వరద బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ కు కురుమ సంఘం ఆధ్వర్యంలో 10 లక్షలు విరాళం

హైదరాబాద్ : ఆకాల వర్షాల వల్ల తెలంగాణలో వరదలతో సర్వస్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కురుమ సంఘం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ కురుమ సంఘం తరఫున ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య , శాసనమండలి సభ్యులు ఎగ్గె మల్లేశం, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పది లక్షల రూపాయలు చెక్ ను అందజేశారు.

ఈ కార్యక్రమం లో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి తదితరులు ఉన్నారు.

Also Read-

త్వరలో గల్ఫ్ ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం 

గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ ఎన్నారై సెల్ ప్రతినిధి బృందం ఆదివారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జి పి. వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ జెఏసి నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు లతో వేం నరేందర్ రెడ్డి చర్చించారు. త్వరలో గల్ఫ్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17 లోగా గల్ఫ్ సంక్షేమంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. 

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్, మేడ్చల్

విషయము : మాజీ మంత్రి హరీష్ రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిపై చర్యలు తీసుకోనుట గురించి.

మేడ్చల్ లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యపై ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన తీరు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉంది. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. 2014, 2018లో గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన విధి, విధానాలను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండా రైతులను రెచ్చగొట్టేలా, ప్రజల్లోకి ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లేలా హరీష్ రావు మాట్లాడారు.

మేడ్చల్ లో జరిగిన సురేందర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో నిజానిజాలు దాచి పెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన సురేందర్ రెడ్డి కుటుంబంలో వారి తల్లికి రూ.1లక్ష 50వేల రుణమాఫీ జరిగింది. రుణమాఫీ కానివారి వివరాలను సేకరించి వారికి రుణమాఫీ జరిగేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ ఇక రుణమాఫీ జరగదు అనేలా హరీష్ రావు మాట్లాడిన తీరు రైతుల మనోస్థెర్యాన్ని దెబ్బతీసి వారిని ఆత్మహత్యకు పురి గోల్పేలా ఉంది. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం నేరపూరిత కుట్ర 61(2), ఆత్మహత్యకు ప్రేరేపణ సెక్షన్ 108 ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.

https://twitter.com/i/status/1832633922867380228

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X