हैदराबाद: एलएंडटी प्रोजेक्ट ने ईएनसी को एक सनसनीखेज पत्र लिखकर कहा है कि मेडिगड्डा बैराज में ढह गये क्षेत्र की बहाली हमारी जिम्मेदार नहीं हैं। पत्र में कंपनी ने कहा कि वे तभी आगे बढ़ेंगे जब सरकार मरम्मत की पूरी लागत वहन करने के साथ-साथ एक पूरक समझौता करेंगे।
गौरतलब है कि बैराज ढह जाने के समय प्रोजेक्ट इंजीनियरों ने अलग ही बयान दिया था। उन्होंने कहा था कि रखरखाव की समय सीमा अभी भी है और संपूर्ण नवीकरण लागत निर्माण कंपनी द्वारा वहन की जाएगी। चुनाव के दौरान इंजीनियरों द्वारा दिया गया बयान और निर्माण कंपनी द्वारा ताजा दिए गए बयान से मेल नहीं खाता है। इसके चलते यह मुद्दा एक बार फिर विवादास्पद हो गया है।
बैराज ढह गये जगह पर स्तंभ और पिलर्स में क्या हुआ इस बात का पता लगाने के लिए उस क्षेत्र में पानी के प्रवेश करने से रोकने के लिए एक कॉफ़र बांध का निर्माण करने की जरूरत है। इसकी लागत 55.75 करोड़ रुपये होगी और इस रकम के लिए समझौते पर हस्ताक्षर करने के लिए एलएंडटी ने इस महीने की 2 तारीख को कालेश्वरम ईएनसी वेंकटेश्वरलू को पत्र लिखा है। सिंचाई विभाग ने कहा है कि क्षतिग्रस्त बैक और पिलर्स की मरम्मत के लिए 500 करोड़ रुपये तक का खर्च आएगा।
एलएंडटी के ताजा पत्र में यह स्पष्ट किया गया है कि सरकार को मेडीगड्डा बैराज के पुनर्वास की लागत वहन करनी चाहिए। इसके चलते यह मुद्दा एक बार फिर गर्म विषय बन गया है। चुनाव के दौरान बीआरएस के प्रमुख नेताओं ने यह भी घोषणा की कि निर्माण कंपनी के नवीनीकरण के बारे में चिंता करने की कोई जरूरत नहीं है।
మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ ఈఎన్సీకి సంచలన లేఖ రాసింది. రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని సంస్థ లేఖలో పేర్కొంది.
బ్యారేజీ కుంగిన సమయంలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణ ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంజినీర్లు చేసిన ప్రకటనకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రకటనకు పొంతన లేక పోవడంతో మరో సారి ఈ అంశం వివాదాస్పదమవుతోంది.
బ్యారేజీ కుంగిన చోట పియర్స్, పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు .55.75 కోట్లు ఖర్చు అవుతుందని ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని ఎల్‌అండ్‌టీ ఈ నెల 2న కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది. దెబ్బతిన్న బ్యాక్, పియర్స్‌ను రిపేర్ చేయడానికి రూ.500 కోట్లు వరకు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
తాజాగా ఎల్‌అండ్‌టీ లేఖలో మేడిగడ్డ బ్యారేజీ పునురుద్ధరణకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేయడంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కీలక నేతలు సైతం నిర్మాణ సంస్థ పునరుద్ధరణ పనులు చేపడుతుందని.. ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రకటించగా తాజా లేఖతో గులాబీ పార్టీ చిక్కుల్లో పడినట్లయింది. (ఏజెన్సీలు)