అందరికీ నమస్కారం!
ప్రధానంగారోజురోజుకు నిర్వీర్యం అవుతున్న నందలూరు రైల్వే కేంద్రం నుంచి మరో ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. అన్ని ప్రయత్నాలు అందరికీ తెలుసు. వందేళ్ళ కిందట సదరన్ రైల్వే (తమిళనాడు)ఉండేది. అప్పట్నుంచి నందరు రైల్వే కేంద్రం వైభవంగా వెలుగొందింది. స్టీమ్ ఇంజిన్ లోకో షెడ్ ఏర్పాటు నుంచి నందలూరు దశతిరిగింది. ఫలితంగా రైల్వే అంటే నందలూరు అన్నట్టుగా కొనసాగింది.
దక్షిణ మధ్య రైల్వేలో నందలూరు వెళ్లిపోయిన తర్వాత అంతరించిపోయింది. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్లో నందలూరు రైల్వే కేంద్రం ఉన్నంతవరకు అభివృద్ధి జరిగే ప్రసక్తే లేదు. ఈ విషయం తేలిపోయింది. నందలూరు రైల్వే కేంద్రంపై ఉద్దేశపూర్వకంగా గుంటకల్ రైల్వే డివిజన్ అధికారులు పాజిటివ్ ఉన్న నెగటివ్ గా తీసుకెళ్లడం జరుగుతుంది.
మన పాలకులు నందలూరు పూర్వం కోసం రైల్వే మంత్రిని కలిసిన. ఎంఆర్ నుంచి నివేదిక కోరిన దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ నుంచి మాత్రం నెగటివ్ గానే రిపోర్టు పంపుతున్నారు. లోక్సభలో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ స్థాయిలో నందలూరు రైల్వే అంశం వెళ్లిన అధికారుల ప్రతికూల నివేదికల కారణంగానేడు నందలూరు రైల్వే కేంద్రం నిర్వీర్యంగా మారింది. ఇదంతా ప్రతి ఒక్కరికి తెలుసు. తమిళనాడుతో నందలూరు రైల్వే కేంద్రానికి విడదీయరాన్ని అనుబంధం ఉంది. ఇప్పటికీ నందలూరులో తమిళవాసన జీవనం కొనసాగుతోంది.
ఏకంగా అరవపల్లి అనే గ్రామం కూడా నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీలో ఉంది. ఇప్పటికీ నందలూరులో తమిళనాడు కల్చర్ కొనసాగుతోంది. దక్షిణ మధ్య రైల్వేలోకి విలీనం కాకముందు నందలూరు సదన్ రైల్వేలో ఉన్నందువల్ల తమిళ ఆ వాసంగా మారింది. నందలూరు టు అరకోణం వరకు వేలాది మంది ఉద్యోగులు కార్మికులు విధులు నిర్వహించేవారు. తమిళ కుటుంబాలు కూడా అటో తమిళనాడులో ఇటు నందలూరులోనూ స్థిరపడి ఉన్నారు.
ఈ నేపథ్యంలో నందలూరును సదన్ రైల్వేలో తిరిగి విలీనం చేయాలన్న డిమాండ్ ను తెరపై తీసుకొస్తున్నాం ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను త్వరలో కలిసి విన్నవించాలని అనుకున్నాం. ఐకెపిఎస్ ఆధ్వర్యంలో సీఎం స్టాలిన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.
ఇది ఫలిస్తే నందలూరు రైల్వే కేంద్రానికి మహర్దశ కలిగినట్లే. సదన్ రైల్వేకి సరిహద్దు చేసింది నందలూరు నిలబడితే రైల్వే పరంగా అభివృద్ధి అన్ని అవకాశాలు ఉంటాయి. సి ఎం స్టాలిన్ సానుకూలంగా స్పందించి కేంద్రానికి నందలూరు వరకు సదన్ రైల్వేకి కలపాలని కోరితే. కోరాలని మనం విన్నవించుకుందాం. దక్షిణ దక్షిణ మధ్య రైల్వే వద్దు సదరన్ రైల్వే ముద్దు అన్న నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేసుకుందాం ఇదే చివరి అవకాశం. నేతలందరూ రాజకీయాలకు అతీతంగా కలిసి వస్తేనే నందలూరు రైల్వేకి ఉజ్వల భవిష్యత్తు.
ఇట్లు
రైల్వే ఐక్య పోరాట సమితి (ఐకెపిఎస్)