Crime News: बीटेक छात्र की हत्या मामले में पुलिस को मिली बड़ी सफलता, सात आरोपी गिरफ्तार

हैदराबाद: शहर के बालापुर पुलिस ने गुरुवार दोपहर बालापुर चौक पर एक होटल के पास इंजीनियरिंग के छात्र मोंड्रू प्रशांत (21) की हत्या के आरोप में सात लोगों को गिरफ्तार किया है। छात्र प्रशांत बी.टेक द्वितीय वर्ष का छात्र था। पुलिस ने बताया कि गिरफ्तार आरोपियों में- पी. माधव यादव (24), सी. महेश यादव (25), आर. सुमंत चारी (21), एन. महेश (24), डी. हरीश (23), एम. अखिल किरण कुमार (20) और के. यशवंत (19) शामिल हैं। इन आरोपियों ने साजिश रचकर मोंद्रू प्रशांत की हत्या कर दी।

महेश्वरम डीसीपी डी सुनीता रेड्डी ने मीडिया को बताया कि हत्या के मुख्य संदिग्ध माधव की पीड़ित से करीब एक साल से दुश्मनी थी और उसने उसे मारने की योजना बनाई। डीसीपी ने बताया कि माधव को संदेह था कि प्रशांत उसकी गर्लफ्रेंड को गुमराह कर रहा है और वह इसका बदला लेना चाहता था। गुरुवार को जब सभी एक दोस्त का जन्मदिन मनाने के लिए एकत्र हुए थे, तो विवाद के बाद माधव ने प्रशांत पर चाकू से वार कर दिया, जिससे उसकी मौत हो गई।” घटना के बाद पुलिस ने हत्या में शामिल सभी सात लोगों की पहचान कर उन्हें गिरफ्तार कर लिया। आगे की कार्रवाई की जा रही है।

Related News-

బీటెక్​ విద్యార్థి హత్య, ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్ : ఇంజనీరింగ్​ విద్యార్థి హత్య కేసు మిస్టరీని బాలాపూర్​ పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్​ చేయడంతో పాటు తనపై చెడుగా చెబుతున్నాడన్న అనుమానంతోనే మాధవ్​యాదవ్​ పక్కా ప్రణాళికతో ప్రశాంత్​ను ఆరుగురు స్నేహితులతో కలిసి హతమార్చినట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు. ప్రశాంత్​ను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఏడుగురు నిందితులను బాలాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేసి, రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్ లతో పాటు ఐదు బైక్ లు, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాలాపూర్​ ఇన్​స్పెక్టర్​ తోట భూపతి తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా అయ్యవారి గూడెం ప్రాంతానికి చెందిన మోండ్రు అనిత, శాంతయ్య కుమారుడు మోండ్రు ప్రశాంత్​ (21) నాదర్​గూల్​లోని ఎంవీఎస్సార్ ఇంజనీరింగ్​ కళాశాల ద్వితీయ సంవత్సరం చదివేవాడు. గత కొంత కాలం క్రితం తన తల్లి అనితతో కలిసి బతుకు తెరువు కోసం బాలాపూర్​ గ్రామానికి వలస వచ్చారు. తల్లి అనిత ఇళ్లలో పాచిపని చేస్తూ కుమారుడు ప్రశాంత్​ను చదివిస్తుంది. ఇది ఇలా ఉండగా బాలాపూర్​కు చెందిన పి.రమేష్​ కుమారుడు పోచబోయిన మాధవ్​ యాదవ్​ (24) వృత్తి రీత్యా పాల వ్యాపారి. ఇతనికి కొంత కాలం క్రితం మోండ్రు ప్రశాంత్​తో పరిచయం ఏర్పడింది. మాధవ్​ యాదవ్​ కు ప్రశాంత్​ కు మధ్య 10 నెలల నుంచి చిన్న చిన్న విషయాల్లో గొడవ జరిగేది. దీంతో ప్రశాంత్​ పై మధవ్​ యాదవ్ మనస్సులో కక్ష పెంచుకున్నాడు.

అంతేగాకుండా తన ప్రియురాలితో ప్రశాంత్​ చాటింగ్​ చేయడంతో పాటు తనపై చెడుగా చెబుతున్నాడనే అనుమానం రోజు రోజుకు పెంచుకోసాగాడు. ఈ నేపధ్యంలోనే ప్రశాంత్​ను ఎలాగైనా హత్య చేస్తామని తన స్నేహితులైన నాదర్​ గూల్​ కు చెందిన చింతాల మహేష్​ యాదవ్​ అలియాస్​ మళ్లి కార్జున్​ (25), నాదర్​గూల్​కు చెందిన నామోజు సుమంత్​ చారి, బాలాపూర్​కు చెందిన నల్లపూసల మహేష్​, బాలాపూర్​ గ్రామానికి చెందిన దొడ్డి హరీష్​, బాలాపూర్​ గ్రామానికి చెందిన అఖిల్​ కిరణ్​ కుమార్​, నాదర్​గూల్​ కు చెందిన కొహెడ యశ్వంత్​తో కలిసి నిందితుడు హత్యకు పథకం రూపొందించాడు. ఈ నెల 22వ తేదీన బాలాపూర్​లోని గణేష్​ చౌక్​ ప్రాంతంలోని 37మండి అరేబియన్​ బిర్యాని సెంటర్​ను అనువుగా ఎంచుకున్నారు.

ఇంజనీరింగ్​ కళాశాలలో పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న ప్రశాంత్​కు ఫోన్​ చేసి బిర్యాని సెంటర్​ వద్దకు పిలుచుకున్నారు. అక్కడ పాన్​ షాప్​ వద్ద ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మాధవ్​ యాదవ్​ గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ప్రశాంత్​పై విచక్షణా రహితంగా దాడిచేశాడు. పక్కనే ఉన్న చింతాల మహేష్​ యాదవ్​, నామోజు సుమంత్​ చారిలు ప్రశాంత్​ చేతులపై దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన ప్రశాంత్​ అక్కడికక్కడే మృతిచెందడంతో మాధవ్​ యాదవ్​తో పాటు మరో ఆరుగురు స్నేహితులు పరారయ్యారు.

మృతుని తల్లి అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని, సీసీ కెమెరాల ద్వారా హత్యచేసి పారిపోతున్న నిందితులను గుర్తించారు. మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి ప్రశాంత్​ను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న మాధవ్​ యాదవ్​ తో పాటు మహేష్​యాదవ్, సుమంత్​చారి, నల్ల పూసల మహేష్​, దొడ్డి హరీష్​, అఖిల్​ కిరణ్​ కుమార్​, కొహెడ యశ్వంత్​లను అదుపులోకి తీసుకుని శనివారం సాయంత్రం రిమాండ్​కు తరలించారు. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X