హైదరాబాద్ : భంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 385 వ జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం ఆయన చిత్ర పటానికి ఘనంగా పుష్ప నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామారావు హాజరై మాట్లాడారు. ఉపకులపతి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ గొప్ప మానవతా వాదిగా, భంజారాల ఆరాధ్య దైవంగా కీర్తి పొందినట్లు వివరించారు. శతాబ్దాల క్రితమే సంత్ సేవాలాల్ ఆదర్శ జీవనం చేశారని అది ఇప్పటి ప్రజానికానికి ఆదర్శం అని పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ సెల్ లైసన్ ఆఫీసర్ డా. బానోత్ ధర్మఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమంలో డైరెక్టర్ (అకాడమిక్) ప్రొ. జి. పుష్పా చక్రపాణి; ఈ.ఎం.ఆర్ & ఆర్.సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్; విద్యార్ధి సేవల విభాగ డీన్ డా. బానోత్ లాల్; పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ; ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులు డా. బోజు శ్రీనివాస్, కె. ప్రేమ్ కుమార్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరై ఘనంగా నివాళి అర్పించారు.