हैदराबाद: मालूम हो कि सीआईडी अधिकारियों ने कौशल विकास घोटाला (Skill Development Scam) मामले में पूर्व मुख्यमंत्री और टीडीपी प्रमुख चंद्रबाबू नायडू को गिरफ्तार कर लिया है। चंद्रबाबू इस समय राजमंड्री जेल में विचाराधीन कैदी के रूप में बंद है। हर दिन की तरह गुरुवार को भी जल्दी उठे और पहले योग किया। इसके बाद अखबार पढ़े।
MIDHANI
खबर है कि जन सेना पार्टी के प्रमुख पवन कल्याण और टीडीपी विधायक बालकृष्ण गुरुवार को चंद्रबाबू से मुलाकात करेंगे। चंद्रबाबू इस मुलाकात के दौरान बालकृष्ण को राज्य में हो रहे ताजा राजनीतिक घटनाक्रम और पार्टी नेताओं द्वारा किए जाने वाले कार्यक्रमों के बारे में सुझाव देंगे।
गौरतलब है कि चंद्रबाबू सरकार के दौरान राज्य में युवाओं को कौशल विकास प्रशिक्षण देने के लिए सीमेंस और डिजाइनटेक कंपनियों ने 3300 करोड़ रुपये का समझौता किया था। एक समझौता हुआ कि सरकार 10 प्रतिशत धनराशि देगी और सीमेंस शेष 90 प्रतिशत का भुगतान करेगी। चंद्रबाबू सरकार ने राज्य सरकार की ओर से 10 फीसदी हिस्सेदारी के तौर पर जीएसटी समेत 370 करोड़ रुपये का भुगतान किया है।
संबंधित खबर:
एपी सीआईडी ने मामला दर्ज किया है कि सरकार द्वारा भुगतान किए गए 370 करोड़ रुपये में से 240 करोड़ रुपये सीमेंस कंपनी के नाम के बजाय डिजाइनटेक कंपनी को हस्तांतरित कर दिए गए। आरोप है कि कैबिनेट को गुमराह किया गया और फिर कॉन्ट्रैक्ट में दूसरा डाल दिया और पैसे का भुगतान कर दिया। पिछले कुछ समय से इसकी गहनता से जांच कर रही सीआईडी ने कई लोगों के खिलाफ केस भी दर्ज किया है। इस मामले में चंद्रबाबू ए-1 और अच्चेन्नायडू ए-2 हैं।
తెల్లవారుజామునే నిద్రలేచి చంద్రబాబు నాయుడు జైలులో ఏం చేస్తున్నారో తెలుసా?
హైదరాబాద్: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ (Skill Development Scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న ఆయన గురువారం తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా యోగా చేసి తర్వాత పేపర్ చదివినట్లు సమాచారం.
ఇవాళ చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ములాఖత్ కానున్నారు. ఈ ములాఖత్‌లో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతలు చేయాల్సిన పనులను బాలకృష్ణకు చంద్రబాబు సూచించనున్నట్లు సమాచారం.
కాగా, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10 శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి 370 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది.
ప్రభుత్వం చెల్లించిన 370 కోట్లలో 240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. (ఏజెన్సీలు)