हैदराबाद : राउडी हीरो विजय देवराकोंडा और खूबसूरत हीरोइन मृणाल ठाकुर फिल्म ‘फैमिली स्टार’ में एक साथ अभिनय कर रहे हैं। मालूम हो कि पहले ही रिलीज हो चुके टाइटल लुक, झलकियां, टीजर और गानों ने फिल्म से काफी उम्मीदें बढ़ा दी हैं। परशुराम द्वारा निर्देशित यह फिल्म 5 अप्रैल को सिनेमाघरों में रिलीज होने के लिए पूरी तरह तैयार है। इसके साथ ही फिल्म की टीम सिलसिलेवार प्रमोशन में हिस्सा ले रही है। इसी क्रम में विजय देवरकोंडा ने फिल्म फैमिली और अपनी निजी जिंदगी को लेकर कई दिलचस्प टिप्पणियां की है।
अभिनेता देवरकोंडा ने कहा, “दर्शकों को “फैमिली स्टार” फिल्म जरूर पसंद आएगी। क्योंकि यह सार्वभौमिक सामग्री (Universal Content) से निर्मित किया गया है। हम 5 अप्रैल को इस फिल्म को तेलुगु और तमिल भाषाओं में रिलीज़ कर रहे हैं। साथ ही इसे दो हफ्ते बाद हिंदी और मलयालम में भी रिलीज करेंगे। मुझे उम्मीद है कि दर्शक इस फिल्म को पसंद करेंगे।
साथ ही देवरकोंडा ने कहा, “मुझे शादी करने और बच्चों को पैदा करने की बहुत इच्छा है। लेकिन इसके लिए थोड़ा समय लगता है। मगर मैं प्रेम विवाह ही करूंगा। हां, वह लड़की हमारे माता-पिता को भी पसंद आनी चाहिए।” फिलहाल हीरो विजय देवराकोंडा का यह कमेंट वायरल हो रहा है। (एजेंसियां
లవ్ మ్యారేజే చేసుకుంటా, కాని… మనసులోని మాట చెప్సిన హీరో విజయ్ దేవరకొండ
హైదరాబాద్ : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన టైటిల్ లుక్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఇక పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు మూవీ టీం. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సినిమా గురించి, తన పర్శనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
విజయ్ మాట్లాడుతూ.. “మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎందుకంటే ఇది యూనివర్సల్ కంటెంట్‌తో రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే.. రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్ చేయనున్నాం.
ఈ మూవీని తప్పకుండా ఆధారిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పుకొస్తూనే.. “నాకు పెళ్లి చేసుకోవాలని, పిల్లల్నీ కనాలని ఉంది. కానీ దానికి ఇంకా టైం పడుతోంది. అయితే లవ్ మ్యారేజే చేసుకుంటాను. ఆ అమ్మాయి మా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఏజెన్సీలు)