हैदराबाद: ऐसे लग रहा है कि तेलंगाना में विधानसभा चुनाव इस बार पहले कभी नहीं हुए ऐसे होने वाले है। तेलंगाना में इस बार त्रिकोणीय मुकाबले की पृष्ठभूमि में तीनों प्रमुख पार्टियों के बीच कड़ी टक्कर होने की संभावना है। तीनों पार्टियां सत्ता में आने के लिए एड़ी-चोटी का जोर लगा रही हैं। इसी क्रम में नेता वोटरों को आकर्षित करने के लिए बड़े पैमाने पर नकदी, शराब, सोना-चांदी बांटने को तैयार हो गये हैं। पुलिस ने 10 करोड़ की संपत्ति जब्त किया है।
इसके लिए अभी से इन सभी को अवैध तरीके से स्थानांतरित करने की कोशिश अभी से शुरू हो गई है। तेलंगाना में 30 नवंबर को होने वाले विधानसभा चुनाव के लिए चुनाव कार्यक्रम 9 अक्टूबर को जारी किया गया। उसी दिन से चुनाव संहिता लागू हो गई। हालाँकि, जिस दिन से संहिता लागू हुई है, हैदराबाद सिटी पुलिस शहर भर में व्यापक जाँच कर रही है और अवैध नकदी, शराब, ड्रग्स और मतदाताओं को लुभाने वाली अन्य वस्तुओं को जब्त कर रही है।
पुलिस ने 9 अक्टूबर से 11 अक्टूबर की सुबह तक की गई औचक जांच के दौरान बड़ी मात्रा में नकदी, शराब और अन्य सामान जब्त किया। इन निरीक्षणों के दौरान पुलिस ने 4.2 करोड़ रुपये मूल्य का 7.706 किलोग्राम सोना और 8.77 लाख रुपये मूल्य की 11,700 किलोग्राम चांदी जब्त की। इसके अलावा बिना किसी सबूत के ले जा रहे 5.1 करोड़ कैश पकड़ा गया। पुलिस ने खुलासा किया कि 110 लीटर शराब, 23 मोबाइल फोन और 43 क्विंटल राशन चावल जब्त किया है। ये सब सिर्फ हैदराबाद शहर में हुआ। पुलिस द्वारा जगह-जगह की जा रही चेकिंग में बड़ी मात्रा में नकदी और सोना जब्त किया जा रहा है।
स्थानीय पुलिस, उड़न दस्ता टीमें, टास्क फोर्स और अन्य विभाग चौबीसों घंटे निगरानी और सभी वाहनों की गहन जांच कर रहे हैं। पुलिस ने जनता से अपील की है कि वे अपने क्षेत्र में किसी भी संदिग्ध गतिविधि की तुरंत सूचना दें।
ఎన్నికలు: హైదరాబాద్‌లో రూ.10 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
హైదరాబాద్: తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో త్రిముఖ పోరు జరగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని మూడు పార్టీలు శాయాశక్తులా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం, బంగారం, వెండి పంచేందుకు సిద్ధమయ్యారు నేతలు. హైదరాబాద్‌లో రూ.10 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
అందుకోసం ఇప్పటి నుంచే వాటన్నింటినీ అక్రమంగా తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి కూడా. తెలంగాణలో నవంబర్ ౩౦వ తేది జరగనున్న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే.. కోడ్ అములులోకి వచ్చిన రోజు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్‌తో పాటు ఓటర్లను ప్రలోభ పెట్టే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు.
అక్టోబర్ 9 నుంచి 11 ఉదయం వరకు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో 4.2 కోట్లు విలువ చేసే 7.706 కిలోల బంగారం, 8.77 లక్షలు విలువ చేసే 11.700 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక.. ఎలాంటి ఆధారాలు లేని 5.1 కోట్ల నగదును పట్టుకున్నారు. అంతేకాదు 110 లీటర్ల మద్యాన్ని, 23 మొబైల్ ఫోన్స్, 43 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదంతా కేవలం హైదరాబాద్ నగరంలోనే కాగా.. ఇక రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు.
స్థానిక పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, టాస్క్ ఫోర్స్‌తో పాటు ఇతర విభాగాలు 24 గంటలు పర్యవేక్షిస్తూ అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తు్న్నారు. ప్రజలంతా కూడా తమ ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం అందజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. (ఏజెన్సీలు)