జెఎన్ఏఎఫ్ఏయూకి భూ కేటాయింపులను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ వర్శీటీలో 53 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు నిరసనను కొనసాగించారు. అధ్యాపక, అధ్యాపకేతర, ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనం వద్ద నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఎసే ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; సెక్రటరీ జనరల్ డా. పి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడతూ భవిష్యత్ అంతా ఓపెన్ యూనివర్సిటీలదే అని తెలంగాణ మేధావుల వర్గం పేర్కొంటుంది అని వివరించారు. తెలంగాణా మేధావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూములను ఎవరికీ కేటాయించరాదని లేఖ రాసినా, ఉద్యోగులు 53 రోజులుగా విశ్వవిద్యాలయంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భూ కేటాయింపు లేఖను ఉపసంహరించుకోకపోవడ దురదృష్టకరమని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోనున్నట్లు పేర్కొన్నారు.
Also Read-
ఈ నిరసన కార్యక్రమంలో జేఎసే నేతలు ప్రొ. జి. పుష్పా చక్రపాణి; ఎండి హబీబుద్దిన్; డా. ప్రమీల కేతావత్; కాంతం ప్రేమ్ కుమార్, రజనికాంత్; రాములు; షబ్బీర్, జహంగీర్, డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేందర్, అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.