ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు బండి సంజయ్‌ బహిరంగ లేఖ, విషయం…(Four News)

గౌరవనీయులైన శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్, హైదరాబాద్.

విషయం : రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ ను విడుదల చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ…

నమస్కారం…

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం అసలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులతోపాటు పెన్షనర్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో.. ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా..

ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలివ్వడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు సైతం సకాలంలో పెన్షన్ ను ఇవ్వకపోవడం దారుణం. గత రెండు నెలలుగా చాలా జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు వ్రుద్దాప్యలో అనేక ఆరోగ్య సమస్యలుంటాయి. ఆసుపత్రులకు, మెడిసిన్, పౌష్టికాహారం కోసం డబ్బులు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇది తెలిసి కూడా వారికి పెన్షన్ సకాలంలో చెల్లించకపోవడం అమానవీయం.

ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ మీ పాలనా పుణ్యమా అని అప్పుల కుప్పగా మారింది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు అదే రోజున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన మీ మాట ప్రకటనలకే పరిమితమైంది. నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలాది మంది మంది రిటైర్డ్ ఉద్యోగులది ఇదే పరిస్థితి.
ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్‌ను నిర్వీర్యం చేసి, వారికి వైద్య సేవలు అందకుండా చేశారు. ప్రమోషన్లు, పోస్టింగుల్లో మీ వందిమాగదులను నియమించుకుని, అర్హులకు అన్యాయం చేశారు. మీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఎన్నో విలువైన సూచనలు చేసినా అమలు చేసిన దాఖలాల్లేవు. ఇదేనా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే..?

ఈ నెలాఖరుతో మొదటి PRC గడువు ముగియబోతోంది. వచ్చే నెల నుండి కొత్త PRC అమల్లోకి రావాలి. కానీ ఇప్పటి వరుకు మీరు కనీసం PRC కమిషన్ ను నియమించకపోవడమంటే ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే. కొత్త పీఆర్‌సీ అసలు అవసరమే లేదని, ఉద్యోగులు, పెన్షనర్లు మీకు ఓటెయ్యరని మీరు మీ సన్నిహితులతో అన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయి.

మీరు ఇచ్చే హామీలు, కొట్టే కొబ్బరి కాయలన్నీ ఓట్ల కోసమేనని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు‌. కానీ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలోనూ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుండడం బాధాకరం. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలన్నది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రమన్న విషయాన్ని మీరు పూర్తిగా విస్మరించారు. మీకు ఓట్లు, సీట్లే తప్ప ప్రజల బాగోగులు పట్టకపోవడం దుర్మార్గం. ఒకవేళ ఓట్ల కోణంలో ఆలోచించినా‌ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు రాష్ట్రంలో 30 లక్షలకు పైనే ఉన్నాయనే విషయాన్ని విస్మరించడం శోచనీయం.

తక్షణమే పెన్షనర్లందరికీ పెన్షన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. తక్షణమే పీఆర్సీ వేసి ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్న విధంగా వేతనాలు, డీఏ పెంచాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం.

భారత్ మాతాకీ జై…

బండి సంజయ్ కుమార్, ఎంపీ,
అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి

కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్నది కేసీఆరే

ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

హైదరాబాద్: బండి సంజయ్ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్. బండి సంజయ్ కి ఎవరో హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న సుభాష్…. బిజెపిలో ఎవరి ప్రాధాన్యత వారికే ఉంటుందని పేర్కొన్నారు. బండి సంజయ్ పాదయాత్రలతో… అధికార బీఆర్ఎస్, దాని బీ టీమ్ అయిన కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టాయని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చీకటి ఒప్పందం జగమెరిగిన రహస్యమేనని సుభాష్ వెల్లడించారు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులు పంపించారని ఆరోపించారు.

2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లారో… ప్రజలకు తెలుసన్నారు. అలానే కాంగ్రెస్ లో గెలిచే ఎమ్మెల్యేలు… చివరికి వెళ్ళేది బీఆర్ఎస్ పార్టీలోకేనని పునరుద్ఘాటించారు. ఎన్.వి సుభాష్. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్’ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరికి కాంగ్రెస్ పార్టీలో టిపిసిసి సహా… ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలో డిసైడ్ చేసేది ప్రగతి భవన్ నుంచి కేసీఆరేనని చెప్పుకొచ్చారు.

ఇకపోతే… తెలంగాణ లో కాంగ్రెస్ కు ఓటేస్తే… బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టేనని… ఈ విషయంలో ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. మరోవైపు బండి సంజయ్ పాదయాత్రతో బిజెపికి పెరిగిన గ్రాఫ్ ను చూసి కేసీఆర్ గుండెల్లో వణుకు మొదలైందని.. అందుకే కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు ఎన్ వి సుభాష్.ఇవన్నీ తెలిసినా కూడా… పొన్నం ప్రభాకర్ ఏమీ తెలియనట్టు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో 30 మంది అభ్యర్థులకి కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నది వందకి వందశాతం నిజమని నొక్కిచెప్పారు. మరోవైపు తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక పార్టీ మోడీ నేతృత్వంలోని బీజేపీనే అని… మోడీ పాలనలో అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయం. అది ఎవరైనా సరే అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ వెల్లడించారు.

22న సంచలనం స్రుష్టిద్దాం– బండి సంజయ్

-27 నుండి ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ కార్యక్రమాలు

-21న ‘యోగా డే’ ను విజయవంతం చేయండి

-బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్

హైదరాబాద్: ‘‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 22న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలోని కార్యకర్త మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ తమ తమ పోలింగ్ పరిధిలో సగటున వంద ఇండ్లకు వెళ్లి సంచలనం స్రుష్టించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

• రేపు శక్తి కేంద్రాల వారీగా సమావేశం నిర్వహించి ఎవరెవరు ఏ గల్లీలో తిరిగి ప్రజలను కలవాలనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఏ ఇంటికి వెళ్లినా ఆ ఇంటికీ నరేంద్రమోదీ పాలనా విజయాలు, ప్రజలకు చేసిన మేలుపై ప్రచురించిన కరపత్రాలను పంచడంతోపాటు 90909024 నెంబర్ కు డయల్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చేలా చూడాలని కోరారు.

• ఈనెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ‘‘యోగా డే’’ కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

• పోలింగ్ బూత్ ను శక్తివంతం చేయడమే లక్ష్యంగా ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ పేరిట ఈనెల 27 నుండి జూలై 5 వరకు కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈనెల 27న కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని తెలిపారు.

• ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ లో భాగంగా పార్లమెంట్ కు 10 మంది చొప్పున తెలంగాణ నుండి 170 మందిని ఎంపిక చేశామన్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోలింగ్ బూత్ కమిటీలపై బలోపేతంపై ద్రుష్టి సారిస్తారని చెప్పారు.

• తెలంగాణకు సైతం ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 900 మంది కార్యకర్తలు ఈనెల 27న వస్తున్నారని, వీరంతా 7 రోజులపాటు ప్రతి శక్తి కేంద్రంలో పర్యటించబోతున్నట్లు తెలిపారు.

ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్న బీజేపీ

-‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో 22న ప్రజల వద్దకు వెళ్లనున్న కమలనాథులు

-పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు

-ఒక్కో బూత్ అధ్యక్షులు కనీసం వంద మంది కుటుంబాలను కలిసేలా కార్యాచరణ

-రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు

హైదరాబాద్: నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈనెల 22న ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు.

• రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలున్నాయి. ప్రతి పోలింగ్ కమిటీ అధ్యక్షుడు తమ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఈనెల 22న వంద కుటుంబాలను కలిసి నరేంద్రమోదీ పాలనలో జరిగిన అభివ్రుద్ధిని వివరించడంతోపాటు ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికీ పంచనున్నారు. దీంతోపాటు స్టిక్కర్లను అంటించనున్నారు.

• బండి సంజయ్ సైతం ఆరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటిస్తారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలు, ప్రజలకు జరిగిన మేలును వివరించడమే కాకుండా కరపత్రాలను సైతం అందజేయనున్నారు.

• అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిసహా రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకులు, జాతీయ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలంతా ఆరోజు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పర్యటించి ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలవనున్నారు.

• మహా జనసంపర్క్ యాత్రలో భాగంగా ఈనెల 22 నుండి 30 వరకు ఇంటింటికీ బీజేపీ పేరుతో బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని కలిసి నరేంద్రమోదీ పాలనను వివరించడంతోపాటు ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బీజేపి మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి గీతా మూర్తి అరెస్ట్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ముగ్గురు విద్యార్థినులు మొన్న ఆత్మ హత్య చేసున్నారు. ఆ సందర్భంగా ఈ రోజు ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి కారణాలు తెలుసుకోవాలని, సహ విద్యార్థినులకు భరోసా ఇద్దామని వెళ్లిన బీజేపి మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి గీతా మూర్తి ని, ఇతర బీజేపి నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళారు.

పోలీస్ స్టేషన్ లో బీజేపి నేతలకు, పోలీసులకు వాగ్వాదం నడుస్తోంది. కేవలం పరామర్శించడానికి, కారణం తెలుసుకోవడానికి వెళితే అరెస్ట్ చేస్తారా అని గీతా మూర్తి పోలీసుల మీద మండి పడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X