हैदराबाद: नेशनल हैंडबॉल एसोसिएशन (HAI) के महासचिव अर्शिनापल्ली जगनमोहन राव को हैदराबाद क्रिकेट एसोसिएशन (HCA) का नया अध्यक्ष चुना गया है। सत्तारूढ़ बीआरएस पार्टी के समर्थन से वह सिर्फ एक वोट से जीत गये। लेकिन प्रतिद्वंद्वी अमरनाथ पुनर्मतगणना की मांग कर रहे हैं। शुक्रवार को हुए हैदराबाद क्रिकेट एसोसिएशन के चुनाव शांतिपूर्ण ढंग से संपन्न हो गए।
कड़ी सुरक्षा के बीच मतदान सुचारू रूप से चला। कुल वोटों की संख्या 173 थी। डाले गए वोटों की संख्या 169 थी। गिनती भी सुचारू रूप से हुई। जीत का जश्न भी जबरदस्त किया गया। काउंसलर के तौर पर सुनील अग्रवाल की जीत हुई और उनके पैनल ने जश्न मनाया।
क्रिकेटर वीवीएस लक्ष्मण, वेंकटपति राजू, मिताली राज, श्रावंती और कई अन्य लोगों ने एचसीए चुनाव में मतदान के अपने अधिकार का प्रयोग किया। मतदान करने वालों में आईपीएस सज्जनार और वरिष्ठ कांग्रेस नेता वीएच शामिल थे। तीन बजे मतदान पूरा हो गया। चार बजे से गिनती शुरू हुई। वहीं अध्यक्ष, उपाध्यक्ष, सचिव, संयुक्त सचिव, कोषाध्यक्ष, पार्षद इन छह पदों के लिए चार पैनल चुनावी अखाड़े में उतरे हैं।
హెచ్‌సీఏ కొత్త బాస్‌గా జగన్‌మోహన్ రావు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్ రావు ఎన్నికయ్యారు. అధికార బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ప్రత్యర్థి అమర్నాథ్ రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అయితే రీకౌంటింగ్ లోనూ ఒక్క ఓటు తేడాతో జగన్ మోహన్ రావు గెలుపొందారు.
శుక్రవారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ సజావుగా సాగింది. మొత్తం ఓట్ల సంఖ్య 173. పోలైనవి 169. కౌంటింగ్ కూడా సాఫీగా సాగింది. గెలుపు సంబరాలు కూడా జోరందుకున్నాయి. కౌన్సెలర్‌గా సునీల్ అగర్వాల్ గెలవడంతో ఆయన ప్యానెల్ సంబరాలు జరుపుకుంది. క్రికెటర్స్ VVS లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలిరాజ్,స్రవంతి సహా పలువురు తమ HCA ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఐపీఎస్ సజ్జనార్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఓటు వేసిన వారిలో ఉన్నారు. మూడు గంటలకు పోలీంగ్ పూర్తయింది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కాగా ప్రెసెడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ ఈ 6 పదవుల కోసం నాలుగు ప్యానెల్స్ ఎన్నికల బరిలో దిగాయి.