐसा ही हो रहा है। कविता ने अपने कुछ राजनीतिक फैसलों के चलते उनसे दूरी बना ली है। इसी वजह से राखी जैसे त्योहार पर भी उनकी मुलाकात नहीं हुई। परिवार के सदस्यों के बीच इस तरह के मतभेदों का असर दोनों पक्षों पर भी पड़ सकता है। (एजेंसियाँ)

यह भी पढ़ें-

కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయిన కవిత

హైదరాబాద్ : తెలంగాణలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవిత మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాఖీ పండుగ రోజున వారిద్దరూ కలుస్తారా లేదా అనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. అయితే ఊహాగానాలను నిజం చేస్తూ, కవిత తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయారు.

ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టడానికి వస్తానని చెప్పినప్పుడు తాను హైదరాబాద్‌లో అందుబాటులో లేనని, బెంగళూరులో ఉన్నానని కేటీఆర్ సందేశం పంపారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ సందేశం అందుకున్న తర్వాత.. కవిత కేటీఆర్‌ను కలవకుండానే రాఖీ పండుగ జరుపుకున్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ రాఖీ పండుగ లాంటి ముఖ్యమైన రోజున కూడా అన్నయ్య అందుబాటులో లేకపోవడంపై కవిత వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా కవిత జైలులో ఉన్నప్పుడు రాఖీ కట్టలేకపోయిన సందర్భంలో కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “జైల్లో ఉన్నందున రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ కష్ట సుఖాల్లో వెన్నంటే ఉంటాను” అని అప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఈసారి ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ కేటీఆర్ బెంగళూరులో ఉన్న కారణంగా వారిద్దరూ కలుసుకోలేకపోయారు. ఈ సంఘటన వల్ల వారి మధ్య దూరం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి ప్రధాన కారణం, పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలను ఎవరు చేపడతారనే అంశంలో ఉన్న పోటీ వంటివి కావచ్చని తెలుస్తోంది. రాఖీ కట్టాలా వద్దా అని గతంలో ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ‘రాజకీయాలు రాజకీయాలే, రాఖీ రాఖీయే’ అని చెప్పిన కవిత, ఈసారి తన సోదరుడు అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ ఘటన బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు వేరు వేరుగా ఉండాలి. కానీ కొంతమంది నాయకులు ఈ రెండింటిని కలిపి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి వంటి వారు వేర్వేరు పార్టీలలో ఉన్నా, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజకీయ వైరుధ్యాల వల్ల దూరం పెరిగింది. వారి మధ్య ఆస్తి వివాదాలు, రాజకీయ నిర్ణయాల కారణంగా మాట్లాడటం మానేశారు.

కవిత, కేటీఆర్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతోంది. రాజకీయంగా కవిత తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కేటీఆర్ ఆమెకు దూరం అయ్యారు. ఈ కారణంగానే ఇటీవల రాఖీ పండుగ రోజున కూడా వారు కలుసుకోలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి విభేదాలు పార్టీలపై కూడా ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X