KTR and Leaders Meet DGP to Lodge Complaints Against Congress Cadre Political Violence And Police Negligence

Hyderabad: The Working President of the Bharat Rashtra Samithi (BRS), Shri K.T. Rama Rao (KTR), along with senior leaders of the party, met with the Director General of Police (DGP) of Telangana to file a formal complaint regarding recent political violence against BRS party members involving Congress party cadres and alleged police negligence. The complaints highlight a series of disturbing events that have raised serious concerns about law and order in the state.

The BRS leaders lodged a complaint about an attack by Congress goons on the BRS party’s protest camp in Tirumalagiri, Suryapet District which took place yesterday. Under the leadership of student leader and former Tungaturthi MLA, Gadari Kishore, BRS organized a peaceful farmers’ protest, adhering strictly to democratic principles. However, the protest was violently disrupted by 50 Congress cadres, reportedly under the influence of alcohol, who launched an unprovoked assault using stones, eggs, and crude bombs.

Commenting on the incident, KTR stated, “Had our people retaliated, not a single one of those 50 Congress goons would have survived. But we chose to maintain peace and refrained from any counteractions.” He expressed shock and dismay at the role of the police in this matter, accusing them of dismantling the protest camp’s tent rather than protecting the protesters. Another serious complaint was lodged concerning the attack on two female journalists and other reporters who visited the Chief Minister’s hometown, Kondareddypally, to investigate the status of loan waivers. These journalists were reportedly subjected to indecent attacks by Congress goons. KTR condemned the attack, stating, “They only went there to inquire about the status of loan waivers. Yet, even they were attacked by Congress thugs.”

He further criticized the CM’s silence on the issue, demanding an apology. KTR also pointed out the malicious social media campaigns against the journalists, allegedly orchestrated by Congress supporters. KTR criticized Chief Minister Revanth Reddy, labeling him a coward who cannot face the public. “When we challenged him to discuss loan waivers anywhere, he didn’t show up. Instead, he has traveled to Delhi 20 times,” KTR remarked, questioning the CM’s commitment to state issues while spending significant time in Delhi.

The BRS delegation expressed deep concern over the recent trend of police officers acting with what they described as “over-enthusiasm.” The complaint emphasized that such behavior, driven by political interference, has led to the filing of false cases and acts of violence against opposition leaders. KTR highlighted instances where police officers were involved in non-official activities, such as participating in birthday celebrations of certain ministers, which he termed inappropriate. “We sympathize with the police force, but it’s unacceptable for some officers to misuse their authority in this manner,” KTR said. He warned that power is transient, and those in authority should act with responsibility rather than over-enthusiasm.

The BRS leaders demanded immediate action against those involved in the Tirumalagiri attack and the assaults on journalists. They urged the DGP to ensure that the perpetrators are charged and arrested promptly. KTR emphasized that if journalists, who play a critical role in democracy, are not safe, the safety of ordinary citizens is even more at risk. KTR also criticized the deteriorating law and order situation in Hyderabad, citing reports of 28 murders within a month, and questioned the CM’s ability to maintain peace and safety in the city.

“We have remained patient so far, only because we do not want to damage Hyderabad’s brand image. But do not mistake our patience for weakness,” KTR concluded, warning of inevitable retaliation if the current situation continues. The BRS leaders have urged the DGP to take immediate and strict action on all the issues raised, stressing the importance of maintaining law and order in the state and ensuring that the police force acts impartially and responsibly.

Also Read-

బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరి పై రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు.

కేటీఆర్ మాట్లాడుతూ… నిన్న ఒక్కటే రోజు రెండు ఉదంతాలు జరిగాయి. వాటికి సంబంధించి ఆధారాలతో సహా డీజీపీ గారికి కంప్లైంట్ చేయటం జరిగింది. విద్యార్థి నాయకుడు, తుంగతుర్తి మాజీ శాసస సభ్యుడు గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టాం.

50 మంది కాంగ్రెస్ గుండాలు, తాగిన మత్తులో ఆకస్మికంగా రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారు. మా వాళ్లు తిరగబడి ఉంటే ఆ 50 మంది కాంగ్రెస్ మూకలు ఒక్కరు కూడా మిగిలేవారు కాదు. కానీ శాంతియుతంగా మేము నిరసన తెలుపాలని భావించాం. అందుకే ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడలేదు. పోలీసులే మా నిరసన దీక్ష కు సంబంధించిన టెంట్ కూల్చేయటం ఆశ్చర్యం కలిగించింది. ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ ఈ సీఎం రేవంత్ రెడ్డి.

రుణమాఫీ పై ఏ ఊరికైనా వెళ్దాం రా అని మేము సవాల్ చేస్తే రాలేదు. కానీ ఢిల్లీకిి 20 సార్లు పోయిండు. క్షేత్రంలో తిరగాల్సిన సీఎం…ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నాడు. నిన్న ఇద్దరు మహిళ జర్నలిస్ట్ లు సీఎం సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోయారు. వాళ్ల మీద కాంగ్రెస్ గుండాలు అసభ్యకరంగా దాడి చేశారు. వాళ్లేమైనా ముఖ్యమంత్రి లాగ బజారు బాష మాట్లాడారా? లాగుల తొండలు జొర్రకొడతాం, చెట్టుకు కట్టేసి కొడతాం అన్నారా? రుణమాఫీ అయ్యిందా? లేదా అని తెలుసుకోవటానికి వెళ్లారు. వారిపైన కూడా కాంగ్రెస్ చిల్లరగాళ్లు దాడి చేశారు. కాంగ్రెస్ గుండాలు వాళ్లను వెల్దండ పోలీస్ స్టేషన్ వరకు వెంబడించారు. ఆ ఆడబిడ్డలు ఏం తప్పు చేశారు? వారికి సీఎం క్షమాపణం చెప్పాలి. నీ బండారం బయట పెట్టినందుకా? వారి మీద దాడి చేయించవ్.

.
అంతే కాకుండా వాళ్ల మీద నికృష్ణమైన బాషలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ చిల్లర మనుషులు ప్రచారాలు చేస్తున్నారు. సీఎం కి దమ్ముంటే నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు. అక్కడికి వెళ్లి రుణమాఫీ అయ్యిందా అనే విషయాన్ని అడుగుదాం. ఎక్కడ కూడా చారాణ రుణమాఫీ కాలేదు. రాష్ట్రంలో మనం పోలీసులను, వ్యవసాయ అధికారులను తప్పు బట్టాల్సిన పని లేదు. తప్పు ముఖ్యమంత్రిది, చేతకాని సన్నాసి సీఎం ది. అయితే పోలీసుల మీద మాకు సానుభూతి ఉంది. కానీ కొంత మంది పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అది మంచిది కాదు.

సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అత్యుత్సాహం దర్శించవద్దు. అధికారం మారుతుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులకు సూచిస్తున్నా. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. మహిళా జర్నలిస్ట్ లపై దాడులు చేసిన వారిపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. జర్నలిస్ట్ లకే రక్షణ లేకపోతే…రాష్ట్రంలో సామాన్య పౌరుల పరిస్థితి ఏందీ?

మంచిర్యాలలో ఎమ్మెల్యే కారణంగా మా నాయకుడు గొంతు కోసుకున్నాడు. మొత్తంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి అధికారం చెలాయించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. నెల రోజుల్లో 28 హత్యలు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నగరానికి ఏమైంది అంటూ సీఎం కు దన్నుగా నిలిచిన పత్రికలే వార్తలు రాస్తున్నాయి.

పోలీసు యంత్రాంగం మీద మాకు సానుభూతి ఉంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సీఎం అధికారం చెలాయిస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా మా పార్టీ యువకులను వేధిస్తున్నారు. ఇంకా ఇలాగే కొనసాగితే మా నుంచి ప్రతిఘటన కూడా తప్పదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దనే మేము ఇప్పటి వరకు ఊరుకుంటున్నాం.

మా సహనాన్ని, చేతగాని తనం అనుకోవద్దు. మేము ప్రతిఘటిస్తే అప్పుడు మా మమ్మల్ని నిందించవద్దు. కొంతమంది పోలీసులు మంత్రుల బర్త్ డే కార్యక్రమాల్లో పరవశించి పోతున్నారు. డీజీపీ గారికి ఇలాంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చండి. పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ లాంటి నేతల భవనాలను కూల్చేసి ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X