14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా?
సీఎం వస్తే…టీచర్లకు డీఏలు, జీపీఎఫ్ పైసలు, రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ప్రకటిస్తారని భావించినం
ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు, నిరుద్యోగ భ్రతి, 2 లక్షల ఉద్యోగాలపై ప్రకటన చేస్తారని యువత ఆశించింది
గుజరాత్, మధ్యప్రదేశ్ లోనే కాదు…తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకులవంటి కులాలకు రిజర్వేషన్లు అమలవుతున్నయ్
మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదే
12.5 శాతం ముస్లిం జనాభాలో 10.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం?
నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపితే బీసీల పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు*
మీ పాలనలోనే ఫోన్ ట్యాపింగ్ దొంగలు విదేశాలకు పారిపోయింది నిజం కాదా?
సీబీఐ విచారణ కోరితే హైకోర్టు ముందే మీ అడ్వోకేట్ జనరల్ ఒప్పుకోని మాట వాస్తవం కాదా?
దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి…దోషలందరి సంగతి తేలుస్తాం…
విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికిచ్చి 3 నెలలైనా చర్యలేవి?
కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మీకు లేదా?
వెనుకబాటు ఆధారంగా నిధుల పంపిణీ ఉంటుందనే సోయి లేదా సీఎంగారు
తెలంగాణ రెవిన్యూలో హైదరాబాద్ వాటా అత్యధికం
హైదరాబాద్ సొమ్మును ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి వెనుకబడి ప్రాంతాలకు నిధులు ఖర్చు చేస్తోంది నిజం కాదా?
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటారా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
ఉద్యోగాల కల్పన, నిధుల ఖర్చుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్
సవాల్ విసిరితే సీఎం తోకముడిచారని ఎద్దేవా
హైదరాబాద్ : ‘‘మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. బీజేపీది ఇండియా జట్టు. పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లోనూ గెలుపు బీజేపీదే. పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్దమా? అని సవాల్ విసిరారు. తెలంగాణసహా ఏ గ్రామానికి, ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్ కు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది? రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలపై లెక్కా పత్రంతో సహా బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. తాము గతంలోనే సవాల్ చేస్తే సీఎం తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈరోజు ఉదయం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంజయ్ ఏమన్నారంటే…
ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా టీం, పాకిస్తాన్ టీం మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండి. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తాం.
కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు ఎప్పటి నుండో రిజర్వేషన్లు అమలు… మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. కానీ 12.5 శాతం జనాభా ఉన్న ముస్లిం జనాభాలో 8.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం? నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా? ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే ప్రభుత్వం ఒప్పుకోని విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే కాంగ్రెస్. మీరు విదేశాలకు పంపిస్తే…మేం పట్టుకురావాలా? కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తరువాత కూడా ఆయనకు కనీసం నోటీసు కూడా ఎందుకియ్యలే?
కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం కూడా చేయలేని అసమర్ధులు మీరు. ఫాంహౌజ్ డ్రగ్స్ లో కేటీఆర్ ఉన్నాడని చెప్పింది రేవంత్ రెడ్డే కదా? విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదు? ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ వల్లే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందని సీఎం హోదాలో రేవంత్ రెడ్డే చెప్పారు.. ఎందుకు అరెస్ట్ చేయలేదు?. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిగా విచారణ కమిషన్ గడువును పొడిగిస్తున్నారే తప్ప కేసీఆర్ ను ఎందుకు విచారించలేదు?. మీరు విచారణ చేస్తూ కేంద్రం ఎందుకు పట్టుకురావడం లేదంటే ఏమనాలి? మీకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి… కేసును సీబీఐకి అప్పగించండి. దోషులందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాం.
యమునా, గంగా, సబర్మతి ప్రక్షాళనకు అతి తక్కువ ఖర్చుతో చేశారు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షలకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలి?
తెలంగాణ నుండి రూపాయి వెళితే 42 పైసలే కేంద్రం ఇస్తోంది… బీహార్, యూపీలకు ఎక్కువ ఇస్తున్నారని చెప్పడమేంది? వెనుకబాటు ఆధారంగా కేంద్రం ఆయా రాష్ట్రాలకు నిధులను పంపిణీ చేస్తున్న విషయం మీకు తెలియదా? తెలిసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారా? తెలంగాణ రెవిన్యూలో అత్యధిక షేర్ హైదరాబాద్ దే… కానీ ఆదిలాబాద్, ములుగు వంటి వెనుకబడిన జిల్లాలకు అధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది? అట్లని హైదరాబాద్ కు అన్యాయం చేసిందని అనుకోవాలా?
యూపీఏ 10 ఏళ్ల పాలనలో 2.94 కోట్ల ఉద్యోగాలను మాత్రమే స్రుష్టించింది. మోదీ 10 పాలనలో 17 కోట్ల 19 లక్షల ఉద్యోగాలను స్రుష్టించింది నిజం కాదా? రెండేళ్లలోనే రోజ్ గార్ మేళా పేరుతో 9 లక్షల 25 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది నిజం కాదా?. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నవ్… ఎటు పోయింది? తెలంగాణ అభివ్రుద్ధిలో కేంద్రం ఏం చేసింది? రాష్ట్రం ఏం చేసిందనే విషయంపై గ్రామాల వారీగా లెక్కలతో సహా చర్చకు సిద్ధం. మేం సవాల్ చేస్తే సీఎం తోకముడిచారు. ఎమ్మల్సీ ఎన్నికల క్రికెట్ మ్యాచ్ లో బీఆర్ఎస్ జట్టే లేదు… ఆ టీంకు సభ్యులే లేక మ్యాచ్ నుండి వైదొలగింది.
వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అంటే… రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా వరి వేయుద్దు… వేస్తే నష్టపోతారని రైతులను హెచ్చరిస్తున్నారు… మీకు, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది? ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డా నీటి కటకట ఎందుకొచ్చింది? మీ అసమర్ధత, పొరుగు రాష్ట్రానికి నీటిని దోచిపెట్టడంవల్లే ఈ దుస్థితి వచ్చింది. ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ బీసీ సమాజాన్ని అవమానిస్తవా? మోదీ బీసీయే కాదని చెప్పిన ముఖ్యమంత్రే… ఇయాళ పెద్ద బీసీ అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు వస్తుంటే…రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు డీఏలు, జీపీఎఫ్ సొమ్ము, రిటైర్డ్ బెన్ ఫిట్స్, ఫీజు రీయంబర్స్ బకాయిలపై ప్రకటన చేస్తారని ఆశపడ్డ పట్టభద్రులు, ఉద్యోగులను నిరాశకు గురి చేసినవ్. ఉద్యోగులకు ప్రతినెలా జీతం ఇవ్వడం మీ బాధ్యత… వాళ్లు పనిచేస్తేనే జీతాలిస్తున్నవ్ కదా… ఏదో బిచ్చమేస్తున్నట్లు మాట్లాడతారా? 6 గ్యారంటీలు సహా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేశారని భావిస్తే… ఆ పార్టీకే ఓటేయండి.
మీ సమస్యలపై నిరంతరం పోరాడుతూ సర్కార్ మెడలు వంచేది బీజేపీయే అనుకుంటే మాకు మద్దతివ్వండి. మీకు ఏ కష్టమొచ్చినా బీజేపీ అండగా ఉంటుంది. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల ఇప్పించేలా మీతరపున కొట్లాడుతోంది బీజేపీయే.
కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? 14 నెలల్లో మీరు ఒరగబెట్టిందేమిటి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనందుకా? నిరుద్యోగ భ్రుతి ఇవ్వనందుకా? మహిళలకు నెలనెలా రూ.2500లు ఇవ్వనందుకా? తులం బంగారం, స్కూటీ ఇవ్వనందుకా? రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? 20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇవ్వనందుకా? ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలియ్యనందుకా? పెన్షన్ పైసలు ఇయ్యనందుకా? దాచుకున్న జీపీఎఫ్ పైసలను కూడా ఇయ్యనందుకా? ఆఖరికి రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నందుకు మీకు ఓటేయాలా? బీజేపీకి ఓటేస్తే ప్రతిరోజు మీ పక్షాన కొట్లాడతాం… ప్రభుత్వ మెడలు వంచి మీ సమస్యలను పరిష్కరించేలా చేస్తాం.
నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి బీసీలకు అన్యాయం చేశారనడం అబద్దం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎంకు సవాల్ చేస్తున్నా… మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా?
Also Read-
“Our India team, Congress the Pakistan team, we will defeat the Congress team thumpingly in the match on the 27th as well”
Hyderabad: “In the recent India-Pakistan Champions Trophy match, India won. BJP is Team India. Congress is Team Pakistan, aligning with those who celebrate Pakistan’s victories. BJP will win the MLC election match on the 27th, just like India defeated Pakistan,” remarked Union Minister of state Bandi Sanjay Kumar.He challenged CM Revanth Reddy, asking if he was ready to treat the MLC election results as a referendum on his 14 months of governance.
This morning, at a press conference held at the MP’s office in Karimnagar, Bandi Sanjay spoke alongside MLAs Payala Shankar, Kattepalli Venkataramana Reddy, former MLA Chintala Ramachandra Reddy, former Mayor Sunil Rao, and BJP state spokesperson J. Sangappa. During the event, Bandi Sanjay strongly criticized the statements made by CM Revanth Reddy during the MLC election campaign. Here’s what Sanjay said
He demanded transparency on how much funding the Center allocated to every village, municipality, and corporation in Telangana and how much the state spent, calling for an open debate.
Recalling his earlier challenge, he noted that the CM had backed down then as well.
“On the 27th, the MLC election will be a match between Team India and Team Pakistan. If you want India to win, vote for BJP. If you want Pakistan to win, vote for Congress. If BJP wins, we will fulfill the aspirations of graduates and teachers,” he said.
“We are not against caste enumeration. We oppose including Muslims in the BC list. Reservations for communities like Dudekulas have been implemented for a long time in Telangana, and we never objected. But why should we accept including 8.8% of Muslims in the BC list when they make up 12.5% of the population? Merging over 88% of Muslims into the BC category will harm genuine BCs. If a bill is sent to include all Muslims in the BC list, why should we approve it?”
“Explain how the BC population, which was 56% as per the comprehensive family survey, has suddenly decreased to 60 lakhs. Why didn’t you object when KTR and Harish announced the 56% BC population in the Assembly?”
“Isn’t it true that after Congress came to power, Prabhakar Rao and Shravan fled abroad? Congress let them escape. If you sent them abroad, why should we bring them back?” “If you have the courage, request a CBI inquiry and hand over the case to the CBI. We will arrest all the culprits.”
They cleaned the Yamuna, Ganga, and Sabarmati rivers at a very low cost. If they want to increase the cost of Musi river cleaning from ₹1.5 lakh to ₹15,000 crore just to earn commissions for the Congress leader’s son-in-law, why should the central government cooperate?
If one rupee goes from Telangana, only 42 paise comes back from the center… What’s wrong in saying that more is given to Bihar and UP? Don’t you know that the center allocates funds to states based on backwardness? Or are you intentionally trying to incite regional hatred? The majority share of Telangana’s revenue comes from Hyderabad… But the state government spends more on backward districts like Adilabad and Mulugu. Should we then say that Hyderabad is being wronged?
During the 10-year rule of the UPA, only 2.94 crore jobs were created. Isn’t it true that during Modi’s 10-year rule, 17.19 crore jobs were created? Didn’t they fill 9.25 lakh central government jobs under the “Rozgar Mela” in just two years? You said you’d fill 2 lakh jobs every year… Where did they go? I’m ready to discuss, with village-wise statistics, what the center did for Telangana’s development and what the state did. When we challenged, the CM backed out. In the MLC election cricket match, the BRS team isn’t even participating… They withdrew from the match because they don’t have enough members.
If KCR says growing paddy will result in hanging… Even the Farmers Welfare Commission Chairman Kodanda Reddy is warning farmers not to grow paddy, saying they will incur losses… What’s the difference between you and BRS governance? Even though there’s been abundant rainfall this year, why is there still a water shortage? This situation arose because of your incompetence and giving away water to neighboring states.
Are you insulting the BC community by calling Modi the “big BC” and me the “small BC”? The same Chief Minister who once said Modi isn’t BC is now calling him the “big BC.”
During the MLC elections, graduates and employees hoped for announcements on ₹4,000 unemployment benefits, filling 2 lakh jobs, DA arrears, GPF funds, retired benefits, and fee reimbursement dues… But you disappointed them. It’s your responsibility to pay employees’ salaries every month… You’re paying them for their work, not giving alms. If you believe all the manifesto promises, including the 6 guarantees, have been fulfilled… then vote for that party.
If you believe that BJP continuously fights for your issues and pressures the government, then support us. BJP stands with you in your struggles. It is BJP that is fighting on your behalf to clear the fee reimbursement dues.
Why should you vote for Congress? For not filling 2 lakh jobs in 14 months? For not giving unemployment benefits? For not giving ₹2,500 monthly to women? For not providing 1 tola gold and scooters? For failing in Raithu Bharosa? For not waiving loans for 20 lakh people? For not giving the ₹5 lakh insurance card to students? For not giving 5 DAs to employees and teachers? For not giving pension money? For not releasing the saved GPF money? Finally, for not giving retirement benefits and leaving employees stranded? If you vote for BJP, we will fight for you every day… We will pressure the government to solve your issues.
Claiming that removing me from the state president’s position is an injustice to BCs is a lie. I was promoted as the BJP’s national general secretary and a Union Minister. To the CM who is boasting about Congress governance, I challenge you… Shall we consider the MLC elections as a referendum on your 14-month rule?