मेगास्टार चिरंजीवी को अक्किनेनी राष्ट्रीय पुरस्कार-2024
अमिताभ बच्चन और बड़ी संख्या में टॉलीवुड हस्तियां मौजूद
हैदराबाद: मेगास्टार चिरंजीवी को प्रतिष्ठित अक्किनेनी नागेश्वर राव राष्ट्रीय पुरस्कार से सम्मानित किया गया। यह कार्यक्रम सोमवार को हैदराबाद के अन्नपूर्णा स्टूडियो में आयोजित किया गया। इस कार्यक्रम में बॉलीवुड सुपरस्टार अमिताभ बच्चन मुख्य अतिथि के रूप में मौजूद थे। उनके हाथों चिरंजीवी को यह अवॉर्ड प्रदान किया गया।
इस दौरान चिरंजीवी ने खुशी जताते हुए कहा कि भले ही उन्हें अब तक कितने भी पुरस्कार मिले हों, लेकिन उन्हें लगता है कि यह पुरस्कार एक वास्तविक बड़ी उपलब्धि है। इस कार्यक्रम में चिरंजीवी ने अमिताभ के पैर छूकर आशीर्वाद लिया। तब अमिताभ बच्चन ने अपने हाथों से उठा लिया। चिरंजीवी इस दौरान भावुक हो गये और कहा कि यह पुरस्कार उनकी सबसे बड़ा पुरस्कार है।
यह भी पढ़ें-
इस कार्यक्रम में चिरंजीवी और नागार्जुन के परिवार के सदस्यों के साथ-साथ वेंकटेश, राघवेंद्र राव, अश्विनिदत, सुब्बीरामी रेड्डी और अन्य फिल्मी हस्तियां बड़ी संख्या में मौजूद थी। नागार्जुन ने पिछले महीने की 20 तारीख को अक्किनेनी की शताब्दी के अवसर पर घोषणा की थी कि चिरंजीवी को अक्किनेनी नागेश्वर राव राष्ट्रीय पुरस्कार-2024 पुरस्कार दिया जाएगा।
అమితాబ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం
హాజరైన అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ప్రముఖులు
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు.
ఇప్పటివరకు తనకు ఎన్ని అవార్డులు వచ్చినా ఈ అవార్డు రావడం నిజమైన అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నానని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో చిరంజీవి అమితాబ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవడం అనే నానుడికి భిన్నంగా తాను రచ్చ గెలిచాక ఇంట గెలిచానని ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు వెంకటేశ్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, సుబ్బిరామిరెడ్డి తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024కు గాను చిరంజీవికి ఈ అవార్డును అందజేయనున్నట్టు అక్కినేని శతజయంతి సందర్భంగా గత నెల 20న నాగార్జున ప్రకటించారు.