డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న నిరసనలు
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించొద్దని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పది ఎకరాల స్థలం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ, ఆ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆందోళనకు దిగారు.
జేఎసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, కంప్యూటర్ ఇంజనీర్ వసంత రావు మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయం దేశంలోనే మూడో మెగా యూనివర్సిటీ అని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో డిగ్రీ నుండి పరిశోధన కోర్సుల వరకు వివిధ కోర్సులో విద్యను అందిస్తున్నామన్నారు. నూతన విద్య విధానం ప్రకారం (నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (NEP)-2020 విద్యార్థులకు విద్యావకాశాలను అందించడానికి వివిధ కోర్సులు అందుబాటులోకి తీసుకోరావాలని ప్రయత్నం చేస్తున్నమన్నరు.
ఇది కూడ చదవండి-
దేశలో స్థూల నమోదు నిష్పత్తిని పెంచడానికి ఈ విశ్వవిద్యాలయ దూర విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా కొనసాగతున్న ఈ నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఎసీ నేతలు నేతలు అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.