డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్స్ సొసైటీ 32వ వార్షిక సమావేశం
హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU), చరిత్ర విభాగం, సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్స్ సొసైటీ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో సంయుక్తంగా “న్యూమిస్మాటిక్స్ – రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ సౌత్ ఇండియన్ హిస్టరీ, దక్షిణ భారత న్యూమిస్మాటిక్స్ సొసైటీ 32వ వార్షిక సదస్సు బుధవారం అంబేద్కర్ వర్షీటీలో ప్రారంభం అయ్యింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్కైవల్ బోర్డు సభ్యుడు, ఎన్‌ఎఐ, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొ. వి. కిషన్ రావు హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ చరిత్రకారులు చరిత్రను భవిష్యత్ తరాలకు అందుంచాలి అంటే గతాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో విజ్ఞానం ఉందని, తమలో తాము ఒక ఎన్సైక్లోపీడియా అని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూమిస్మాటిక్స్ స్ఫూర్తికి మూలం, చరిత్ర నిర్మాణం లేదా పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రతి చరిత్రకారుడు గత ఆవిష్కరణల ప్రాంతాలకు వెళ్లి వారి పరిశోధనలను అధ్యయనం చేయాలన్నారు. నేర్చుకోవడం అనేది రోజువారీ ప్రక్రియ అని ఇది చరిత్రను అభ్యసించే ప్రతి విద్యార్థికి నిరంతర ప్రక్రియగా ప్రక్రియగా మారాలన్నారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రొఫెసర్ రాజా రెడ్డి ప్రాచీన చరిత్రకు శాతవాహనుల కృషిని కొనియాడారు. శాతవాహనుల కాలంనాటి విశిష్టమైన సాహిత్య రచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో శాతవాహనుల స్థానాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రీ. పూ. మూడింట ఒక వంతు వాళ్ళే పాలించారన్నారు. శాసనాలు, నాణేలు, సాహిత్య రచనలు చరిత్ర మొదలగు వాటిని నిక్షిప్తం చేయాలన్నారు.
కరీంనగర్‌లో గత 30 ఏళ్లలో రెండు శాసనాలు లభ్యం కాగా, తాజాగా 10 రోజుల కిందట చెముక శాతవాహనుడి ఉనికి నాణేల ద్వారా గుర్తించపడిందన్నారు. కరీంనగర్‌లో 420, ఈసంపల్లిలో 10 నాణేలు లభ్యమయ్యాయని వివరించారు. శాతవాహనులు తమ నాణేలపై సిరి లేదా శ్రీని ఉంచే సంప్రదాయాన్ని కలిగి ఉన్నారని, యువ పరిశోధకులు నాణేలపై నిరంతరం అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రొఫెసర్ E సుధా రాణి సెమినార్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ GRCRD
కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ భారతీయ చారిత్రక ఉద్యమాలు, భారతదేశ చరిత్ర యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పరిశోధన సమయంలో వారు కనుగొన్న సాక్ష్యాలను నమోదు చేయాలని ఆమె పరిశోధకులకు సూచించారు. చరిత్రను అన్వేషించి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వాటిని రికార్డు చేయాలని సూచించారు.
ప్రొఫెసర్ KP రావు, హిస్టరీ విభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, డాక్టర్ సత్య మూర్తి, డైరెక్టర్ ASI (కేరళ), డాక్టర్ రాధా కృష్ణ, మ్యూజియం క్యూరేటర్, RBI, సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్స్ సొసైటీ, ప్రొఫెసర్ AVN రెడ్డి, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ వడ్దానం శ్రీనివాస్, డీన్, సోషల్ సైన్సెస్, Dr G దయాకర్, స్థానిక కార్యదర్శి మరియు హిస్టరీ విభాగ అధిపతి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. అన్ని విభాగాల డీన్‌లు, డైరెక్టర్లు, బ్రాంచ్‌ల అధిపతులు, ఇతర విశ్వవిద్యాలయాల చరిత్రకారులు, వివిధ శాఖల అధిపతులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గిన్నారు.
NUMISMATICS RECONSTRUCTION OF OF SOUTH INDIAN HISTORY INAUGURATED AT BRAOU
32nd annual conference of South Indian Numismatics Society
Hyderabad : Dr. B.R. Ambedkar Open University (BRAOU), Department of History, in collaboration with South Indian Numismatics Society and Telangana State Council of Higher Education today Inaugurated the two days National Conference on “Numismatics – Reconstruction of South Indian History and XXXII Annual Conference of South Indian Numismatics Society” on 10th March, 2024 at University Campus, Jubilee Hills, Hyderabad.
The Chief Guest Chief Guest Prof. V. Kihsan Rao, Member of Archival Board, NAI, Former Registrar Osmania university, advised Historians to Look back to propel forward. He was of the view that everyone had knowledge and they were an encyclopedia in themselves. Numismatics is a source of inspiration and plays a major role in construction or reconstruction of History. He said that every Historian should go to the spot of ancient discoveries to record their observations. learning is an everyday process and it should be continuous activity for every student of History.
Keynote speaker Prof Raja Reddy recalled the contribution of Satavahanas to ancient history. He stated that the Satavahanas had literary works of outstanding merits. in the World history the place of the Satavahanas has special mention. one-third of 1 BC was ruled by them. Inscriptions, Coins and Literary works are the perfect documentations of History.
Two inscriptions were found in the last 30 years in Karimnagar, the latest was as early as 10 days ago. The existence of Chemuka Satavahana was found through coins. 420 panchmad coins were found in Karimnagar and 10 coins in Esampally. Satavahans had the traditon of putting Siri or Sri on their coins. Finally, he advised young people to study coins because they gave accurate information.
Prof E Sudha Rani Seminar Director and Director GRCRD
Presided over the function. She highlighted the Indian Historical movements and importance of Indian history. She has suggested the research scholars to record the each and every evidence whatever they find at the time of research and advised to explore the history of that particular evidence and record it for future generations.
Prof. K. P. Rao, Department of History, University of Hyderabad., Dr. Sathya murty, Director ASI (Kerala), Dr Radha Krishna, Museum Curator, RBI., South Indian Numismatics Society. Prof. A. V. N. Reddy, Registrar, Prof. Vaddanam Srinivas, Dean, Social Sciences, Dr. G.Dayakar, Local Secretary and Head Dept. of. History were spoke on this occasion. All Deans, Directors, Heads of Branches, other Universities historians, Heads of the Branches, Representatives of the various services associations, members of teaching and non-teaching are participated.